Singeetham Srinivasa Rao: తీవ్ర విషాదం.. దివికేగిన సినిమా సైంటిస్ట్.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
Singeetham Srinivasa Rao: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సినిమాలతో ప్రయోగాలు చేసి, టాలీవుడ్ లో ఐకానిక్ చిత్రాలను తెరకెక్కిించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. అనారోగ్యం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త సినిమా ఇండస్ట్రీని షాక్ కు గురి చేస్తోంది.
Singeetham Srinivasa Rao: భారతీయ చలనచిత్ర రంగానికి అరుదైన ప్రయోగాలు, అపూర్వ దృశ్యకావ్యాలను అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (అక్టోబర్ 3) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ వార్త టాలీవుడ్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
భారతీయ సినిమా చరిత్రలో తనదైన ప్రత్యేక శైలితో, నూతన ప్రయోగాలతో తరతరాల ప్రేక్షకులను అలరించిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. వయోభారంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
94 ఏళ్ల సింగీతం తుదిశ్వాస విడవడంతో టాలీవుడ్‌తో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
భారతీయ సినిమాకు ప్రయోగాల పాఠశాల
సింగీతం శ్రీనివాసరావు సినీ ప్రయాణం అసాధారణమైనది. సాధారణమైన కథలను కాకుండా ఎవరూ ఊహించని, ట్రెండ్‌కు భిన్నమైన పాయింట్లతో సినిమాలు తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. మాటలు లేని సైలెంట్ మూవీగా వచ్చిన 'పుష్పక విమానం' భారతీయ సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది.
ఇక టాలీవుడ్‌లో తొలి టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన 'ఆదిత్య 369' నేటికీ ఒక సంచలనమే. జానపద చిత్రాల శైలిని తిరగరాస్తూ రూపుదిద్దుకున్న 'భైరవ ద్వీపం', వైకల్యాన్ని జయించిన నాట్యమయూరి సుధాచంద్రన్ నిజ జీవిత కథతో తెరకెక్కించిన 'మయూరి' వంటి సినిమాలు ఆయన క్రియేటివ్ మైండ్ కు నిదర్శనం.
94 ఏళ్ల వయసులోనూ
సింగీతం శ్రీనివాసరావును ఇతరులతో పోల్చలేని విధంగా నిలబెట్టేది సినిమా పట్ల ఆయనకు ఉన్న అమితమైన ప్రేమ, మక్కువ. వయసు మళ్లినా ఆయనలోని సృజనాత్మకత ఏమాత్రం తగ్గలేదు. 94 ఏళ్ల వయసులో కూడా ఆయన 'సింగ్ గీతం' (Sing Geetham) పేరిట ఒక వినూత్న మ్యూజికల్ చిత్రాన్ని రూపొందించి సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేశారు.
చివరి శ్వాస వరకు కొత్త ఆలోచనలతో, సాంకేతికతను జోడిస్తూ సినిమాలు తీయాలనే ఆయన తపన నేటి తరం యంగ్ డైరెక్టర్లకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది.
'పుష్పక విమానం', 'ఆదిత్య 369', 'భైరవ ద్వీపం', 'మయూరి' వంటి ఐకానిక్ చిత్రాలతో సినీచరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ లెజెండరీ దర్శకుడి నిష్క్రమణ పట్ల చిత్ర పరిశ్రమ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
దర్శకులకు మార్గదర్శి
టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలోనే విజువల్ ఎఫెక్ట్స్, టైమ్ ట్రావెల్, మూకీ సినిమాలు, జానపద వింతలు తెరకెక్కించిన ఏకైక భారతీయ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. నేడు పాన్-ఇండియా సినిమాలు, మల్టీ-జానర్ సినిమాలు తీస్తున్న ఎంతో మంది యువ దర్శకులకు ఆయన చిత్రాలే ప్రాథమిక పాఠ్యపుస్తకాలుగా ఉపయోగపడ్డాయి. కమల్ హాసన్‌తో ఆయన చేసిన 'అపూర్వ సహోదరులు', 'మైఖేల్ మదన కామరాజు' వంటి చిత్రాలు సినీ చరిత్రలో మైలురాళ్లుగా మిగిలిపోయాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


