Destiny: హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్- సస్పెన్స్ థ్రిల్లర్‌గా డెస్టినీ- ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నందినీ రెడ్డి

Jabardasth Emmanuel Destiny First Look Released: బుల్లితెరపై నవ్వులు పూయించిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'డెస్టినీ'. చందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Published on: Oct 17, 2026, 10:50:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Jabardasth Emmanuel Destiny First Look Released: తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు హీరోగా సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డెస్టినీ'.

హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్- సస్పెన్స్ థ్రిల్లర్‌గా డెస్టినీ- ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నందినీ రెడ్డి
హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్- సస్పెన్స్ థ్రిల్లర్‌గా డెస్టినీ- ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నందినీ రెడ్డి

డెస్టినీ ఫస్ట్ లుక్ రిలీజ్

కుర్రా ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్రా నిర్మిస్తున్న డెస్టినీ సినిమాకు చందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా డెస్టినీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ మహిళా దర్శకురాలు, మా ఇంటి బంగారం ఫేమ్ నందినీ రెడ్డి శుక్రవారం (అక్టోబర్ 16) ఆవిష్కరించారు.

డైరెక్టర్ నందినీ రెడ్డి కామెంట్స్

"డెస్టినీ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది, చిత్రబృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని దర్శకురాలు నందినీ రెడ్డి పేర్కొన్నారు. గతంలో 'ఓ పిట్ట కథ' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు చందు ముద్దు ఈ సినిమాను విభిన్నమైన కథాంశంతో రూపొందిస్తున్నారు.

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు

కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో వస్తున్న డెస్టినీ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఆమని, బిగ్ బాస్ శ్రీసత్య, రవిప్రకాష్, కిరీటి దామరాజు, శివ కోట్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు హాస్య పాత్రలతో అలరించిన ఇమ్మాన్యుయేల్, ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని తీవ్రమైన, సస్పెన్స్ నిండిన పాత్రలో కనిపిస్తుండటం అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.

ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

తాజాగా విడుదలైన డెస్టినీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దట్టమైన అడవి మార్గంలో ఇమ్మాన్యుయేల్ చేతులకు సంకెళ్లతో కనిపిస్తుండగా, ఆయన పక్కనే ఒక పోలీస్ కానిస్టేబుల్ నడుస్తున్నట్లు ఉన్న దృశ్యాలు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి.

టైటిల్ లోగోలో ఇద్దరి పాత్రల డిజైన్

చుట్టూ ఉన్న నిశ్శబ్ద వాతావరణం కథలో దాగున్న పెద్ద మిస్టరీని సూచిస్తోంది. 'డెస్టినీ' అనే టైటిల్ లోగోలోనే ఈ ఇద్దరి పాత్రల డిజైన్‌ను పొందుపరచడం చూస్తుంటే, సినిమా కథంతా వీరి ప్రయాణం చుట్టూనే తిరుగుతుందని స్పష్టమవుతోంది.

బలమైన సాంకేతిక బృందం

డెస్టినీ చిత్రానికి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలతో పాటు దర్శకత్వ బాధ్యతలను చందు ముద్దు స్వయంగా చూసుకుంటున్నారు. ప్రాజెక్ట్ ప్లానింగ్ బాధ్యతలను చంద్రహాస్ కోట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చంద్ర బాలాజీ పనిచేస్తున్నారు.

కామెడీ నుంచి థ్రిల్లర్ జోనర్‌లోకి

కామెడీ నుంచి థ్రిల్లర్ జోనర్‌లోకి అడుగుపెడుతున్న ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన డెస్టినీ టీజర్, విడుదల తేదీ వివరాలను నిర్మాతలు ప్రకటించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More