Sreeleela Kriti Shetty: శ్రీలీల, కృతి శెట్టి కెరీర్ లో ఊహించని మార్పు.. ఇతర ఇండస్ట్రీల వైపు అడుగులు.. మాస్టర్ ప్లాన్!
Sreeleela Kriti Shetty: టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరోయిన్లు శ్రీలీల, కృతి శెట్టి ఇప్పుడు తమ రూటు మార్చారు. తెలుగులో వరుస ఫ్లాపుల కారణంగా అవకాశాలు సన్నగిల్లడంతో, ఈ ఇద్దరు భామలు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తమ కెరీర్ ను సెట్ చేసుకునే పనిలో పడ్డారు.
Sreeleela Kriti Shetty: శ్రీలీల, కృతి శెట్టి.. ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలోనే మోస్ట్ ప్రామిసింగ్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమ అందం, అభినయంతో కుర్రకారును ఉర్రూతలూగించారు. కానీ, ఇప్పుడు టాలీవుడ్ లో వరుస పరాజయాలు ఎదురుకావడంతో, ఈ ఇద్దరు భామలు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో వస్తున్న అవకాశాలపై తమ దృష్టిని మళ్లించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

స్టార్ హీరోయిన్
'పెళ్లిసందD' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ఆ తర్వాత రవితేజ 'ధమాకా', బాలకృష్ణ 'భగవంత్ కేసరి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఒక దశలో చేతిలో అరడజను సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీగా గడిపింది.
కానీ 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్', రీసెంట్ గా వచ్చిన 'రాబిన్ హుడ్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో శ్రీలీల కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ
దీంతో ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్ పై కన్నేసింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఓ హిందీ సినిమాతో పాటు, ఉమేష్ బిస్ట్ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేసింది. అలాగే కోలీవుడ్ లో ధనుష్ తో 'ఓం' అనే సినిమా చేస్తూ, ప్రస్తుతం టాలీవుడ్ కంటే ఇతర ఇండస్ట్రీలలోనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. తాజాగా అజిత్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది.
కృతి శెట్టి పాన్ ఇండియా ప్లాన్స్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది కృతి శెట్టి. ఆ తర్వాత నాని 'శ్యామ్ సింగరాయ్', నాగార్జున 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. అయితే ఆ వెంటనే వరుస పరాజయాలు పలకరించడంతో టాలీవుడ్ లో కృతి శెట్టికి క్రేజ్ తగ్గింది.
దీంతో పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ చేసిన ఈ బ్యూటీ.. మలయాళంలో టొవినో థామస్ సరసన 'ARM' సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే తమిళంలో 'వా వాతియార్', 'లవ్ ఇన్సూరెన్స్ కొంపనీ' లాంటి భారీ ప్రాజెక్టులు చేసినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు.
తెలుగులో చేస్తూ
ఇప్పుడు ఏకంగా రోహిత్ శెట్టి నిర్మాణంలో రూపొందుతున్న 'హమ్ తేరే ప్యార్ మే' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది కృతి శెట్టి. అయితే కొన్నాళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న ఈ భామ.. జనవరి 12 విడుదల మూవీతో మళ్లీ లక్ చెక్ చేసుకోబోతోంది.
మారిన కెరీర్ ప్లాన్స్
ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన ఈ ఇద్దరు భామలు, సరైన కథలు, డైరెక్టర్లను ఎంచుకోవడంలో చేసిన పొరపాట్ల వల్లే వెనకబడ్డారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇతర భాషల్లో అయినా సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలని శ్రీలీల, కృతి శెట్టి గట్టి పట్టుదలతో ఉన్నారు.
టాలీవుడ్ లో వారికి ఎదురైన చేదు అనుభవాలను పక్కనబెట్టి, కొత్త ఇండస్ట్రీలలో తమకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను వీరు ఏ మేరకు మెప్పిస్తారో, మళ్లీ టాలీవుడ్ కు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


