...
...
Next Story

Sonam Wangchuk: 19 రోజులుగా నిరాహార దీక్ష.. ఈ సైంటిస్ట్‌పై వచ్చిన మూవీ 3 ఇడియట్స్ కాదు.. ఓటీటీలోని ఈ డాక్యుమెంటరీ చూడండి

Sonam Wangchuk: 19 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సైంటిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా వచ్చింది 3 ఇడియట్స్ మూవీ అనే వార్తల నేపథ్యంలో మరో డాక్యుమెంటరీ తెరపైకి వచ్చింది. అదేంటో చూడండి.

Published on: Jul 16, 2026, 10:48:00 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Sonam Wangchuk: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మండుతున్న ఎండల్లో లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఆమిర్ ఖాన్ '3 ఇడియట్స్' సినిమాలో ఫున్‌సుఖ్ వాంగ్డూ క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయిన ఆడియన్స్ అంతా ఇప్పుడు ఈ రియల్ హీరో అసలు పోరాటం ఏంటో తెలుసుకోవడానికి 'సాంగ్స్ ఆఫ్ ది వాటర్ స్పిరిట్స్' (Songs of the Water Spirits) డ్యాక్యుమెంటరీ వైపు మొగ్గు చూపుతున్నారు.

3 ఇడియట్స్ క్యారెక్టర్ వర్సెస్ రియల్ పోరాటం

Sonam Wangchuk: 19 రోజులుగా నిరాహార దీక్ష.. ఈ సైంటిస్ట్‌పై వచ్చిన మూవీ 3 ఇడియట్స్ కాదు.. ఓటీటీలోని ఈ డాక్యుమెంటరీ చూడండి (PTI Photo/Shahbaz Khan)
Sonam Wangchuk: 19 రోజులుగా నిరాహార దీక్ష.. ఈ సైంటిస్ట్‌పై వచ్చిన మూవీ 3 ఇడియట్స్ కాదు.. ఓటీటీలోని ఈ డాక్యుమెంటరీ చూడండి (PTI Photo/Shahbaz Khan)

'3 ఇడియట్స్' సినిమాతో సోనమ్ వాంగ్‌చుక్ పేరు దేశమంతటా పాపులర్ అయినప్పటికీ, ఆ సినిమాలో చూపించిన రీల్ క్యారెక్టర్ కంటే రియల్ లైఫ్‌లో ఆయన చేస్తున్న పోరాటం చాలా సీరియస్. లడఖ్ హిమనీనదాలు కరిగిపోకుండా కాపాడటానికి, అక్కడి తాగునీటి సమస్యలను తీర్చడానికి ఆయన ఐస్ స్తూపాలను (Ice Stupas) ఆవిష్కరించి గ్లోబల్ లెవెల్లో ప్రశంసలు అందుకున్నారు.

అయితే సినిమాల్లో చూపించిన సరదా సన్నివేశాల కంటే బయట ప్రపంచంలో ఆయన ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా తీవ్రమైనవి. సోనమ్ వాంగ్‌చుక్ అసలు ఆలోచనలు, ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవాలంటే కేవలం '3 ఇడియట్స్' సినిమా చూస్తే సరిపోదని, ఈ రియల్ డ్యాక్యుమెంటరీ చూడాలని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

8.8 రేటింగ్‌తో ఐఎండీబీలో సెన్సేషన్

2020లో రిలీజైన 'సాంగ్స్ ఆఫ్ ది వాటర్ స్పిరిట్స్' డ్యాక్యుమెంటరీకి ప్రముఖ మూవీ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb) లో ఏకంగా 8.8 రేటింగ్ లభించింది. ఇటాలియన్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ నికోలో బొంగియోర్నో (Niccolò Bongiorno) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ డ్యాక్యుమెంటరీని తెరకెక్కించారు.

లడఖ్‌లో ఉన్న ప్రాచీన బౌద్ధ సంస్కృతి, ఆధునిక అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం మధ్య నలిగిపోతున్న అక్కడి ప్రజల ఆవేదనను ఈ సినిమాలో నికోలో కళ్లకు కట్టారు. అక్కడ నదులు, గ్లేసియర్లు ఏ విధంగా అంతరించిపోతున్నాయో విజువల్‌గా చూపించారు.

ఒక విజనరీ పర్యావరణ వేత్తగా సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న గ్రౌండ్ లెవెల్ వర్క్‌ను ఇందులో చాలా వివరంగా కవర్ చేశారు. రాబోయే తరాలకు నీటి చుక్క కూడా దొరకకుండా పోయే ప్రమాదం ఉందంటూ సోనమ్ ఇచ్చే వార్నింగ్ ఆడియన్స్ మనసులను పిండేస్తుంది.

జంతర్ మంతర్ దీక్ష.. కేంద్రానికి డిమాండ్లు

ప్రస్తుతం లడఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ లో చేర్చాలనే ప్రధాన డిమాండ్లతో సోనమ్ వాంగ్‌చుక్ సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. అక్కడి గిరిజన సంస్కృతిని, సున్నితమైన పర్యావరణాన్ని కాపాడుకోవడానికే ఈ దీక్ష అని ఆయన స్పష్టం చేశారు.

దీనితో పాటు ఇటీవల దేశాన్ని కుదిపేసిన నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారం, ఎగ్జామ్ స్కామ్స్ పై కూడా ఆయన గళం విప్పారు. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న అవినీతికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe