Sreeleela Deepfake: శ్రీలీల అశ్లీలమైన వీడియో వైరల్.. డీప్ ఫేక్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఇదీ
Sreeleela Deep Fake: శ్రీలీల పేరుతో సోషల్ మీడియాలో ఒక అశ్లీల వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే అది శ్రీలీల అసలు వీడియో కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ఫేక్ సాంకేతికతతో వేరొక నటి వీడియోకు ఆమె ముఖాన్ని మార్చారని ఆధారాలతో సహా బయటపడింది.
Sreeleela Deep Fake: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత రోజురోజుకూ విస్తరిస్తున్న కొద్దీ దాని దుర్వినియోగం కూడా సినీ రంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని అశ్లీల ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం ఇటీవల ఎక్కువైంది. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు.

గత రెండు రోజులుగా శ్రీలీల పేరిట ఒక అశ్లీల దుస్తుల్లో ఉన్న యువతి వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్నది శ్రీలీల అని భావించి పలువురు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే ఈ వైరల్ క్లిప్ వెనుక ఉన్న నిజానిజాలను పరిశీలిస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వేరొక నటి వీడియోతో ఏఐ మార్ఫింగ్
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఉన్నది నిజానికి హీరోయిన్ శ్రీలీల కాదు. 'దృశ్యం 2', 'భూల్ భులయ్యా 3' వంటి పాపులర్ సినిమాలతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి రోజ్ సర్దానా (Rose Sardana) అసలు వీడియోను ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేశారు.
బిగ్ బాస్ 17 రన్నరప్, టీవీ నటుడు, యూట్యూబర్ అభిషేక్ కుమార్ 2026 ఆగస్టులో జరుపుకున్న జన్మదిన వేడుకలకు రోజ్ సర్దానా హాజరయ్యారు. ఆ పార్టీలో ఆమె ధరించిన దుస్తులు, అక్కడ తీసిన వీడియో క్లిప్పింగ్‌ను కొందరు సైబర్ నేరగాళ్లు సేకరించారు. ఆ తర్వాత ఫేస్-స్వాపింగ్ టూల్స్ ఉపయోగించి రోజ్ సర్దానా ముఖం స్థానంలో నటి శ్రీలీల ముఖాన్ని అతికించి నెట్టింట వదిలారు.
సెలబ్రిటీలను వేధిస్తున్న డీప్‌ఫేక్ రక్కసి
గతంలో రష్మిక మందన్న, కాజోల్, కత్రినా కైఫ్ వంటి అగ్ర కథానాయికలు కూడా ఇలాంటి ఏఐ డీప్‌ఫేక్ వీడియోల బారిన పడి తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు. ఇప్పుడు శ్రీలీల విషయంలోనూ అదే రీతిలో సైబర్ నేరస్థులు దారుణానికి ఒడిగట్టారు. ఈ వీడియో నిజమైనదేనని భావించి కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేయడంపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా నటీనటుల వ్యక్తిగత స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సైబర్ చట్టాలు ఇలా..
ఇలాంటి అసత్య ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోలు వ్యాప్తి చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఏఐ సాంకేతికత ద్వారా సృష్టించే ఫేక్ కంటెంట్‌ను గుర్తించి అడ్డుకోవడంలో ఆడియెన్స్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది.
శ్రీలీల అభిమానులు, నెటిజన్లు ఈ మిస్‌లీడింగ్ డీప్‌ఫేక్ కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికల్లో ఫార్వర్డ్ లేదా షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి డీప్‌ఫేక్ లేదా మార్ఫింగ్ వీడియోలు కనిపిస్తే వెంటనే సంబంధిత సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సదరు ప్లాట్‌ఫామ్‌లకు రిపోర్ట్ చేయడం ఉత్తమం.
ఈ ఫేక్ వీడియో ఘటనపై శ్రీలీల లేదా ఆమె లీగల్ టీమ్ ఏ రకమైన న్యాయపరమైన చర్యలకు దిగుతుందనేది వేచి చూడాల్సి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మంచికి ఉపయోగించాల్సింది పోయి, ఇలా సెలబ్రిటీల ప్రైవసీని దెబ్బతీసేలా దుర్వినియోగం చేయడం పట్ల నెటిజన్లు, చిత్ర పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


