ఓటీటీలోకి ఈవారమే శోభితా ధూళిపాళ తెలుగు థ్రిల్లర్ మూవీ.. సీరియల్ కిల్లర్ వెంట పడే క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో..

ఈవారం ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇందులో శోభితా ధూళిపాళ లీడ్ రోల్లో నటిస్తుండటం విశేషం. సీరియల్ కిల్లర్ వెంట పడే ఓ క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో ఆమె నటిస్తోంది.

Jan 19, 2026, 17:40:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అక్కినేని వారి కోడలు, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'. థియేటర్ల జోలికి వెళ్లకుండా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

ఓటీటీలోకి ఈవారమే శోభితా ధూళిపాళ తెలుగు థ్రిల్లర్ మూవీ.. సీరియల్ కిల్లర్ వెంట పడే క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో..
ఓటీటీలోకి ఈవారమే శోభితా ధూళిపాళ తెలుగు థ్రిల్లర్ మూవీ.. సీరియల్ కిల్లర్ వెంట పడే క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో..

చీకటిలో మూవీ కథేంటంటే?

శోభితా ధూళిపాళ ఓ క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో నటించిన సినిమా చీకటిలో. ఇదొక ఇంటెన్స్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో శోభితా 'సంధ్య' అనే పాత్రలో కనిపించనుంది. సంధ్య 'ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్' అంటే నిజ జీవిత నేరాల గురించి పాడ్‌కాస్ట్ చేసే వ్యక్తిగా నటించడం విశేషం. కథ ప్రకారం సంధ్య దగ్గర పనిచేసే ఒక ఇంటర్న్ అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది.

ఆ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి సంధ్య తన పాడ్‌కాస్ట్‌నే ఆయుధంగా మలచుకుంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు భయపెట్టిన, ఇప్పుడు సైలెంట్‌గా ఉన్న ఒక సీరియల్ కిల్లర్ గురించిన షాకింగ్ నిజాలు బయటపడతాయి.

సోషల్ మీడియా, డిజిటల్ క్రైమ్స్ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇందులో చూపించబోతున్నారు. హంతకుడిని పట్టుకునే క్రమంలో సంధ్య ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొందన్నదే ఈ సినిమా కథ.

చీకటిలో మూవీ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

ఈ చీకటిలో సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ శుక్రవారం అంటే జనవరి 23 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను 'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశాడు. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు (సురేష్ ప్రొడక్షన్స్) ఈ చిత్రాన్ని నిర్మించాడు. శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, సీనియర్ నటి ఆమని, ఝాన్సీ, చైతన్య విశాలాక్షి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ చాలా బాగుందని, శోభిత నటన ఆకట్టుకుందని ప్రశంసించారు. ఓ పాడ్‌కాస్టర్ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం అనే సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న థ్రిల్లర్ సినిమా ఇది. ఈ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ వారం చీకటిలో బెస్ట్ ఆప్షన్. మరి ఈ పాత్రలో శోభిత ఎలా చేసిందో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More