Son Of Review: సన్ ఆఫ్ రివ్యూ- తండ్రిపై కొడుకు కేసు- కట్టి పడేసే ఫాదర్ సన్ ఎమోషన్- ఫ్యామిలీ డ్రామా మూవీ ఎలా సాగిందంటే?
Son Of Movie Review In Telugu: తండ్రికొడుకుల ఎమోషన్‌పై వచ్చిన న్యూ తెలుగు ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ మూవీ సన్ ఆఫ్. సాయి సింహాద్రి హీరోగా చేసిన ఈ సినిమాలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి సన్ ఆఫ్ రివ్యూలో తెలుసుకుందాం.
తెలుగులో ఫాదర్ సన్ రిలేషన్‌పై ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన న్యూ సినిమా సన్ ఆఫ్. సాయి సింహాద్రి హీరోగా, మీరా రాజ్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో సీనియర్ హీరో, నటుడు వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌పై హీరో సాయి సింహాద్రి నిర్మాతగా చేసిన ఈ సన్ ఆఫ్ సినిమాకు బత్తుల సతీష్ దర్శకత్వం వహించారు. సన్ ఆఫ్ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా సాగిందో నేటి సన్ ఆఫ్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రి)ని ప్రేమగా చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు అనుగుణంగా పెరగడు. ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు.
అలాగే అదే ఊరిలోని అను (మీరా రాజ్)ను స్కూల్ నుంచి ఆనంద్ ప్రేమిస్తుంటాడు. అయితే, అను, ఆనంద్‌ల ప్రేమకు అందరూ ఒప్పుకుంటారు. కానీ, ఎంగేజ్‌మెంట్ టైమ్‌కు ఆనంద్ తండ్రి వెంకట్రావు అడ్డం తిరుగుతాడు. పనీ పాట లేని గాలికి తిరిగే తన కొడుకు ఎలా నచ్చాడు? అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అంటూ అందరి ముందు కొడుకు పరువు తీస్తాడు వెంకట్రావ్.
ఆ కోపంతో తనకు వారసత్వంగా రావాల్సిన ఆస్తిని, ఇంటిని తనకు ఇప్పించండి అంటూ కన్న తండ్రి మీదే కొడుకు ఆనంద్ కేసు వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు జీవితం విలువ, బరువు, బాధ్యతల గురించి ఆ కొడుకు తెలుసుకుంటాడా? తన ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నది సన్ ఆఫ్ కథ.
విశ్లేషణ:
తండ్రీ కొడుకుల నేపథ్యంలో ఎన్నో కథలు తెలుగులో వచ్చాయి. సన్ ఆఫ్ కథ కూడా అదే తరహాలో ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఉన్న యువతరానికి మేల్కొలుపులా ఈ సినిమా సాగుతుంది. బాధ్యత లేకుండా గాలికి తిరిగితే జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల్ని చక్కగా చూపించారు. జీవితంలో ప్రేమ, బంధాలు, బరువు, బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే తీరు ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీకొడుకుల మధ్య ఉండే దూరం, హీరో గాలి తిరుగుడు, హీరోయిన్‌తో ప్రేమ ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. కథలో అసలు సంఘర్షణ, టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇంటర్వెల్ బ్లాక్‌కి వస్తుంది. కోర్ట్‌లో వినిపించే వాదనలు, తండ్రీ పెట్టే కండీషన్‌తో కథలో ఆసక్తి పెరుగుతుంది.
క్లైమాక్స్ ట్విస్ట్ అలా
ఆ తరువాత సెకండాఫ్‌లో బిడ్డను పెంచేందుకు ఆనంద్ పడే కష్టాలు, ఎమోషనల్ ట్రాక్‌తో కంటతడి పెట్టిస్తారు. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే చివరకు ఓ పూర్తి సంతృప్తికరమైన సినిమాని చూశామనే ఫీలింగ్‌ను మాత్రం కలిగేలా చేస్తుంది.
ఇక సాంకేతికంగా చూసుకుంటే సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగే పాటలు ఆకట్టుకుంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై మరింత అందంగా చూపించారు. అలా మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ ఈ మూవీని తమ భుజాల మీద మోశారు.
ఎడిటింగ్, ఆర్ట్, క్యాస్టూమ్ ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్ చేసిన వర్క్ చక్కగా కుదిరింది. ఇక తొలి సినిమా అయినా, ప్రొడక్షన్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సాయి సింహాద్రి చాలా గొప్పగా ఈ మూవీని నిర్మించారు. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా కనిపిస్తాయి.
నటీనటులు ఎలా చేశారంటే?
ఆనంద్ పాత్రలో సాయి సింహాద్రి ఎంతో ఒదిగిపోయి చేశాడు. తొలి సినిమా, కొత్త హీరో అన్న ఫీలింగ్ ఎక్కడా కలగదు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాలుగా సాయి సింహాద్రి మెప్పించాడు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
ఇక తండ్రి పాత్రలో వినోద్ కుమార్ తన అనుభవాన్ని చూపించారు. ఒక తండ్రి ఎమోషన్‌ను బాగా చూపించారు. అను పాత్రలో కొత్త హీరోయిన్ మీరా రాజ్ గ్లామర్‌గా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఫాదర్, సన్ ఎమోషన్స్‌తో కట్టిపడేసే సినిమా సన్ ఆఫ్.
రేటింగ్: 2.5/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


