Siddu Jonnagadda Web Series: 'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ హిట్స్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఓటీటీ వెబ్ సిరీస్‌పై ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సిద్దూ జొన్నలగడ్డ, క్యూట్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ వెబ్ సిరీస్‌పై డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా స్పందిస్తూ రిలీజ్ టైమ్‌లైన్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
థియేట్రికల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సమపాళ్లలో..

ఒకేసారి థియేట్రికల్ సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌ను ఎలా మేనేజ్ చేస్తున్నారనే ప్రశ్నకు వెంకీ అట్లూరి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "మొదటిగా చెప్పాలంటే నాకు ఖాళీగా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. ఖాళీగా కూర్చుంటే మైండ్‌లోకి లేనిపోని అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు పెరుగుతాయి" అని ఆయన అనడం విశేషం.
వెబ్ సిరీస్ చేయడం అనేది తనకు ఒక కొత్త స్పేస్ అని, అది సరికొత్త దృక్పథాన్ని ఇస్తుందని చెప్పారు. "జిమ్‌లో వర్కవుట్ చేసినట్లే, వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ చేయడం అనేది నాకో కేవలం ఒక క్రియేటివ్ ఎక్సర్‌సైజ్ లాంటిది" అని వెంకీ అట్లూరి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఈ ఏడాది రిలీజ్ లేదు.. నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా వెంకీ అట్లూరి డిజిటల్ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.
గతంలో వచ్చిన వార్తల ప్రకారం ఈ డిజిటల్ సిరీస్ 2026లోనే గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై వెంకీ అట్లూరి స్పందిస్తూ, ఈ సిరీస్ 2026లో రావడం లేదని స్పష్టం చేశారు.
ఔట్పుట్ ఎంతో అద్భుతంగా వస్తోందని, క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. బ్యాంక్ హైస్ట్ స్టోరీతో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వస్తుందని వెల్లడించారు.
స్టార్ బాయ్ - వెంకీ అట్లూరి మేజిక్
{{/usCountry}}ఔట్పుట్ ఎంతో అద్భుతంగా వస్తోందని, క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. బ్యాంక్ హైస్ట్ స్టోరీతో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వస్తుందని వెల్లడించారు.
స్టార్ బాయ్ - వెంకీ అట్లూరి మేజిక్
{{/usCountry}}'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' లాంటి సంచలన విజయాలతో యంగ్ ఆడియన్స్‌లో ఊపేస్తున్న సిద్దూ జొన్నలగడ్డ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న తొలి డిజిటల్ ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండటం ప్రాజెక్ట్‌కి మరింత ప్లస్ అయింది.
ప్రస్తుతం సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ పూర్తి చేసిన వెంకీ.. మూవీ రిలీజ్ కోసం చూస్తున్నారు. ఆగస్ట్ 14న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మధ్యే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
ఇక 2027 ప్రారంభంలోనే వెంకీ వెబ్ సిరీస్ ను డిజిటల్ స్ట్రీమింగ్‌కి తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ముందడుగు వేస్తున్నారు. సిద్దూ జొన్నలగడ్డ మార్క్ కామెడీ, వెంకీ అట్లూరి ట్రెండీ డైలాగ్స్ ఈ సిరీస్‌ను ఓటీటీలో సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలబెడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.