ఓటీటీలోకి మరో అదిరిపోయే వెబ్ సిరీస్.. స్పేస్ జెన్ చంద్రయాన్ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) జరిపిన చంద్రయాన్ మిషన్ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఇది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని సోమవారం (డిసెంబర్ 29) మేకర్స్ అనౌన్స్ చేశారు.

Published on: Dec 29, 2025, 16:36:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియా గర్వించదగ్గ చంద్రయాన్ మిషన్ల ప్రయాణాన్ని కళ్లకు కట్టేలా తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'స్పేస్ జెన్ - చంద్రయాన్' (Space Gen – Chandrayaan). ప్రముఖ నిర్మాణ సంస్థ ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) నిర్మించిన ఈ సిరీస్ జనవరి 23, 2026 నుంచి జియో హాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి మరో అదిరిపోయే వెబ్ సిరీస్.. స్పేస్ జెన్ చంద్రయాన్ స్ట్రీమింగ్ డేట్ ఇదే..
ఓటీటీలోకి మరో అదిరిపోయే వెబ్ సిరీస్.. స్పేస్ జెన్ చంద్రయాన్ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

స్పేస్ జెన్ ఓటీటీ

భారతీయులందరూ తలెత్తుకునేలా చేసిన ఇస్రో (ISRO) ప్రయోగాల వెనుక ఉన్న కృషిని, శాస్త్రవేత్తల పట్టుదలను చూపించేందుకు ఒక అద్భుతమైన సిరీస్ రాబోతోంది. పంచాయత్, కోటా ఫ్యాక్టరీ వంటి సూపర్ హిట్ సిరీస్‌లను అందించిన టీవీఎఫ్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. జియోహాట్‌స్టార్ ఓటీటీ జనవరి 23, 2026న రిపబ్లిక్ డే వీకెండ్ కానుకగా ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది.

మేకర్స్ ఎమోషనల్ పోస్ట్

ఈ సిరీస్ గురించి ప్రకటిస్తూ మేకర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ క్యాప్షన్ పెట్టారు. "కలలు కనేవాళ్ల కోసం.. వాటిని నిజం చేసి చూపించేవాళ్ల కోసం.. జాబిల్లి వైపు ఆశగా చూసే ప్రతి భారతీయుడి కోసం.. హాట్‌స్టార్ స్పెషల్స్: 'స్పేస్ జెన్ - చంద్రయాన్' త్వరలో మీముందుకు.." అని రాసుకొచ్చారు.

చంద్రయాన్ ప్రస్థానం: సిరీస్ లో ఏం ఉంటుంది?

ఈ వెబ్ సిరీస్ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ల చుట్టూ తిరుగుతుంది. 2008లో చేపట్టిన చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి జాడను కనిపెట్టిన మొట్టమొదటి మిషన్ ఇది. ఈ మిషన్ తో ప్రపంచాన్నే నివ్వెర పరిచింది ఇస్రో.

ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2 ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో చేసిన భారీ ప్రయోగం. ల్యాండింగ్ సమయంలో చిన్న ఇబ్బందులు వచ్చినా ఇది ఇస్రో పట్టుదలకు నిదర్శనం.

ఇక 2023లో చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత ఇస్రోకి దక్కింది.

బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇస్రో.. అతి తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి స్పేస్ మిషన్లను ఎలా చేపట్టిందో ఈ సిరీస్ ద్వారా మనం చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More