అరిజీత్ లేని బాలీవుడ్ మ్యూజిక్ శూన్యమే- ఇది కోహ్లి టెస్టు షాక్ లాంటిదే- స్టార్ సింగర్ రిటైర్మెంట్ పై ఫ్యాన్స్ రియాక్షన్
తన మ్యాజికల్ వాయిస్ తో ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆలపించిన అరిజీత్ సడెన్ షాక్ ఇచ్చాడు. ఇకపై ప్లేబ్యాక్ సింగర్ గా సినిమాల్లో పాటలు పాడనన్నాడు. దీంతో షాక్ అయిన ఫ్యాన్స్ అతను లేని బాలీవుడ్ మ్యూజిక్ శూన్యమే అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది కోహ్లి టెస్టు రిటైర్మెంట్ లాంటిదేనని పోలుస్తున్నారు.
బాలీవుడ్ సినీ లవర్స్ మాత్రమే కాదు ప్రపంచంలోని హిందీ మ్యూజిక్ లవర్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 38 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగింగ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు స్టార్ సింగర్ అరిజీత్ సింగ్ అనౌన్స మెంట్ ఇందుకు కారణం. తుమ్ హి హో, హవాయేం, జాలీమా వంటి బ్యాక్-టు-బ్యాక్ సూపర్ హిట్ పాటలు పాడిన సింగర్ అరిజీత్ మంగళవారం (జనవరి 27) షాకిచ్చాడు. దీనిపై ఫ్యాన్స్ రియాక్షన్ వైరల్ గా మారింది. దీన్ని విరాట్ కోహ్లి టెస్టు రిటైర్మెంట్ తో పోలుస్తున్నారు.

కోహ్లి టెస్టు రిటైర్మెంట్ లా
మంచి ఫామ్, ఫిట్ నెస్ ఉన్నప్పటికీ 2025లో కోహ్లి సడెన్ గా టెస్టులకు గుడ్ బై చెప్పాడు. అప్పుడు ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు అరిజీత్ రిటైర్మెంట్ పోస్టుకు స్పందిస్తూ ఒక అభిమాని.. "ఇది విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ స్థాయి షాక్" అని అన్నాడు.
అతని నిర్ణయం
‘‘అరిజీత్ సింగ్ చెప్పినట్లుగా సంగీతాన్ని కొనసాగిస్తాడు.కానీ సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్ గా పాటలు పాడడు. అభిమానులకు అతను అందుబాటులోనే ఉంటాడు. ఈవెంట్లలో కొన్ని పాటలు మాత్రమే పాడటానికి అతను ఎంచుకుంటాడు. ఇది అతని నిర్ణయం’’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
బాలీవుడ్ మ్యూజిక్ శూన్యం
‘‘అరిజీత్ సింగ్ లేని బాలీవుడ్ మ్యూజిక్ శూన్యం’’ అని మరో అభిమాని బాధ వ్యక్తం చేశాడు. "ఇది నిజమేనా? నిజమైతే, మిక్స్ డ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అతను మాకు 'తుమ్ హి హో', 'బింటే దిల్', 'లాల్ ఇష్క్' వంటి తరతరాల హిట్‌లను అందించాడు. కాబట్టి నేను అతన్ని కళాకారుడిగా ఎల్లప్పుడూ ప్రేమిస్తాను, గౌరవిస్తా. అతనో అద్భుతం’’ అని మరో ఫ్యాన్ రాసుకొచ్చాడు. ‘‘అయ్యో, ఇది ఫేక్ అని నేను అనుకున్నా. ఇది ఫేక్ కావాలని కోరుకుంటున్నా’’ అని మరో అభిమాని ఆందోళన వ్యక్తం చేశాడు.
అనౌన్స్ మెంట్
స్టార్ సింగర్ అరిజీత్ సింగ్ 38 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగింగ్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి కోట్లాది మంది అభిమానులను షాక్ కు గురి చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో.. "హలో, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా నా శ్రోతలుగా నాకు ఇంత ప్రేమను అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇకపై ప్లేబ్యాక్ సింగర్ గా ఎలాంటి కొత్త అసైన్‌మెంట్‌లు తీసుకోబోనని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నా. నేను ఇక విరమిస్తున్నా. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం" అని అరిజీత్ అనౌన్స్ చేశాడు.
నెట్ వర్త్
నివేదికల ప్రకారం అరిజీత్ సింగ్ నెట్ వర్త్ అంచనా విలువ రూ.414 కోట్లు. అతని ఆస్తులలో నవీ ముంబైలో రూ.8 కోట్ల విలాసవంతమైన ఇల్లు ఉంది. రేంజ్ రోవర్, మెర్సిడెస్ వంటి ప్రీమియం బ్రాండ్‌లతో కూడిన లగ్జరీ కార్లుకు అతనికి ఉన్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


