Box Office Report: రెండు రోజుల్లోనే రూ.109 కోట్ల నెట్.. పఠాన్, ధురంధర్ 2 రేంజ్‌లో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్

Spider Man Box Office Report: స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ దూకుడు మామూలుగా లేదు. ఇండియాలో ఇక్కడి సినిమాల రేంజ్ లో కేవలం రెండే రోజుల్లో ఏకంగా రూ.109 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం.

Published on: Aug 1, 2026, 09:15:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Spider Man Box Office Collection: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సూపర్ హీరో 'స్పైడర్ మ్యాన్' సరికొత్త చరిత్ర సృష్టించాడు. టామ్ హాలండ్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ మార్వెల్ మూవీ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' థియేటర్లలో విడుదలై రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ కలెక్షన్ల మైలురాయిని దాటేసి రికార్డులు తిరగరాసింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇండియన్ సినీ ప్రేమికులు ఈ హాలీవుడ్ విజువల్ వండర్‌కి బ్రహ్మరథం పడుతున్నారు.

Box Office Report: రెండు రోజుల్లోనే రూ.109 కోట్ల నెట్.. పఠాన్, ధురంధర్ 2 రేంజ్‌లో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్
Box Office Report: రెండు రోజుల్లోనే రూ.109 కోట్ల నెట్.. పఠాన్, ధురంధర్ 2 రేంజ్‌లో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్

అవెంజర్స్ రికార్డులు అవుట్.. ఇండియాలో బిగ్గెస్ట్ హాలీవుడ్ ఓపెనింగ్

జులై 30న భారత్‌లో విడుదలైన స్పైడర్ మ్యాన్ సినిమా మొదటి రోజే ఏకంగా రూ.60.60 కోట్ల నెట్ వసూళ్లతో దేశంలోనే బిగ్గెస్ట్ హాలీవుడ్ ఓపెనర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' పేరిట ఉన్న రూ.53.60 కోట్ల ఓపెనింగ్ రికార్డును టామ్ హాలండ్ సులువుగా దాటేశాడు.

రెండో రోజు వర్కింగ్ డే అయిన శుక్రవారం కూడా ఈ మూవీ జోరు కొంచెమైనా తగ్గలేదు. శుక్రవారం నాటి వసూళ్లతో కలిపి రెండు రోజుల్లోనే మొత్తం రూ.109.95 కోట్ల నెట్ (రూ.131.46 కోట్ల గ్రాస్) కలెక్షన్లతో ఇండియాలో తుఫాన్ సృష్టించింది.

బాలీవుడ్ బిగ్గీస్‌కి షాక్.. అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం

ఇండియాలో మన దిగ్గజ సినిమాలు సాధించిన రెండు రోజుల రికార్డులను ఈ మార్వెల్ చిత్రం సీరియస్‌గా ఛాలెంజ్ చేసింది. 'ధురంధర్' (2 రోజుల్లో రూ.60 కోట్లు), 'డంకీ' (2 రోజుల్లో రూ.50 కోట్లలోపు) సాధించిన ఆరంభ వసూళ్లను స్పైడర్ మ్యాన్ చాలా సులువుగా దాటేసాడు. కేవలం పఠాన్, ధురంధర్ 2 వంటి అతికొద్ది ఇండియన్ సినిమాలు మాత్రమే ఈ రకమైన స్పీడ్ చూపించాయి.

మనదేశంలో ఇంగ్లీష్ వెర్షన్ రూ.60 కోట్ల వసూళ్లు సాధించగా, హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ.39 కోట్లతో ఆశ్చర్యపరిచింది. హిందీ బెల్ట్‌లో దాదాపు 90 శాతానికి పైగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగు, తమిళ భాషల డబ్బింగ్ వెర్షన్లు కూడా రెండు రాష్ట్రాల్లో సాలిడ్ నంబర్స్‌తో దూసుకుపోతున్నాయి.

అమెరికా కంటే ముందే ఇండియాలో రిలీజ్..

అమెరికా కంటే ఒక రోజు ముందే భారత్‌లో రిలీజ్ కావడం ఈ భారీ వసూళ్లకు ప్రధాన ప్లస్ పాయింట్ అయింది. నార్త్ అమెరికాలో పెయిడ్ ప్రివ్యూస్ ద్వారానే ఈ సినిమా ఏకంగా 72 మిలియన్ డాలర్లు రాబట్టి గతంలో ఎండ్‌గేమ్ నెలకొల్పిన హిస్టారికల్ రికార్డును బద్దలు కొట్టింది.

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ ఫస్ట్ వీకెండ్‌లోనే 500 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 800 మిలియన్ డాలర్ల దాకా రాబట్టవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా, యూకే, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లో స్పైడర్ మ్యాన్ మేనియా పీక్స్‌లో నడుస్తోంది.

'నో వే హోమ్' తర్వాత పీటర్ పార్కర్ లైఫ్.. కథేంటంటే?

'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' మూవీ క్లైమాక్స్‌లో ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్ ఐడెంటిటీని పూర్తిగా మరచిపోతుంది. ఈ 'బ్రాండ్ న్యూ డే' కథలో పీటర్ పార్కర్ తన ప్రాణస్నేహితులు జెండయా (MJ), జేకబ్ బాటలాన్ (Ned) తనకు దూరమైన బాధలో ఒంటరిగా న్యూయార్క్ నగరంలో జీవిస్తుంటాడు.

డైరెక్టర్ డెస్టిన్ డేనియల్ క్రెటన్ ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను అత్యంత ఆసక్తికరంగా మలిచారు. తోడుగా సాడీ సింక్, మార్క్ రుఫాలో (హల్క్), జాన్ బర్న్ థాల్ (పనిషర్) కీలక పాత్రల్లో అలరించడంతో ఈ మార్వెల్ సినిమా థియేటర్లలో ఆడియెన్స్‌కి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More