ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్, సింగర్ బాద్‌షా మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. మార్చి 1, 2026న విడుదలైన బాద్‌షా కొత్త పాట ‘తతీరీ’ ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఈ పాటలో చూపించిన విజువల్స్, వాడిన లిరిక్స్ అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.
నిప్పులు చెరిగిన సోనా మోహపాత్ర

ముఖ్యంగా హర్యానా రోడ్‌వేస్ బస్సులో పాఠశాల యూనిఫాం ధరించిన అమ్మాయిలతో అసభ్యకరమైన చేష్టలు చేయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బాద్‌షా తీరుపై గాయని సోనా మోహపాత్ర సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.
సమాజపు ఆత్మను దెబ్బతీస్తోంది
"చిన్న పిల్లలను, స్కూల్ యూనిఫాంలను ఇలాంటి అసభ్యకర చిత్రణ కోసం వాడుకోవడం ఆపండి. ఇది మన సమాజపు ఆత్మను దెబ్బతీస్తోంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 'హర్యానా బిడ్డను' అని చెప్పుకుంటే సరిపోదని, కళాకారుడిగా సామాజిక బాధ్యత ఉండాలని సోనా మోహపాత్ర హితవు పలికారు.
"మగతనాన్ని ప్రదర్శించడం, ఆడవారిని కేవలం ఒక వస్తువులా (Objectifying) చూపించడం.. ఇదొక చెత్త ఫార్ములాగా మారిపోయింది. హర్యానాలో ఇప్పటికే లింగ నిష్పత్తి తక్కువగా ఉండటం, మహిళలపై హింస వంటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాద్‌షా లాంటి వారు బాధ్యతగా ఉండాలి. ఈ 'సౌల్ లెగ్' కంటెంట్ కోసం డబ్బులు పోసి చూసేవారు కూడా తమ విజ్ఞతను వాడుకోవాలి" అని సింగర్ సోనా మోహపాత్ర ఘాటుగా స్పందించారు.
పోలీసుల యాక్షన్.. ఎఫ్ఐఆర్ నమోదు
ఈ పాటపై హర్యానా పోలీసులు ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టారు. పాటలో అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయన్న ఆరోపణలతో బాద్‌షాపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. అంతేకాకుండా, ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఈ పాటను బాద్షాతో కలిసి సిమ్రన్ జగ్లాన్ ఆలపించారు.
{{/usCountry}}ఈ పాటపై హర్యానా పోలీసులు ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టారు. పాటలో అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయన్న ఆరోపణలతో బాద్‌షాపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. అంతేకాకుండా, ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఈ పాటను బాద్షాతో కలిసి సిమ్రన్ జగ్లాన్ ఆలపించారు.
{{/usCountry}}వివాదం ముదరడంతో బాద్‌షా కిందకు దిగివచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ క్షమాపణలు కోరారు.
తప్పు ఒప్పుకున్న బాద్‌షా.. పాట తొలగింపు
"తతీరీ పాటలోని కొన్ని పదాలు, విజువల్స్ వల్ల నా హర్యానా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని నాకు అర్థమైంది. నేను కూడా హర్యానా బిడ్డనే. మా సంస్కృతిని ప్రపంచానికి చాటాలనేది నా ఉద్దేశం కానీ, ఎవరినీ కించపరచాలని కాదు. హిప్ హాప్ శైలిలో ప్రత్యర్థులను ఉద్దేశించి రాసే పదాలు అమ్మాయిలకు లేదా పిల్లలకు తప్పుగా వెళ్లాయి. నన్ను మీ కొడుకుగా భావించి క్షమించండి" అని బాద్‌షా వేడుకున్నారు.
అంతేకాకుండా, వివాదాస్పదమైన ఈ పాటను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగిస్తున్నట్లు బాద్‌షా ప్రకటించారు. కేవలం గ్లామర్ కోసమో, పాపులారిటీ కోసమో విలువలను పక్కన పెట్టడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.