కింగ్ కింగే.. కోహ్లి సెంచరీ నంబర్ 54.. ఛేజింగ్ లో విరాట్ అద్భుత శతకం.. మరో రికార్డు

మరోసారి ఛేదన మొనగాడినని విరాట్ కోహ్లి చాటుకున్నాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయినప్పుడు అద్భుతమైన శతకంతో అదరగొట్టాడు. వన్డేల్లో 54వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. 

Published on: Jan 18, 2026, 21:04:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కింగ్ కింగే.. మరోసారి విరాట్ కోహ్లి ఈ విషయాన్ని ఘనంగా చాటి చెప్పాడు. ఇండోర్ లో న్యూజిలాండ్ తో మూడో వన్డేలో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడ్డ దశలో అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ కొట్టేశాడు విరాట్. వన్డేల్లో కోహ్లీకి ఇది 54వ సెంచరీ. ఛేజింగ్ లో శతకంతో గొప్పగా పోరాడుతున్నాడు ఈ రన్ మెషీన్.

విరాట్ కోహ్లి (AFP)
విరాట్ కోహ్లి (AFP)

విరాట్ కోహ్లి సెంచరీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వన్డేల్లో అదరగొడుతున్నాడు. క్రీజులోకి రావడం, సెంచరీ బాదడం అన్నట్లు అతని తీరు ఉంది. ఆదివారం (జనవరి 18) న్యూజిలాండ్ తో మూడో వన్డేలో మరోసారి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు విరాట్. 91 బంతుల్లో హండ్రెడ్ కంప్లీట్ చేశాడు.

అద్భుత శతకం

కోహ్లీ రీసెంట్ ఫామ్ ను బట్టి చూస్తే సెంచరీ కొట్టడం ఈజీనే అనిపించొచ్చు. కానీ న్యూజిలాండ్ తో మూడో వన్డేలో కోహ్లి సాధించిన శతకం మాత్రం కచ్చితంగా స్పెషల్ అని చెప్పొచ్చు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు విరాట్. 71 స్కోరుకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకున్నాడు. 178/6తో ఓటమి ప్రమాదంలో ఉన్న జట్టును తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో పోటీలోకి తెచ్చాడు.

7 ఇన్నింగ్స్ ల్లో 4 హండ్రెడ్

విరాట్ క్లాస్ బ్యాటింగ్ గురించి, ఫామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 37 ఏళ్ల వయసులోనూ అదిరే బ్యాటింగ్ తో సాగిపోతున్నాడు విరాట్. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కింగ్ కోహ్లి ఇప్పుడు కేవలం వన్డేల్లోనే ఆడుతున్నాడు. గత 7 వన్డే ఇన్నింగ్స్ ల్లో అతను 4 సెంచరీలు బాదాడు. వన్డేల్లో అతనికి ఇది 54వ సెంచరీ. ఓవరాల్ గా అన్ని ఫార్మాట్లలో కలిపి 85వ హండ్రెడ్.

ఈ రికార్డు

న్యూజిలాండ్ తో మూడో వన్డేలో విరాట్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. వేర్వేరు వన్డే వేదికల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. టాప్ లో సచిన్ కొనసాగుతున్నాడు.

ఇండియా గెలిచేనా?

న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఇండియాను గెలిపించేందుకు కోహ్లి అద్భుతంగా పోరాడుతున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు చేసింది. డరిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) సెంచరీలు బాదారు.

భారీ ఛేజింగ్ లో ఇండియా 71కే నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పుడు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (53)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు కోహ్లి. నితీశ్, జడేజా (12) ఔటైనా హర్షిత్ రాణా (52)తో కలిసి పోరాటం కొనసాగించాడు కోహ్లి. కానీ హర్షిత్ ఔట్ తో ఇండియా 277కు 7 వికెట్లు కోల్పోయింది. ఇంకా 38 బంతుల్లో 61 పరుగులు కావాలి. మరి కోహ్లి అద్భుతాన్ని కొనసాగించి ఇండియాను గెలిపిస్తాడేమో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More