Siddu Gadi Love Story: అమెరికాలో జాబ్ చేస్తూనే దర్శకత్వం- హీరోగా మనోజ్- సుమన్ కీలక పాత్రతో సిద్దుగాడి లవ్ స్టోరీ

Siddu Gadi Love Story Release Date: అమెరికాలో ఉద్యోగం చేస్తూనే తెలుగు సినిమాపై మక్కువతో రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వం వహించిన చిత్రం 'సిద్ధుగాడి లవ్ స్టోరీ'. మనోజ్, శృతి, మోహన సిద్ధి జంటగా నటించిన ఈ యూత్‌ఫుల్ ప్రేమకథా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published on: Nov 23, 2026, 16:01:19 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Siddu Gadi Love Story Release Date: తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త కథలను అందించేందుకు విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు (NRI) ఇటీవల ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తూనే, చిన్ననాటి సినిమా కలను నెరవేర్చుకునేందుకు హైదరాబాద్ బాట పడుతున్నారు.

అమెరికాలో జాబ్ చేస్తూనే దర్శకత్వం- హీరోగా మనోజ్- సుమన్ కీలక పాత్రతో సిద్దుగాడి లవ్ స్టోరీ
అమెరికాలో జాబ్ చేస్తూనే దర్శకత్వం- హీరోగా మనోజ్- సుమన్ కీలక పాత్రతో సిద్దుగాడి లవ్ స్టోరీ

స్వీయ దర్శకత్వంలో

అదే కోవలో అగ్రరాజ్యంలో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తెలుగు సినిమాపై ఉన్న అపారమైన ప్రేమతో దర్శకుడిగా మారారు రమేష్ బాబు చెరుకూరు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'సిద్ధుగాడి లవ్ స్టోరీ'.

విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి నేటివిటీని మర్చిపోకుండా రమేష్ బాబు ఈ కథను సిద్ధం చేశారు. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న సిద్ధుగాడి లవ్ స్టోరీ సినిమా ఈ నెల 27న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఆకట్టుకుంటున్న టీజర్.. భారీ తారాగణం

యువతను ఆకట్టుకునే ప్రేమకథకు కుటుంబ భావోద్వేగాలను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోగా మనోజ్ నటించగా, ఆయన సరసన శృతి, మోహన సిద్ధి హీరోయిన్లుగా అలరించనున్నారు. సీనియర్ నటుడు సుమన్ హీరో తండ్రిగా కీలక పాత్రలో కనిపించనుండగా, ప్రతినాయకుడిగా సర్కార్ నటించారు.

వీరితో పాటు హాస్యనటులు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించనున్నారు. ఇటీవల విడుదలైన సిద్ధుగాడి లవ్ స్టోరీ సినిమా టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన రావడంతో చిత్ర బృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది.

చిన్ననాటి కలను నిజం చేసుకున్నా: దర్శకుడు రమేష్ బాబు

ఒకవైపు అమెరికాలో ఉద్యోగం, మరోవైపు సినిమా నిర్మాణ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం వెనుక తన అభిరుచే కారణమని దర్శకుడు రమేష్ బాబు తెలిపారు.

"నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. నా మనసులో ఎప్పటి నుంచో ఉన్న సినిమా కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. తెలుగు ప్రేక్షకుల ఆదరణ, ఆశీస్సులతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను" అని రమేష్ బాబు చెరుకూరు పేర్కొన్నారు.

తెరవెనుక సాంకేతిక నిపుణులు వీరే

సిద్ధుగాడి లవ్ స్టోరీ చిత్రానికి దొసాడ యాదగిరి సినిమాటోగ్రఫీ అందించగా, సీఎన్ ఆదిత్య సంగీతం సమకూర్చారు. లక్కీ ఎక్కరి ఎడిటర్‌గా, నాని ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. యాక్షన్ సన్నివేశాలను ఫైట్ మాస్టర్ తూఫాన్ పర్యవేక్షించగా, పాటలకు రజని సాగర్‌తో కలిసి దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు స్వయంగా కొరియోగ్రఫీ అందించడం విశేషం.

సునీల్ స్టూడియోస్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశారు. వి. సాంబశివరావు, వేణుగోపాల చారి చెరుకూరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ చిత్రానికి వైవీ రావు మేనేజర్‌గా, పాము భాను స్టిల్స్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. కొత్తదనంతో కూడిన ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు, మీడియా మిత్రులు ఆదరించి ప్రోత్సహించాలని చిత్ర బృందం కోరుతోంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.