Vihari OTT: టీవీలో 18 ఏళ్ల ప్రయాణం- న్యూ ఓటీటీగా విహారి- యాప్ ప్రోమో లాంచ్- యాంకర్‌గా బిగ్ బాస్ శ్రీసత్య, సుమతో ప్లాన్!
Vihari OTT App Promo Launch: 18 సంవత్సరాలుగా టీవీలో విహారి 'ది ట్రావెలర్' అంటూ అందరినీ అలరిస్తున్న "విహారి" ఇప్పుడు ఓటీటీ యాప్‌గా రానుంది. తాజాగా విహారి ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. మరి విహారి ఓటీటీ యాప్ ఎప్పుడు రానుందనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Vihari OTT App Promo Launch: 2004లో మా టీవీ ఛానెల్‌లో మొదలైన విహారి ది ట్రావెలర్ 18 ఏళ్లుగా ఎన్నో మైలురాళ్లని అధిగమించి ఇప్పుడు ఓటీటీలో తనదైన శైలిలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఏఎల్ నితిన్ వ్యవస్థాపకుడిగా దర్శకుడిగా ఈ ఓటీటీ యాప్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

లెజెండ్రీ యాంకర్‌తో
ట్రావెల్ గైడ్, డీవీడీ'స్, ఫుడ్ రిలేటెడ్‌గా ఎన్నో వీడియోస్ చేసి అలరించింది విహారి. కరుణ, స్నిగ్ధ లాంటి ప్రముఖ యాంకర్స్‌తో కలర్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్స్ ఎన్నో అందించింది విహారి. ఇక ఈ నవంబర్ నుంచి సుమ కనకాల లాంటి లెజెండ్రీ యాంకర్‌తో ఇన్నోవేటివ్ ఎపిసోడ్స్ కూడా స్టార్ట్ టెలికాస్ట్ చేయబోతుంది విహారి.
ఇప్పుడు ఓటీటీ హోస్ట్‌గా బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్యని తీసుకున్నారు. అదేవిధంగా ఈ విహారి ఓటీటీ యాప్‌కి కొలాబరేట్ అయిన సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్, వజ్ర కన్‌స్ట్రక్షన్ రాజు, శ్వేత, యాంకర్ శ్రీ సత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అదేవిధంగా ఈ విహారి ఓటీటీకి టీటీఎఫ్, వేగ జ్యూవెలర్స్ కూడా కోలాబరేట్ అవ్వడం విశేషం.
విహారి ఓటీటీ ప్రోమో లాంచ్
తాజాగా విహారి ఓటీటీ ప్రోమో లాంచ్ జరిగింది. నవంబర్ నెలలో విహారి ఓటీటీ యాప్ లాంచ్ కానుంది. విహారి ఓటీటీ ప్రోమో రిలీజ్ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్ మాట్లాడుతూ.. "2004 నుంచి నితిన్ గారితో పరిచయం ఉంది. విహారి కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. ఆయన ఎంచుకున్న ఆ దారి ఇప్పుడు ఆయన కంటే ఎత్తుగా సక్సెస్‌లో ఎదిగింది" అని అన్నారు.
"మన దేశంలో తెలుగువాళ్లే కాకుండా బయట దేశంలో తెలుగు వాళ్లు కూడా విహారిని సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని చాలామంది చెప్పారు. ఇప్పుడు ఈ ఓటీటీ కూడా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను" అని ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
చిన్నగా ఉన్నప్పుడే
వజ్ర కన్‌స్ట్రక్షన్ రాజు మాట్లాడుతూ.. "విహారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని అసోసియేట్ అవ్వడానికి సిద్ధమయ్యాను. నితిన్ చాలా యాంబిషియస్ & మంచి వ్యక్తి. నితిన్‌తో విహారితో కోలాబరేటడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.
వజ్ర కన్‌స్ట్రక్షన్ శ్వేతా మాట్లాడుతూ.. "నేను చిన్నగా ఉన్నప్పుడే ట్రావెల్ స్టార్ట్ చేయకముందే విహారి ట్రావెల్ ఎపిసోడ్స్ చూసి ట్రావెల్ చేయాలి అనుకునేదాన్ని. ఇప్పుడు అదే విహారి నితిన్ గారితో ఓటీటీ యాప్‌తో కోలాబరేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు.
అప్పుడు శ్రీసత్య గుర్తొచ్చింది
విహారి అధినేత ఏఎల్ నితిన్ మాట్లాడుతూ.. "2004లో విహారి మా టీవీలో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు సపోర్ట్ చేసిన కరుణ, పీజీ వింద, స్నిగ్ధకి చాలా థాంక్స్. ఇప్పుడు ఓటీటీకి ఫేస్ ఆఫ్ ఎవరు అని ఆలోచిస్తే గుర్తుకొచ్చింది శ్రీ సత్య. తను చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్" అని చెప్పారు.
"అదేవిధంగా నాకు ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న టీటీఎఫ్ మహేష్ గారికి సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మాతో కోలాబరేట్ అయిన వజ్ర కన్‌స్ట్రక్షన్ రాజు గారికి, శ్వేత గారికి, వేగ జ్యూవెలర్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అని ఏఎల్ నితిన్ వెల్లడించారు.
హోస్ట్‌గా చేయలేదు
యాంకర్ శ్రీ సత్య మాట్లాడుతూ.. "ప్రతి విషయంలో నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటిదాకా హోస్ట్‌గా నేను దేనికి చేయలేదు. ఫస్ట్ టైం హోస్ట్ అనగానే భయమేసింది, కానీ నితిన్ గారు చాలా సపోర్ట్ చేశారు" అని అన్నారు.
"ట్రావెల్ చేయడం అంటే మనకు మినిమం బడ్జెట్‌లో ఎక్కడ స్టే చేయొచ్చు, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ మనం తిరిగే ప్లేసెస్ ఉన్నాయి అని అన్ని విషయాలని తెలియజేస్తుంది విహారి. థాంక్స్ టు ఆల్ ది స్పాన్సర్. విహారిలో నేను ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. నన్ను సెలెక్ట్ చేసిన నితిన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని శ్రీసత్య చెప్పుకొచ్చారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


