నెట్‌ఫ్లిక్స్‌లో పారానార్మల్ యాక్టివిటీ ఆధారంగా రూపొందించిన 7 సినిమాలు ఇక్కడున్నాయి. కొన్ని నిజాలు కల్పనల కంటే భయంకరంగా, గుండెల్ని పిండేసేలా ఉంటాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన కొన్ని రహస్యమైన పారానార్మల్ చిత్రాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. వీటికి సైన్స్ వద్ద కూడా సమాధానం లేదు, కానీ ఈ సంఘటనలు వాస్తవంగా జరిగాయి.
ది డెలివరెన్స్

లాటోయా, అమాన్స్, వారి కుటుంబం ఇండియానాలోని గ్యారీలో ఒక కొత్త ఇంటికి మారినప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటన ఆధారంగానే 'ది డెలివరెన్స్'ను రూపొందించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఇలాంటిది మీతో జరిగితే ఏం చేస్తారని ఊహించుకోండి. ఈ హారర్ థ్రిల్లర్ కు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.
ట్రూ హాంటింగ్
ఇది రెండు కథలతో కూడిన ఒక డాక్యుమెంటరీ చిత్రం. పారానార్మల్ యాక్టివిటీ, దెయ్యాలతో ఇంటర్వ్యూల వంటి నిజ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
హౌస్ ఆఫ్ సీక్రెట్స్ - ది బురారీ డెత్స్
భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక సంఘటనపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. ఎందుకంటే ఒక ఉమ్మడి కుటుంబంలోని సభ్యులందరూ అకస్మాత్తుగా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఈ రహస్యాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. ఓటీటీని కూడా షేక్ చేసింది.
హంటెడ్
మీరు దెయ్యాల కథలను నమ్మినా, నమ్మకపోయినా వినడానికి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇదే ఆలోచనతో మీరు ఈ డాక్యుమెంటరీని చూడవచ్చు. ఇందులో దెయ్యాల అనుభవాలను స్వయంగా ఎదుర్కొన్న చాలా మంది వ్యక్తుల కథలు ఉన్నాయి.
మెర్సీ బ్లాక్
ఈ చిత్రాన్ని కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. మెర్సీ బ్లాక్ అనే దెయ్యం కథలు స్థానిక ప్రజలను సంవత్సరాలుగా భయపెడుతూనే ఉన్నాయి.
వెరోనికా
{{/usCountry}}ఈ చిత్రాన్ని కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. మెర్సీ బ్లాక్ అనే దెయ్యం కథలు స్థానిక ప్రజలను సంవత్సరాలుగా భయపెడుతూనే ఉన్నాయి.
వెరోనికా
{{/usCountry}}నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న అత్యంత అద్భుతమైన హారర్ చిత్రాలలో వెరోనికా మూవీని ఒకటిగా పరిగణిస్తారు. కానీ దీని కథ నిజ జీవిత సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తీసుకున్నారని చాలా తక్కువ మందికి తెలుసు. ఇది హారర్ థ్రిల్లర్ క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
ది కంజూరింగ్
హారర్ చిత్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం 'ది కంజూరింగ్'ను ఎలా మర్చిపోగలం? ఈ హారర్ మూవీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి.