Bigg Boss 10: ఎక్స్‌ప్రెస్ హ‌రిని చూస్తే గ‌ర్వంగా ఉంద‌న్న శ్రీముఖి-ఫొటో వైరల్- బిగ్‌బాస్‌కు వెళ్తున్నాడా? అసలు నిజం ఇదే!

Bigg Boss 10: బుల్లితెర క్రేజీ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హ‌రి చుట్టూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన రూమర్ చక్కర్లు కొడుతోంది. స్టార్ యాంకర్ శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హరిని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అతను బిగ్ బాస్ 10లోకి వెళ్తాడనే ప్రచారం జోరందుకుంది. కానీ అసలు నిజం వేరే ఉంది.

Published on: Jul 3, 2026, 14:11:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10: ఈటీవీ ప్లస్, స్టార్ మా షోలలో తన మార్క్ టైమింగ్ కామెడీతో పాటు జబర్దస్త్ వంటి క్రేజీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎక్స్‌ప్రెస్ హరి. ఇప్పుడు స్టార్ మాలో వివిధ షోలలో కమెడియన్ గా, స్క్రిప్ట్ రైటర్ గా దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి హరి వెళ్తాడనేది హాట్ టాపిక్ గా మారింది.

ఎక్స్‌ప్రెస్ హ‌రిని చూస్తే గ‌ర్వంగా ఉంద‌న్న శ్రీముఖి-ఫొటో వైరల్- బిగ్‌బాస్‌కు వెళ్తున్నాడా? (instagram)
ఎక్స్‌ప్రెస్ హ‌రిని చూస్తే గ‌ర్వంగా ఉంద‌న్న శ్రీముఖి-ఫొటో వైరల్- బిగ్‌బాస్‌కు వెళ్తున్నాడా? (instagram)

శ్రీముఖి స్టోరీ

బుల్లితెర గ్లామరస్ యాంకర్, 'రాములమ్మ' శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హరితో దిగిన ఒక ఫొటోను స్టోరీగా పెట్టింది. "భవిష్యత్ లో అందమైన మెమోరీస్ కలగాలి. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది హరి.. కంగ్రాచ్యులేషన్స్" అంటూ హార్ట్ ఎమోజీలను జత చేసింది శ్రీముఖి. ఈ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది.

బిగ్ బాస్ 10లోకి హరి

ఇప్పటికే 'బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 10' కంటెస్టెంట్ల షార్ట్‌లిస్ట్‌లో హరి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ కమెడియన్ ఈ సారి కచ్చితంగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీముఖి పోస్ట్ చూసిన నెటిజన్లు, అభిమానులు అతను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడం ఖాయమని అనుకుంటున్నారు. అందుకే శ్రీముఖి ముందే హింట్ ఇస్తూ అభినందనలు తెలిపిందని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించడం ప్రారంభించారు.

అసలు నిజం నిదే

అయితే, సోషల్ మీడియాలో హరి బిగ్‌బాస్ ఎంట్రీపై వస్తున్న కామెంట్లు, కథనాలలో ఎంతమాత్రం ఫ్యాక్ట్ లేదు. శ్రీముఖి పెట్టిన ఆ వైరల్ ఫొటో వెనుక అసలు విషయం ఏంటంటే.. ఎక్స్‌ప్రెస్ హరి తన సొంత సంపాదనతో సొంత ఇంటి కల నెరవేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే హరి కొత్త ఇంటి గృహ ప్రవేశ వేడుక అత్యంత ఆప్తుల మధ్య జరిగింది.

ఈ ప్రత్యేకమైన శుభకార్యానికి హరి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన శ్రీముఖి, మరో స్టార్ కమెడియన్ ముక్కు అవినాష్‌లు హాజరయ్యారు. హరి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, కేవలం తన టాలెంట్, కష్టాన్ని నమ్ముకుని ఈ స్థాయికి ఎదగడం, సొంత ఇల్లు కట్టుకోవడం చూసి శ్రీముఖి ఎమోషనల్ అయ్యింది. ఆ గర్వంతోనే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ ఫొటోను పంచుకుంది. కేవలం కొత్త ఇల్లు కొన్నందుకే ఆమె అభినందనలు తెలిపింది తప్ప, బిగ్‌బాస్ ఎంట్రీ కోసం కాదు.

ఎక్స్‌ప్రెస్ హరి సక్సెస్ జర్నీ

ఎక్స్‌ప్రెస్ హరి కేవలం స్టేజ్ పైన కనిపించే కమెడియన్‌గానే కాకుండా, ఎంతోమంది జబర్దస్త్ కంటెస్టెంట్లకు, పండుగ ఈవెంట్లకు బ్యాక్ ఎండ్‌లో పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్ రాసే టాప్ రైటర్‌గా బుల్లితెరపై కొనసాగుతున్నాడు. ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బంది పడ్డ అతను.. ఇప్పుడు సొంత ఇంటికి ఓనర్ అయ్యాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More