భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రేయా ఘోషల్.. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్, తను ఎంచుకునే పాటల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా లేదా అసభ్యకరంగా ఉండే సాహిత్యం పట్ల తానూ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు ఆమె తెలిపింది. అయితే గతంలో ఆమె పాడిన చిక్నీ చమేలీ సాంగ్, దానిని ఇప్పటికీ పలు కాన్సర్ట్ లలో పాడుతుండటంపై విమర్శలు వస్తున్నాయి.
ఆ పాటల విషయంలో అభ్యంతరం

రాజ్ శమని పాడ్‌కాస్ట్‌లో శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. 'చిక్నీ చమేలీ' వంటి హిట్స్ తర్వాత తనకు అలాంటి తరహా పాటలే చాలా వచ్చాయని, కానీ వాటిని తాను తిరస్కరించానని చెప్పింది. "ఒకసారి నా స్నేహితుడైన కంపోజర్ ఒక పాట ఆఫర్ చేశారు. అందులో సాహిత్యం ఎంత అసభ్యంగా ఉందంటే.. ఆ పదాలను తలచుకుంటేనే నాకు సిగ్గు అనిపించింది. అందుకే ఆ పాటను పాడనని చెప్పేశాను" అని ఆమె వెల్లడించింది.
చిక్నీ చమేలీపై క్లారిటీ
ఆమె ఈ తరహా పాటలపై వ్యాఖ్యలు చేయడంతో, కొందరు నెటిజన్లు "పాడను అంటున్నారు కానీ కన్సర్ట్స్‌లో అవే పాటలు పాడుతున్నారు కదా" అంటూ ఆమెను 'హిపోక్రట్' (కపటధారి) అని ట్రోల్ చేశారు. దీనిపై శ్రేయ స్పందిస్తూ.. "చిక్నీ చమేలీ పాట పాడినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. అది నా పాట, నేను దాన్ని ఓన్ చేసుకున్నాను. అయితే ఆ సమయంలో ఆ పాటలోని కొన్ని పదాల అర్థం నాకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు నేను మెచ్యూర్ అయ్యాను. ముఖ్యంగా 5-6 ఏళ్ల చిన్న పిల్లలు ఆ పాటలు పాడుతూ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అందుకే అలాంటి పాటలను రికార్డ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని వివరించింది.
ట్రోల్స్‌కు సమాధానం
"నేను ఆ పాటను వేదికలపై పాడుతాను ఎందుకంటే ప్రేక్షకులు దాన్ని ఇష్టపడతారు. కానీ భవిష్యత్తులో మాత్రం మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉండే సాంగ్స్ పాడను. పర్ఫార్మెన్స్ చేయడం వేరు, కొత్తగా అటువంటి పాటలను రికార్డ్ చేయడం వేరు" అని ఆమె తన వైఖరిని స్పష్టం చేసింది.
ప్రస్తుత ప్రాధాన్యతలు
{{/usCountry}}"నేను ఆ పాటను వేదికలపై పాడుతాను ఎందుకంటే ప్రేక్షకులు దాన్ని ఇష్టపడతారు. కానీ భవిష్యత్తులో మాత్రం మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉండే సాంగ్స్ పాడను. పర్ఫార్మెన్స్ చేయడం వేరు, కొత్తగా అటువంటి పాటలను రికార్డ్ చేయడం వేరు" అని ఆమె తన వైఖరిని స్పష్టం చేసింది.
ప్రస్తుత ప్రాధాన్యతలు
{{/usCountry}}శ్రేయా ఘోషల్ ప్రస్తుతం తన 'ది అన్‌స్టాపబుల్ వరల్డ్ టూర్' (The Unstoppable World Tour) కోసం సిద్ధమవుతోంది. యూకే, యూఎస్ఏ, భారత్, అబుదాబిలో ఆమె కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. ఇటీవల అమల్ మాలిక్ తో కలిసి ఆమె పాడిన 'యహీ గుజార్ దూ' పాటకు మంచి స్పందన లభిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఆమె సోనీ టీవీలో వస్తున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకి జడ్జిగా కూడా ఉంది.