తమిళంలో విడుదలైన 'బ్యాడ్ గర్ల్' (Bad Girl) సినిమాపై నటి శోభిత ధూళిపాళ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ట్రైలర్ విడుదలైనప్పుడు వివాదంలో చిక్కుకున్న ఈ మూవీపై శోభిత ప్రశంసల వర్షం కురిపించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
'బ్యాడ్ గర్ల్' చూసి కన్నీళ్లు పెట్టుకున్న శోభిత

శోభిత ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'బ్యాడ్ గర్ల్' సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఈ సినిమా చూసిన తర్వాత తాను కన్నీళ్లు పెట్టుకున్నానని, తన మనసులోని భావాలు వ్యక్తమైనట్లుగా అనిపించిందని రాసింది. తన రివ్యూలో ఆమె ఇలా రాసింది. "బ్యాడ్ గర్ల్ నన్ను నవ్వించింది. కన్నీళ్లు కూడా పెట్టించింది. నా మనసులోని భావాలు వ్యక్తమయ్యాయి. ఆవిష్కృతమయ్యాయి. ప్రతి నిమిషం మరింత పరిణతి చెందే సినిమా ఇది. ఈ సినిమాను అందరూ,
ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా చూడాలని గట్టిగా సిఫారసు చేస్తున్నాను. ఈ సినిమా మనందరి కోసం! వర్ష భరత్ (దర్శకురాలు), అంజలి శివరామన్‌లకు (నటి) ప్రత్యేక అభినందనలు. మీరిద్దరూ అసాధారణమైనవారు. దీన్ని జియోహాట్‌స్టార్ లో చూడండి" అని శోభిత చెప్పింది. శోభిత ఇచ్చిన ఈ రివ్యూను దర్శకురాలు వర్ష, నటి అంజలి తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీషేర్ చేశారు.
'బ్యాడ్ గర్ల్' చుట్టూ వివాదం
ఈ ఏడాది జనవరిలో 'బ్యాడ్ గర్ల్' ట్రైలర్ విడుదలైన తర్వాత దర్శకుడు జి. మోహన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. బ్రాహ్మణులను ప్రతికూల కోణంలో చూపించారని ఆరోపిస్తూ, ఈ సినిమా నిర్మాతలు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్‌లపై అతడు విమర్శలు గుప్పించాడు.
"ఒక బ్రాహ్మణ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని చూపించడం ఈ వర్గానికి ఎప్పుడూ బోల్డ్, రిఫ్రెష్ సినిమానే. వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ అండ్ కో. నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. బ్రాహ్మణ తండ్రి, తల్లిని విమర్శించడం పాత ఫ్యాషన్ అయింది. కొత్తగా లేదు.. మీ సొంత కుల అమ్మాయిలతో ప్రయత్నించి ముందు మీ కుటుంబానికి చూపించండి" అని అతడు ఎక్స్ లో రాసుకొచ్చాడు.
{{/usCountry}}"ఒక బ్రాహ్మణ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని చూపించడం ఈ వర్గానికి ఎప్పుడూ బోల్డ్, రిఫ్రెష్ సినిమానే. వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ అండ్ కో. నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. బ్రాహ్మణ తండ్రి, తల్లిని విమర్శించడం పాత ఫ్యాషన్ అయింది. కొత్తగా లేదు.. మీ సొంత కుల అమ్మాయిలతో ప్రయత్నించి ముందు మీ కుటుంబానికి చూపించండి" అని అతడు ఎక్స్ లో రాసుకొచ్చాడు.
{{/usCountry}}రమ్య అనే టీనేజ్ బ్రాహ్మణ అమ్మాయి లైంగిక కోరికలు, సంప్రదాయవాద కుటుంబం, సమాజం అంచనాలకు వ్యతిరేకంగా ఆమె చేసే ప్రయాణం ఈ వివాదానికి ప్రధాన కారణం.
'బ్యాడ్ గర్ల్' చిత్రం గురించి..
'బ్యాడ్ గర్ల్' అనేది ఒక కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. దీనికి వర్ష భరత్ కథ రాసి దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో అంజలి శివరామన్ ప్రధాన పాత్ర (రమ్య) పోషించగా.. శాంతిప్రియ, హ్రిదు హరూన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ లో ప్రదర్శించిన తర్వాత సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఇది జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.