...
...
Next Story

కాస్త నోరు మూసుకో.. ఏఆర్ రెహమాన్‌ను కూడా అతనితో కలిసి ఎందుకు పని చేశావని అడిగాను: నెటిజన్‌కు క్లాస్ పీకిన సింగర్

సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి ఓ నెటిజన్‌పై మండిపడింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న జానీ మాస్టర్ తో కలిసి పని చేసిన ఏఆర్ రెహమాన్ ను కూడా తాను నిలదీశానని ఆమె చెప్పింది. ఓ నెటిజన్ తనను నిలదీయడంపై ఆమె తీవ్రంగా స్పందించింది.

Published on: Nov 11, 2025, 17:21:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నాడు. మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి పనిచేసినందుకు రెహమాన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెహమాన్ తో తరచుగా కలిసి పనిచేసే సింగర్ చిన్మయి శ్రీపాద ఈ విషయంలో ఎందుకు స్పందించలేదని ఓ నెటిజన్ ప్రశ్నించినప్పుడు.. తాను రెహమాన్ ను ప్రశ్నించినట్లు సంచలన విషయాన్ని బయటపెట్టింది.

రెహమాన్‌నూ నిలదీశా

కాస్త నోరు మూసుకో.. ఏఆర్ రెహమాన్‌ను కూడా అతనితో కలిసి ఎందుకు పని చేశావని అడిగాను: నెటిజన్‌కు క్లాస్ పీకిన సింగర్
కాస్త నోరు మూసుకో.. ఏఆర్ రెహమాన్‌ను కూడా అతనితో కలిసి ఎందుకు పని చేశావని అడిగాను: నెటిజన్‌కు క్లాస్ పీకిన సింగర్

పెద్ది మూవీ కోసం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి ఫొటో దిగినందుకు, పనిచేసినందుకు ఏఆర్ రెహమాన్ పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక 'ఎక్స్' యూజర్ చిన్మయిని టార్గెట్ చేస్తూ.. రెహమాన్ ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. “అక్క (చిన్మయి) మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రెహమాన్. ఆమెది దొంగల నైజం!!” అని ఆ యూజర్ పోస్ట్ చేశారు.

దీనిపై చిన్మయి ఘాటుగా స్పందిస్తూ ఇలా బదులిచ్చింది. “ఓహ్, దయచేసి నోరు మూసుకో. నేను సర్‌ను (రెహమాన్) అడిగాను. తనకు దీని గురించి ఏమీ తెలియదు అని చెప్పారు. నేను తమిళ చలనచిత్ర పరిశ్రమలోని ముఖ్యమంత్రులను, అతిపెద్ద నటులను కూడా ప్రశ్నించాను” అని చెప్పింది.

కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను

తనపై వేధింపులకు పాల్పడ్డాడని గీత రచయిత వైరముత్తు గురించి చెప్పినప్పటి నుంచీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని ఆమె తెలిపింది. “కోర్టుకు వెళుతూ, వేధింపులకు గురవుతున్నది మీరు కాదు. అందువల్ల శక్తివంతమైన వ్యక్తులు కూడా వేధింపులకు పాల్పడిన వ్యక్తితో పని చేశాడని తెలుసుకొని, నన్ను నిలదీయడం ఆపండి.

మీరంతా మీ ఆదర్శమూర్తులను ప్రశ్నించవచ్చు. నేను ఎల్లప్పుడూ ఈ పనిని చేయలేను. నేను చేశాను. చాలా నష్టపోయాను. చాలా తిట్లు తిన్నాను. చాలా వేధింపులకు గురయ్యాను. మీరు పోగొట్టుకోవడానికి ఏమీ లేని, అజ్ఞాత ట్విటర్ హ్యాండిల్!” అని ఆ యూజర్‌కు చిన్మయి గట్టి సమాధానం ఇచ్చింది.

జానీ మాస్టర్‌తో రెహమాన్

జానీ మాస్టర్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఒక మహిళ.. 2020లో ముంబైలో జరిగిన ఒక వర్క్ ట్రిప్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ తర్వాత కూడా వేధించాడని, బెదిరించాడని ఆరోపించింది. ఆ ఆరోపణ జరిగిన సమయంలో ఆమె మైనర్ అని ఆ స్టేట్‌మెంట్‌లో వెల్లడి కావడంతో, ఇతర సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కూడా నమోదు చేశారు. ఈ ఆరోపణల కారణంగా జానీ మాస్టర్‌కు వచ్చిన నేషనల్ ఫిల్మ్ అవార్డును నిలిపివేశారు. ప్రస్తుతం అతడు బెయిల్‌పై బయట ఉన్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks