నేరుగా ఓటీటీలోకి శోభితా ధూళిపాళ తెలుగు థ్రిల్లర్ మూవీ.. తమిళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్.. డేట్ ఇదే

శోభితా ధూళిపాళ నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు చీకటిలో. ఈ సినిమాకు సంబంధించిన ఇంటెన్స్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో.

Published on: Jan 8, 2026, 14:12:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓ తెలుగు థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వస్తోంది. అందులోనూ ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించింది శోభితా ధూళిపాళ కావడంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. 'చీకటిలో' అనే ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో గురువారం (జనవరి 8) తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అనౌన్స్ చేసింది.

నేరుగా ఓటీటీలోకి శోభితా ధూళిపాళ తెలుగు థ్రిల్లర్ మూవీ.. తమిళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్.. డేట్ ఇదే
నేరుగా ఓటీటీలోకి శోభితా ధూళిపాళ తెలుగు థ్రిల్లర్ మూవీ.. తమిళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్.. డేట్ ఇదే

చీకటిలో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్

అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఏడాది కాలంగా తెలుగు వాళ్లకు కూడా బాగా దగ్గరైన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'చీకటిలో' (Cheekatilo). ఈ సినిమా థియేటర్లను స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతోంది.

తెలుగులో అడివి శేష్ 'మేజర్' సినిమా తర్వాత శోభిత నటిస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ వివరాలను అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ ఆడియోల్లోనూ అందుబాటులో ఉంటుంది.

చీకటిలో మూవీ కథ ఏంటి?

శోభితా ధూళిపాళ ఇంటెన్స్ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ తో మేకర్స్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు. క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో శోభిత ఇందులో కనిపించింది. మేకర్స్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ కథ మొత్తం హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో శోభిత 'సంధ్య' అనే పాత్రలో కనిపిస్తుంది. ఆమె ఒక ట్రూ క్రైమ్ పోడ్‌కాస్టర్.

సిటీలో జరిగే కొన్ని భయంకరమైన, డెడ్లీ మిస్టరీల వెనుక ఉన్న నిజాన్ని సంధ్య ఎలా వెతికి పట్టుకుంది? చీకటిని ఎదిరించి నిజాన్ని ఎలా బయటపెట్టింది అనేదే ఈ సినిమా కథ. క్రైమ్ బోర్డు ముందు శోభిత కూర్చున్న అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే ఆసక్తి రేపుతోంది.

ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశాడు. శోభితతోపాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలాక్షి, ఈషా చావ్లా, సీనియర్ నటీమణులు ఝాన్సీ, ఆమని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో డ్రైవ్, జటాధర, 12A రైల్వే కాలనీ వంటి చిన్న సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులో శోభిత 'చీకటిలో' చేరుతోంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More