Sobhita Dhulipala Bold: తెలుగు ఆడియన్స్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్న మన తెలుగు గ్లామరస్ నటి శోభితా ధూళిపాళ పెళ్లి తర్వాత మళ్లీ తన బోల్డ్ అండ్ స్టైలిష్ అవతార్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత తొలిసారిగా ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' (The Hollywood Reporter India) కవర్ పేజీ కోసం ఆమె చేసిన గ్లామరస్ ఫోటోషూట్ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్ లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

'ఇండియన్ నోయిర్' (Indian Noir) ఫేస్‌గా పేరు తెచ్చుకున్న శోభిత.. ఈ ఫోటోషూట్‌లో తన గ్లామర్ అండ్ స్టైలింగ్ సెన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.
ఫ్యాషన్ ప్రపంచాన్ని ఫిదా చేస్తున్న శోభితా డిఫరెంట్ లుక్స్
ఈ స్పెషల్ షూట్ కవర్ పేజీ కోసం శోభిత ధరించిన డిజైనర్ అవుట్‌ఫిట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. షార్ట్ గ్రే ఫాక్స్ ఫర్ జాకెట్, బ్లాక్ బ్రీఫ్స్, షీర్ టైట్స్ కాంబినేషన్‌తో పాటు గోల్డ్ బెల్ట్, క్రిస్టల్ పెండెంట్‌తో ఆమె కనిపించిన తీరు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మెస్సీ హెయిర్ స్టైల్, స్మోకీ ఐస్, నూడ్ లిప్స్‌తో చాలా ఇంటెన్స్‌గా పోజులిచ్చారు.
మరో లుక్‌లో కట్-అవుట్స్‌తో కూడిన బ్లాక్ హాల్టర్ టాప్, ష్రెడెడ్ మిడీ స్కర్ట్, డార్క్ ప్లమ్ బాడీసూట్, ఓవర్‌సైజ్డ్ గ్రే బ్లేజర్‌లో ఎంతో అందంగా కనిపించారు. ఈ కవర్ షూట్‌లోనే షోస్టాపర్‌గా నిలిచిన మెజెంటా వన్-షోల్డర్ డ్రేప్, క్రిస్టల్ ఫ్రింజ్డ్ థై-హై బూట్స్, షార్ట్ వేవీ బాబ్ హెయిర్‌కట్‌లో శోభిత లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు.. పా రంజిత్ ‘వెట్టువమ్’తో..
తెలుగు అమ్మాయైన శోభితా ధూళిపాళ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న సంక్లిష్టమైన పాత్రలను ఎంచుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయ్యారు. హిట్ వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్' (Made in Heaven), అడవి శేష్ 'మేజర్' (Major), మణిరత్నం విజువల్ వండర్ 'పొన్నియిన్ సెల్వన్' (Ponniyin Selvan)తో పాటు హాలీవుడ్ యాక్షన్ మూవీ 'మంకీ మ్యాన్' (Monkey Man)తో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.
ప్రస్తుతం ఆమె కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ (Pa. Ranjith) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వెట్టువమ్' (Vettuvam) అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై తనకు ఎంతో నమ్మకం ఉందని, తన నటనను మొత్తం ఈ పాత్ర కోసం ధారపోశానని, ఇలాంటి పవర్ ఫుల్ రోల్ కోసం తాను ఎప్పటినుంచో దేవుడిని ప్రార్థిస్తున్నానని శోభిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్లి తర్వాత కూడా తన ప్రొఫెషనల్ లైఫ్‌ను, ఫ్యాషన్ షూట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ శోభితా దూసుకుపోతుండటం విశేషం.
{{/usCountry}}ప్రస్తుతం ఆమె కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ (Pa. Ranjith) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వెట్టువమ్' (Vettuvam) అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై తనకు ఎంతో నమ్మకం ఉందని, తన నటనను మొత్తం ఈ పాత్ర కోసం ధారపోశానని, ఇలాంటి పవర్ ఫుల్ రోల్ కోసం తాను ఎప్పటినుంచో దేవుడిని ప్రార్థిస్తున్నానని శోభిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్లి తర్వాత కూడా తన ప్రొఫెషనల్ లైఫ్‌ను, ఫ్యాషన్ షూట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ శోభితా దూసుకుపోతుండటం విశేషం.
{{/usCountry}}