రాయుడి గారి తాలుకా నుంచి జాతరొచ్చింది సాంగ్ రిలీజ్- గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా మాస్ బీట్- ఆ డైరెక్టర్ చేత విడుదల!

తెలుగులో వస్తున్న లేటెస్ట్ మూవీ రాయుడి గారి తాలుకా. శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా జాతరొచ్చింది సాంగ్‌ను రిలీజ్ చేశారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు మూవీస్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కూరసాల జాతరొచ్చింది పాటను విడుదల చేశారు.

Published on: Jan 10, 2026, 11:27:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన తాజా చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాయుడి గారి తాలుకా సినిమాకు కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహించారు.

రాయుడి గారి తాలుకా నుంచి జాతరొచ్చింది సాంగ్ రిలీజ్- గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా మాస్ బీట్- ఆ డైరెక్టర్ చేత విడుదల!
రాయుడి గారి తాలుకా నుంచి జాతరొచ్చింది సాంగ్ రిలీజ్- గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా మాస్ బీట్- ఆ డైరెక్టర్ చేత విడుదల!

షూటింగ్ పూర్తి, సాంగ్ రిలీజ్

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతోంది రాయుడి గారి తాలుకా చిత్రం. తాజాగా రాయుడు గారి తాలుకా సినిమా నుంచి ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు చిత్రాల దర్శకుడు కల్యాణ్ కృష్ణ కూరసాల ఈ పాటను విడుదల చేశారు.

నగేష్ గౌరీష్ సంగీతం

ఈ మాస్ బీట్ పాటకు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ హుషారైన సంగీతాన్ని సమకూర్చారు. గాయని జయశ్రీ పల్లెం అద్భుతంగా ఆలపించారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో పక్కా మాస్ బీట్‌తో సాగే ఈ జాతర పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఒక్క రాత్రిలోనే

ఒకప్పుడు జానపద గీతాలు కేవలం పల్లెలకే పరిమితం అయ్యేవి, కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్క రాత్రిలోనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైరల్ అవుతున్నాయి. పక్కా లోకల్ ఫ్లేవర్‌తో, చెవిలో పడగానే స్టెప్పులు వేయించే ఈ పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది.

జాతర వైబ్స్‌

ఒక ఊరి జాతర అంటేనే సందడి, డప్పుల మోత, యువత కేరింతలు. సరిగ్గా అదే వాతావరణాన్ని ఈ పాట కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. ముఖ్యంగా "రాయుడిగారి తాలూకా.. జాతరొచ్చింది" అంటూ సాగే పల్లవి, దానికి తోడైన ఆ డప్పుల బీట్ వింటుంటే ఎవరైనా సరే చిందేయాల్సిందే. ఈ పాటలో కనిపించిన నృత్యకారుల ఎనర్జీ, వారి సహజసిద్ధమైన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

రాయుడి గారి తాలుకా నిర్మాతలు

ఇదిలా ఉంటే, రాయుడి గారి తాలుకా చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి,కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రాయుడి గారి తాలుకా నటీనటులు

అలాగే, రాయుడి గారి తాలుకా సినిమాలో సుమన్, కిట్టయ్య, ఆర్కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More