‘ఇది మీరు ఊహించి ఉండరు’.. ధనుష్ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల‌.. కోలీవుడ్‌లో పాగా వేస్తున్న సెన్సేషనల్ బ్యూటీ

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కోలీవుడ్ లో పాగా వేసేందుకు రెడీ అయింది. తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వైరల్ గా మారింది. 

Published on: Jan 31, 2026, 19:54:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అందం, యాక్టింగ్, డ్యాన్స్ తో తెలుగు ఆడియన్స్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీలీల ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా పరాశక్తి అనే తమిళ మూవీ చేసిన ఈ భామ.. ఇప్పుడు ఏకంగా తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. ధనుష్ కొత్త మూవీ (డీ55)లో శ్రీలీల హీరోయిన్ అని మేకర్స్ ఇవాళ (జనవరి 31) అనౌన్స్ చేశారు.

శ్రీలీల, ధనుష్ (x/wunderbarfilms)
శ్రీలీల, ధనుష్ (x/wunderbarfilms)

ధనుష్ సినిమాలో శ్రీలీల

రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ఇంకా టైటిల్ పెట్టలేదు. డీ55 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. ఈ విషయాన్ని మేకర్స్ శనివారం ప్రకటించారు.

ఊహించి ఉండరు కదా

‘‘మీరు ఊహించి ఉండరు కదా. డీ55 సినిమాలోకి డాజ్లింగ్ శ్రీలీలకు వెల్ కమ్’’ అని ప్రొడక్షన్ బ్యానర్ వండర్ బార్ ఫిల్మ్స్ ప్రకటించింది. డీ55 సినిమాలో ధనుష్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ డైరెక్టర్. ధనుష్ సొంత ప్రొడక్షన్ హౌస్ వండర్ బార్ ఫిల్మ్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పరాశక్తితో

టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇటీవల పరాశక్తి మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ఈ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. ఇందులో తెలుగు వాళ్లను అవమానించేలా డైలాగ్ ఉండటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

మూడు సినిమాలు

2025లో శ్రీలీల హీరోయిన్ గా నటించిన రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏ మూవీ కూడా శ్రీలీలకు హిట్ ఇవ్వలేకపోయింది. వరుసగా సినిమాలు చేస్తున్నా ఈ బ్యూటీకి హిట్ మాత్రం దక్కడం లేదు. ఇప్పుడు హిందీలో ఓ మూవీ, తెలుగులో పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఆశలు పెట్టుకుంది శ్రీలీల. ఇప్పుడు ధనుష్ తో మూవీ ఛాన్స్ తో ఆమె కెరీర్ దశ తిరుగుతుందేమో చూడాలి.

కుబేర, ఇడ్లీ కొట్టు, అమర కావ్యం (హిందీలో తేరే ఇష్క్ మే).. ఇలా వరుసగా సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు హీరో ధనుష్. ఇప్పుడు అతని లైనప్ లో రెండు సినిమాలున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More