...
...
Next Story

అరిజిత్ సింగ్ రిటైర్మెంట్‌పై చిన్మయి రియాక్ష‌న్ వైర‌ల్‌-ఏం మార‌లేదంటూ-కానీ కామెంట్ల‌లో ఫైర్ అయిన సింగ‌ర్‌

ప్లేబ్యాక్ సింగింగ్ నుండి అరిజిత్ సింగ్ షాకింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. అయితే అరిజిత్ వీడ్కోలుపై సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్షన్ వైరల్ గా మారింది. ముఖ్యంగా కామెంట్లలో ఆమె మళ్లీ ఫైర్ అయింది.

Published on: Jan 28, 2026, 08:44:38 IST
Advertisement

మ్యూజిక్ లవర్స్ కు మంగళవారం (జనవరి 27) దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అరిజిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుండి వైదొలగనున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టనని ఆయన తెలిపారు. అరిజిత్ సింగ్ రిటైర్మెంట్ పై చిన్మయి శ్రీపాద రియాక్టయింది. అతనితో పని చేసిన అనుభవాన్ని ఈ సింగర్ పంచుకుంది.

చిన్మయి పోస్ట్

అరిజిత్ సింగ్ రిటైర్మెంట్ పై చిన్మయి రియాక్షన్
అరిజిత్ సింగ్ రిటైర్మెంట్ పై చిన్మయి రియాక్షన్

'మాస్ట్ మగన్', 'సూయీన్ సి' వంటి పాటల్లో అరిజిత్‌తో కలిసి పనిచేసిన గాయని చిన్మయి శ్రీపాద తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చింది. ‘‘ప్రీతమ్ సార్ కోసం రికార్డ్ చేస్తున్నప్పుడు అరిజిత్‌ను కలిసినట్లు నాకు గుర్తుంది. అతను బాలీవుడ్ ను రూల్ చేయడం లేదని చెప్పినట్లు గుర్తుంది. అప్పటికీ ఇంకా 'తుమ్ హి హో' విడుదల కాలేదు. అతను అత్యంత డిమాండ్ ఉన్న సింగర్‌గా మారిన తర్వాత కూడా అతనితో కలిసి పని చేశా. కానీ అతను ఏం మారలేదు’’ అని చిన్మయి పేర్కొంది.

నా ఫేవరెట్

అరిజిత్ సింగ్ గురించి చిన్మయి పెట్టిన పోస్ట్ కు వచ్చిన కామెంట్లు, దానికి ఆమె రియాక్షన్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ‘‘మ్యామ్.. ఓ పురుషుడి గురించి మీరు మంచి విషయాలు చెప్తుంటే చూడటం బాగుంది’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

దానికి చిన్మయి.. ‘‘నాకు వ్యక్తిగతంగా తెలిసిని మగాళ్లలో చాలా మంది మంచివారే. నా చుట్టూ ఉన్నవాళ్లలో ట్విటర్ లో దూషించే లాంటి మనుషుల లేకపోవడం సంతోషం. ఎక్స్ లో చాలా మంది మగవాళ్లు దూషించేవాళ్లే’’ అని రిప్లే ఇచ్చింది.

కలిసి సాంగ్స్

చిన్మయి, అరిజిత్ కలిసి '2 స్టేట్స్' నుండి 'మాస్ట్ మగన్', 'రంగీలా' నుండి ‘సూయీన్ సి’. 'డోంగ్రి కా రాజా' నుండి 'పియా తు పియా' వంటి బాలీవుడ్ రొమాంటిక్ పాటలు పాడారు. అరిజిత్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా రిటైర్మెంట్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 'ఆషికి 2' నుండి వచ్చిన 'తుమ్ హి హో' పాట అతన్ని రాత్రికి రాత్రే సెన్సేషనల్ సింగర్ గా మార్చేసింది. అతను 'బింటే దిల్', 'కేసరియా' పాటలకు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks