OTT Movie: థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకొని ఐఎమ్‌డీబీ (IMDb)లో ఏకంగా 9.2 అత్యుత్తమ రేటింగ్ సాధించిన హిందీ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా 'మై లడేగా' (Main Ladega) ఎట్టకేలకు డిజిటల్ ఆడియెన్స్ ముందుకొస్తోంది.

యంగ్ హీరో ఆకాష్ ప్రతాప్ సింగ్ ప్రధాన పాత్రలో నటించి స్వయంగా కథ అందించిన ఈ మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar)ను లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా ఓటీటీలో గ్రాండ్ గా స్ట్రీమింగ్ కానుంది.
కన్నీళ్లు పెట్టించే కథాంశం.. తండ్రి వేధింపుల నుంచి బాక్సింగ్ రింగ్ వరకు..
ఇంట్లో తండ్రి పెట్టే గృహహింస, వేధింపుల మధ్య పెరిగిన ఒక సాధారణ కుర్రాడు తన ఆవేదనను, కోపాన్ని ఒక ఆయుధంగా ఎలా మార్చుకున్నాడనే ఇన్స్పిరేషనల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. తల్లే లోకంగా భావించే ఆ కుర్రాడిని కుటుంబానికి దూరంగా ఒక ఆర్మీ హాస్టల్ కి పంపిస్తారు. అక్కడ తన బాధనంతా బాక్సింగ్ రింగ్ లో చూపిస్తూ, ఒక పవర్ ఫుల్ బాక్సర్ గా ఎదిగి తన కుటుంబాన్ని కాపాడుకోవడమే ఈ చిత్రంలో మెయిన్ హైలైట్.
ఆకాష్ ప్రతాప్ సింగ్ పవర్‌ఫుల్ యాక్టింగ్..
నటుడిగా, రచయితగా ఆకాష్ ప్రతాప్ సింగ్ ఈ సినిమాకి ప్రాణం పోశాడు. బాక్సింగ్ రింగ్ లో ఒక రియల్ ఫైటర్ లా కనిపిస్తూనే, తల్లి పడే వేదనను చూసి కలత చెందే కొడుకుగా మెస్మరైజ్ చేసే పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరో తండ్రిగా అశ్వత్ భట్, తల్లిగా జ్యోతి గౌబా తమ నటనతో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తారు. వల్లరి విరాజ్, గంధర్వ్ దివాన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
గ్రిప్పింగ్ డైరెక్షన్.. మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
దర్శకుడు గౌరవ్ రాణా ఈ స్పోర్ట్స్ డ్రామాను కేవలం ఒక మామూలు బాక్సింగ్ ఫిలింలా కాకుండా, ప్రతి ఇంట్లో ఉండే ఎమోషనల్ కనెక్ట్ తో తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. కథలో వచ్చే ప్రతీ ట్విస్ట్, బాక్సింగ్ సీన్స్ కి ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి. గిబ్సన్ జార్జ్ అందించిన మ్యూజిక్, లక్కీ యాదవ్ కెమెరా వర్క్ ప్రతీ సీన్ ని చాలా రిచ్ గా ప్రెజెంట్ చేశాయి.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్..
కథాకార్ ఫిల్మ్స్ బ్యానర్ పై అక్షయ్ భగవాన్జీ, పినాకిన్ భక్త ఈ సినిమాను నిర్మించారు. 2 గంటల 28 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా థియేటర్లలో రిలీజైనప్పుడు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎమోషన్ తోడు కావడంతో 9.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ సొంతం చేసుకుంది.
{{/usCountry}}కథాకార్ ఫిల్మ్స్ బ్యానర్ పై అక్షయ్ భగవాన్జీ, పినాకిన్ భక్త ఈ సినిమాను నిర్మించారు. 2 గంటల 28 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా థియేటర్లలో రిలీజైనప్పుడు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎమోషన్ తోడు కావడంతో 9.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ సొంతం చేసుకుంది.
{{/usCountry}}ఇన్నాళ్లూ థియేటర్ లో ఈ సినిమా చూడలేకపోయిన ఓటీటీ ఆడియెన్స్ కి ఇప్పుడు జియో హాట్‌స్టార్ పర్ఫెక్ట్ వేదిక కానుంది. సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్, మైండ్ రీఫ్రెష్ చేసే ఎమోషనల్ కంటెంట్ ని కోరుకునే ప్రతి ఒక్కరినీ అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.