...
...
Next Story

Spiderman OTT: స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అలర్ట్.. తెలుగులో ఓటీటీలోకి బ్రాండ్ న్యూ డే.. 20 వేల కోట్ల మూవీ స్ట్రీమింగ్!

Spiderman OTT: స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసి, కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అది కూడా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ పూర్తి ఓటీటీ వివరాలను ఇక్కడ చూసేయండి.

Published on: Oct 3, 2026, 18:34:33 IST
Advertisement

Spiderman OTT: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చే ప్రతి సినిమా ఒక సెన్సేషన్ సృష్టిస్తుంది. అందులోనూ 'స్పైడర్-మ్యాన్' సినిమా అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. థియేటర్లలో సరికొత్త రికార్డులను తిరగరాసి, ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపించిన లేటెస్ట్ విజువల్ వండర్ 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్టోరీ

స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అలర్ట్.. తెలుగులో ఓటీటీలోకి బ్రాండ్ న్యూ డే.. 20 వేల కోట్ల మూవీ స్ట్రీమింగ్!
స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అలర్ట్.. తెలుగులో ఓటీటీలోకి బ్రాండ్ న్యూ డే.. 20 వేల కోట్ల మూవీ స్ట్రీమింగ్!

'నో వే హోమ్' సినిమా ముగింపులో పీటర్ పార్కర్ ఉనికిని ప్రపంచం మొత్తం మర్చిపోతుంది. ఈ 'బ్రాండ్ న్యూ డే' కథ దానికి నాలుగు సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది. తన ప్రాణ స్నేహితుడు నెడ్, ప్రేమించిన ఎంజే తనకు దూరమవడంతో పీటర్ తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తూ ఒంటరిగా జీవిస్తుంటాడు.

ఆ బాధను మర్చిపోవడానికి పూర్తి సమయం స్పైడర్-మ్యాన్‌గా మారి న్యూయార్క్ నగరంలో నేరాలను అరికడుతుంటాడు. అయితే, తీవ్రమైన ఒత్తిడి కారణంగా పీటర్ లోని సాలీడు డీఎన్ఏ వేగంగా మ్యుటేషన్ చెంది, అతనిలో సరికొత్త సూపర్ పవర్స్ పుట్టుకొస్తాయి.

ఊహించని శత్రువు

పీటర్ తన కొత్త శక్తులకు అలవాటు పడుతుంటాడు. అప్పుడే నగరంలో మనుషుల మైండ్‌ను కంట్రోల్ చేస్తూ, ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి ప్రవేశించగల ఒక అదృశ్య, ప్రమాదకరమైన టెలిపతిక్ శత్రువు రంగంలోకి దిగుతుంది. ఈ కొత్త విలన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం పీటర్‌కు సాధ్యం కాదు.

ఈ క్రమంలో బ్రూస్ బ్యానర్ (హల్క్), ఫ్రాంక్ కాజిల్ (పనిషర్) సాయంతో పీటర్ ఆ శత్రువును ఎలా ఎదుర్కొన్నాడు? అలాగే తనను మర్చిపోయిన పాత స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా సాగుతుంది.

కలెక్షన్ల విధ్వంసం

కేవలం ఉత్తర అమెరికా మార్కెట్ లోనే ఈ సినిమా సుమారు $951 మిలియన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక భారతీయ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. మన దేశంలో ఈ సినిమా ఏకంగా రూ.503 కోట్ల నెట్ (రూ.594 కోట్ల గ్రాస్) వసూలు చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

ఓటీటీ డేట్ ఫిక్స్

థియేటర్లలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మిస్ అయిన వారికి, మళ్లీ మళ్లీ చూడాలనుకునే ఫ్యాన్స్ కోసం డిజిటల్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం అక్టోబర్ 6, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులోకి రానుంది. అయితే, మొదటగా ఈ సినిమా ప్రైమ్ వీడియోలో రెంట్ (Rent) లేదా బై (Buy) ఆప్షన్స్ ద్వారా మాత్రమే లభిస్తుంది. అంటే, సాధారణ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారైనా సరే, ఈ సినిమాను వీక్షించడానికి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మూవీ ఓటీటీలోకి తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఇండియా బయట ఇతర దేశాల్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇండియాలో మాత్రం అక్టోబర్ 6 నుంచి అందుబాటులోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks