Sreeleela: ట్రోల్స్ భయంతో ఏడ్చేసిన శ్రీలీల.. భయంగా ఉందన్న రాశీ ఖన్నా.. హీరోయిన్లు చెప్పిన షాకింగ్ నిజాలు

Sreeleela: 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రమోషన్లలో శ్రీలీల, రాశి ఖన్నా సోషల్ మీడియా ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రోల్స్ భయంతో శ్రీలీల ఏకంగా నటన వదిలేయాలనుకున్నానని చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పటికీ భయంగా ఉందని రాశీ ఖన్నా పేర్కొంది.

Published on: Mar 21, 2026, 18:34:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ మూవీ థియేటర్లకు వచ్చింది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్ గా యాంకర్ సుమతో వీళ్లు ముచ్చటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ తమను ఎంతలా బాధిస్తుందో వారు ఓపెన్‌గా పంచుకున్నారు.

శ్రీలీల, రాశీ ఖన్నా
శ్రీలీల, రాశీ ఖన్నా

ఏడుస్తూ కూర్చునేదాన్ని

ట్రోలింగ్‌కు భయపడుతున్నారా అని సుమ అడగ్గా, శ్రీలీల ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "కెరీర్ మొదట్లో చాలా భయపడేదాన్ని, ఏడుస్తూ కూర్చునేదాన్ని. యాక్టింగ్ వదిలేసి మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళిపోతానని అమ్మతో కూడా చెప్పా. కానీ ఆ తర్వాత అలవాటు అయింది" అని షాకింగ్ నిజాన్ని శ్రీలీల బయటపెట్టింది.

రాశీ ఖన్నా ఆందోళన

రాశీ ఖన్నా స్పందిస్తూ, ఇప్పుడు ట్రోలింగ్ చాలా తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేసింది. "నిజం తెలియకుండానే జనం తీర్పు ఇచ్చేస్తున్నారు. క్లిక్‌బైట్ కోసం ఏది పడితే అది రాస్తున్నారు. ఇన్నేళ్లుగా నేను నిర్మించుకున్న ఇమేజ్ ఎక్కడ పాడవుతుందోనని భయంగా ఉంది" అని రాశీ ఖన్నా పేర్కొంది.

ప్రేక్షకుల తెలివితేటలు

ట్రోల్స్ విపరీతంగా వస్తున్నప్పటికీ ప్రజలకు ఇప్పుడు సొంతంగా ఆలోచించే తెలివితేటలు ఉన్నాయని శ్రీలీల అభిప్రాయపడింది. ప్రతికూల వార్తలను చూసినప్పుడు జనం కొంచెం ఆలోచిస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. రాశీ కూడా ఈ విషయాన్ని బలపరుస్తూ నెగిటివిటీపై తన గళాన్ని బలంగా వినిపించింది.

డాక్టర్ శ్రీలీల సక్సెస్

శ్రీలీల నటనను వదిలేయకపోయినా, తన చదువును మాత్రం విజయవంతంగా పూర్తి చేసింది. ‘భగవంత్ కేసరి’, 'గుంటూరు కారం' వంటి భారీ సినిమాల్లో నటిస్తూనే డాక్టర్ విద్య కొనసాగించింది. రీసెంట్ గా శ్రీలీల ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా అందుకుని డాక్టర్ శ్రీలీల అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి.

చేతినిండా ప్రాజెక్టులు

శ్రీలీల తమిళంలో ధనుష్ తో సినిమా చేస్తోంది. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో కలిసి నటిస్తోంది. మరోవైపు రాశి ఖన్నా కూడా 'ఫర్జీ 2' వెబ్ సిరీస్‌తో పాటు హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ ఇద్దరు భామలు ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్లుగా నటించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో అని కొంతమంది అంటుంటే, అదే ఔట్ డేటెడ్ స్టోరీ అని మరికొంతమంది అంటున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More