...
...
Next Story

OTT: ఓటీటీలోకి రూ.23 వేల కోట్ల హాలీవుడ్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

OTT: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులకు, సూపర్ హీరో సినిమాల ప్రియులకు అదిరిపోయే శుభవార్త. హాలీవుడ్ స్టార్ టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో, డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఎట్టకేలకు డిజిటల్ వేదికపైకి రాబోతోంది.

Published on: Nov 12, 2026, 18:40:07 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT: ఓటీటీలోకి రూ.23 వేల కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే వచ్చేస్తోంది. ఈ ఏడాది జులైలో థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. నవంబర్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. ఐఎండీబీ (IMDb)లో 7.9/10 రేటింగ్ సాధించిన ఈ సినిమా స్టోరీ, విశేషాలు ఇక్కడ చూద్దాం.

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్టోరీ ఇలా..

OTT: ఓటీటీలోకి రూ.23 వేల కోట్ల హాలీవుడ్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
OTT: ఓటీటీలోకి రూ.23 వేల కోట్ల హాలీవుడ్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' సంఘటనల తర్వాత నాలుగేళ్లకు ఈ సినిమా కథ మొదలవుతుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి జ్ఞాపకాల నుంచి తన ఉనికిని స్వచ్ఛందంగా చెరిపేసుకున్న పీటర్ పార్కర్ (టామ్ హాలండ్), న్యూయార్క్ నగరంలో పూర్తిస్థాయి స్ట్రీట్-లెవల్ స్పైడర్ మ్యాన్‌గా ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు.

ఆప్తులు దూరమైన బాధ, ఒంటరితనం, ఒత్తిడి కారణంగా పీటర్ శరీరంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. సరిగ్గా అదే సమయంలో న్యూయార్క్ వీధుల్లో కొత్త నేర ముఠాలతో పాటు ఒక మిస్టీరియస్ టెలిపతిక్ విలన్ రంగంలోకి దిగుతాడు. ఈ ప్రమాదకరమైన పోరాటంలో పీటర్‌కు మార్వెల్ యూనివర్స్‌లోని పవర్‌ఫుల్ పాత్రలైన ఫ్రాంక్ కాజిల్ / ది పనిషర్ (జాన్ బెర్న్‌తాల్), బ్రూస్ బ్యానర్ / హల్క్ (మార్క్ రుఫాలో), యెలెనా బెలోవా (ఫ్లోరెన్స్ పగ్)తో పాటు సాడీ సింక్, జెండయా తదితరుల పాత్రలు తోడవుతాయి.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 2.52 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.23 వేల కోట్లు కొల్లగొట్టడం విశేషం. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఇండియాలోనే రూ.500 కోట్లకుపైగా నెట్ సాధించడం విశేషం.

విమర్శకులు, ప్రేక్షకులను కట్టిపడేసిన అంశాలు ఇవే

ముఖ్యంగా యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. సామ్ రైమీ, మార్క్ వెబ్ కాలం నాటి క్లాసిక్ స్పైడర్ మ్యాన్ సూట్ డిజైన్ల కలయికతో రూపొందించిన కొత్త సూట్, షాడో వర్క్ విజువల్ ట్రీట్‌లా నిలిచాయి.

ఇప్పటివరకు 'టోనీ స్టార్క్ శిష్యుడిగా' కనిపించిన కుర్ర స్పైడర్ మ్యాన్ నుంచి, కష్టాలను భరిస్తూ పరిణతి చెందిన అడల్ట్ హీరోగా టామ్ హాలండ్ నటన అద్భుతంగా పండిందని విమర్శకులు కొనియాడారు.

ఈ మైనస్ పాయింట్లు కూడా..

సినిమాలో అత్యద్భుతమైన అంశాలు ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల కథనం తడబడినట్లు కొందరు రివ్యూయర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అతిథి పాత్రల సంఖ్య ఎక్కువ కావడం వల్ల కథనం కాస్త భారంగా , ఎడిటింగ్ అక్కడక్కడా గందరగోళంగా అనిపిస్తుంది.

అలాగే ఆరంభంలో చూపించిన పక్కా స్ట్రీట్-లెవల్ క్రైమ్ థ్రిల్లర్ వాతావరణంతో పోలిస్తే, మ్యూటేషన్, టెలిపతిక్ విలన్ సబ్‌ప్లాట్ అంత పదునుగా లేదని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.

చిన్నచిన్న లోపాలు ఉన్నప్పటికీ.. బలమైన భావోద్వేగాలు, అద్భుతమైన స్టంట్స్ , మార్వెల్ హీరోల క్రాస్ఓవర్‌తో 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను మిస్ అయిన వారు నవంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా తప్పకుండా చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks