స్మృతి మంధానా పెళ్లి ఆ రోజేనా.. ఎంగేజ్‌మెంట్ రింగు చూపించిన స్టార్ క్రికెటర్.. ఫన్నీ వీడియో షేర్ చేసిన జెమీమా
స్మృతి మంధానా మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ తో నిశ్చితార్థం కన్ఫమ్ చేసింది. ఆమె టీమ్మేట్ జెమీమా రోడ్రిగ్స్ షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియోలో ఆమె తన చేతికి ఉన్న రింగ్ చూపించింది. అంతేకాదు వీళ్లు నవంబర్ 23న పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
క్రికెటర్ స్మృతి మంధాన, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ తో తన నిశ్చితార్థాన్ని ధృవీకరించింది. అంతేకాదు తన పెళ్లి గురించి కూడా ఆమె హింట్ ఇచ్చింది. మున్నాభాయ్ మూవీలోని ఓ సాంగ్ తో కూడిన ఓ ఫన్నీ వీడియోను జెమీమా రోడ్రిగ్స్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

స్మృతి మంధాన ఎంగేజ్‌మెంట్
స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. తాజాగా గురువారం (నవంబర్ 20) తన వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్మేట్స్ జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంకా పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డితో కలిసి చేసిన ఓ రీల్ వైరల్ అయింది. వీడియోలో.. మొదట జెమీమా.. స్మృతిని చూసి "భాయ్, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. విషయం ఏంటి?" అని అడుగుతుంది. స్మృతి ఆనందంగా ఈల వేస్తుంది.
బ్యాక్‌గ్రౌండ్ లో 'లగే రహో మున్నాభాయ్' మూవీలోని "సంఝో హో హీ గయా" పాట ప్లే అవుతుండగా వాళ్లు డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత సంజయ్ దత్ వాయిస్ లో స్మృతి మంధానా.. ఇక కార్డులు ప్రింట్ చేసుకో.. సూట్ లు కుట్టించుకో అని అంటుంది.
మొదట్లో ఇది సరదా టీమ్ మూమెంట్‌లా కనిపించినా చివర్లో స్మృతి మంధాన తన చేతికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపించింది. దీంతో అభిమానులకు నిశ్చితార్థాన్ని ధృవీకరించింది. ఈ వీడియోను జెమీమా సోదరుడు, ఫోటోగ్రాఫర్ ఎనోచ్ రోడ్రిగ్స్ ఎడిట్ చేయగా, డాక్టర్ ప్రాచి గావాలి షూట్ చేశారు.
స్మృతి - పలాష్ ప్రేమ కథ
పలాష్ ముచ్చల్ ప్రముఖ గాయని పలక్ ముచ్చల్ సోదరుడు. ఇండోర్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో పలాష్ ముచ్చల్ తమ సంబంధాన్ని పరోక్షంగా సూచించారు. స్మృతి మంధాన త్వరలో ఇండోర్ కోడలు కాబోతుందని అతడు సరదాగా అన్నాడు.
2024లో వారు డేటింగ్ చేస్తున్నట్లు ధృవీకరించినప్పటి నుండి వారు ఈవెంట్‌లలో, సోషల్ మీడియాలో కలిసి కనిపిస్తున్నారు. పలాష్ సోదరి పలక్ ముచ్చల్ స్మృతిని "అందమైన వ్యక్తి", తన “బెస్ట్ ఫ్రెండ్”గా పేర్కొంది. "ఆమెకు కుటుంబ విలువలు చాలా ముఖ్యం" అని పలక్ ప్రశంసించింది.
నవంబర్ 23న పెళ్లి?
అయితే స్మృతి మంధానా, పలాష్ పెళ్లి నవంబర్ 23నే జరగనున్నట్లు కూడా పలు వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి కోసం ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఓ లేఖను పంపిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దాని ద్వారానే వీళ్ల పెళ్లి తేదీ బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే అసలు ప్రధాని లేఖ నిజమేనా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ లేఖలో ఉపయోగించిన భాష సాధారణంగా పీఎంవో నుంచి వచ్చినదిగా అనిపించడం లేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


