Sonu Sood iPhone 18: కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐ.. ఫోన్ల కోసం క్యూ కట్టడమేంటి: ఐఫోన్ లవర్స్‌కు క్లాస్ పీకిన సోనూ సూద్

Sonu Sood iPhone 18: ఐఫోన్ లవర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు రియల్ లైఫ్ హీరో సోనూ సూద్. కొత్త ఐఫోన్ 18 ప్రో ఫోన్ల కోసం ముంబై, ఢిల్లీ నగరాల్లో ఐఫోన్ లవర్స్ క్యూ కట్టడంపై స్పందిస్తూ.. చాలా ఘాటు కామెంట్స్ చేశారు.

Published on: Sep 18, 2026, 15:13:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sonu Sood iPhone 18: ఆపిల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ 18 ప్రో’ (iPhone 18 Pro) సిరీస్ సేల్స్ ఇండియాలో గ్రాండ్‌గా మొదలయ్యాయి. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల ముందు ఐఫోన్ లవర్స్ గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడడం చూసి రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఘాటుగా స్పందించారు. "కొత్త ఫోన్, కొత్త ఈఎంఐ.. పాత బిల్లులే!" అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Sonu Sood iPhone 18: కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐ.. ఫోన్ల కోసం క్యూ కట్టడమేంటి: ఐఫోన్ లవర్స్‌కు క్లాస్ పీకిన సోనూ సూద్
Sonu Sood iPhone 18: కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐ.. ఫోన్ల కోసం క్యూ కట్టడమేంటి: ఐఫోన్ లవర్స్‌కు క్లాస్ పీకిన సోనూ సూద్

సోనూ సూద్ ట్వీట్ వైరల్

ఆపిల్ తన నెక్స్ట్ జెన్ ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్లు కొనేందుకు శుక్రవారం (సెప్టెంబర్ 18) ఉదయం నుంచే ముంబై, ఢిల్లీ ఆపిల్ స్టోర్ల దగ్గర జనాలు క్యూ కట్టారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగానే సోనూ సూద్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

"కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐలు.. కానీ బిల్లులు మాత్రం పాతవే. కేవలం ఫోన్లు అప్‌గ్రేడ్ చేసుకోవడానికే కాకుండా, సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా మనం ఇలాగే క్యూ లైన్లలో నిలబడితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. నిజమైన అప్‌గ్రేడ్ అంటే సమాజాన్ని మెరుగుపరుచుకోవడమే" అని సోనూ సూద్ రాసుకొచ్చారు.

నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన.. రూ. 3 లక్షల ఫోన్ అవసరమా?

సోనూ సూద్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది ఆయన చెప్పిన పాయింట్‌కు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం ఐఫోన్ పిచ్చిపై మండిపడుతున్నారు.

"సోనూ సూద్ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. రక్తదానం చేయడానికి, పేదలకు సహాయం చేయడానికి లేని ఉత్సాహం.. ఒక ఫోన్ కోసం గంటల తరబడి లైన్లలో నిలబడడానికి ఎక్కడి నుంచి వస్తుంది?" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. రూ.3 లక్షల కంటే ఎక్కువ పెట్టి ఫోన్ కొనడం ఏ రకంగానూ సమర్థనీయం కాదని మరికొందరు విమర్శిస్తున్నారు.

ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ ఫీచర్లు, ధరలు ఇలా

ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 18 ప్రో సిరీస్ అత్యాధునిక A20 ప్రో చిప్‌సెట్, వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీతో వచ్చింది. ఈసారి ఆపిల్ కొత్తగా ‘బుర్గుండి’ (Burgundy) కలర్ వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది.

ఐఫోన్ 18 ప్రో ధరల వివరాలు

256GB: రూ.1,64,900

512GB: రూ.1,89,900

1 TB: రూ.2,39,900

2 TB: రూ.3,14,900

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరల వివరాలు

256GB: రూ.1,79,900

512GB: రూ.2,04,900

1TB: రూ.2,54,900

2TB: రూ.3,29,900

రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ లైఫ్ హీరో

టాలీవుడ్‌లో ‘అరుంధతి’ సినిమాలో పశుపతిగా, హిందీలో ‘దబంగ్’ లో ఛేదీ సింగ్‌గా మెప్పించిన సోనూ సూద్.. నటుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో వేలాది మంది వలస కార్మికులను సొంత ఖర్చులతో ఇళ్లకు చేర్చి 'రియల్ హీరో'గా నిలిచారు.

సినిమాల విషయానికి వస్తే, ఇటీవల ఆయన నటించి దర్శకత్వం వహించిన ‘ఫతే’ (Fateh) ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా మంచి ప్రశంసలు అందుకుంది. 'జోధా అక్బర్', 'సింబా', 'సింగ్ ఈజ్ కింగ్' లాంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్.. సమాజానికి ఉపయోగపడే విషయాలపై ఎప్పుడూ తన వాయిస్ వినిపిస్తూనే ఉంటారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More