మీకు స్పోర్ట్స్ డామాలు అంటే ఇష్టమా? అయితే ఓటీటీలోకి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. దీని పేరు రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్. సోమవారం (నవంబర్ 10) ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ ట్రైలర్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' వెబ్ సిరీస్ ట్రైలర్ చివరకు ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఈ సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్‌లో మానవ్ కౌల్, జీషన్ ఆయుబ్ ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని ఆటంకాలను సమర్థంగా అధిగమించి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి వీరు నిజమైన నాయకులుగా ఎలా మారారో ఈ ట్రైలర్ చూపించింది. డిసెంబర్ 9న సోనీ లివ్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది.
ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ ట్రైలర్‌తో పాటు మేకర్స్ ఈ సిరీస్ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ట్రైలర్‌లో జీషన్ ఆయూబ్ పాత్ర కశ్మీర్‌లో మొట్టమొదటి ఫుట్‌బాల్ క్లబ్‌ను ఏర్పాటు చేయడానికి పడే శ్రమను చూపించారు. మొదట్లోనే అతడు డీఎఫ్‌వో టోర్నమెంట్ గురించి ఆరా తీయడం, దాని కోసం ఎన్నో అడ్డంకులను అధిగమించి కశ్మీర్ టీమ్ ను తయారు చేయడం ఇందులో చూడొచ్చు.
ఈ స్పోర్ట్స్ డ్రామా సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించిన జీషన్ ఆయూబ్, మానవ్ కౌల్ తమ పాత్రలకు సరిగ్గా సరిపోయేలా కనిపిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాకు వీరు ప్రధాన బలమని చెప్పొచ్చు.
నాకు చాలా ముఖ్యమైనది
కశ్మీర్‌కు చెందిన మానవ్ కౌల్.. ఈ కథ తనకు చాలా ముఖ్యమైనదని అన్నాడు. “నేను కశ్మీరీని కాబట్టి ఈ కథ నాకు చాలా అర్థవంతమైంది. 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' కథ ఫుట్‌బాల్‌కు మించినది. ఇది మానవ స్ఫూర్తి గురించి, కఠినమైన పరిస్థితుల్లో కూడా మార్పు సాధ్యమేననే నమ్మకం గురించి చెబుతుంది. ఆశ అంటే ఇదే. ఇది పట్టుదల, కలలు, ఏదైనా సాధించగలమని నమ్మే ధైర్యం గురించి చెబుతుంది” అని అన్నాడు.
{{/usCountry}}కశ్మీర్‌కు చెందిన మానవ్ కౌల్.. ఈ కథ తనకు చాలా ముఖ్యమైనదని అన్నాడు. “నేను కశ్మీరీని కాబట్టి ఈ కథ నాకు చాలా అర్థవంతమైంది. 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' కథ ఫుట్‌బాల్‌కు మించినది. ఇది మానవ స్ఫూర్తి గురించి, కఠినమైన పరిస్థితుల్లో కూడా మార్పు సాధ్యమేననే నమ్మకం గురించి చెబుతుంది. ఆశ అంటే ఇదే. ఇది పట్టుదల, కలలు, ఏదైనా సాధించగలమని నమ్మే ధైర్యం గురించి చెబుతుంది” అని అన్నాడు.
{{/usCountry}}మహ్మద్ జీషన్ ఆయూబ్ మాట్లాడుతూ.. “ఈ కథ స్నేహం, విశ్వాసం, సంపూర్ణ నమ్మకానికి సంబంధించిన ఓ సెలబ్రేషన్ లాంటిది. ఇది నిజమైనది. లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ వ్యక్తులు నిర్మించింది కేవలం ఒక ఫుట్‌బాల్ క్లబ్ మాత్రమే కాదు.. ప్రజల్లో మళ్లీ నమ్మకం చిగురించడానికి కారణం” అని అన్నాడు.
మహేష్ మత్తాయి, రాజేష్ మాపుస్కర్ డైరెక్ట్ చేసిన ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’లో అభిషాంత్ రాణా, మువజ్జం భట్, ప్రియా చౌహాన్, అన్మోల్ ఠాకరియాదిల్లాన్, అఫ్నాన్ ఫాజ్లీ, షాహీమ్ భట్ లాంటి వాళ్లు నటించారు. డిసెంబర్ 9 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ సిరీస్ చూడొచ్చు.