SRH Vs RR: రాజస్థాన్ రాయల్స్‌పై సన్ రైజర్స్ ఘన విజయం- పరుగుల మోత, వికెట్ల వరద- ఆర్ఆర్ తొలి ఓటమి- 4వ స్థానంలో ఎస్ఆర్‌హెచ్

SRH Vs RR Highlights IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై చెలరేగిన ఆరెంజ్ ఆర్మీ, వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఓటమిని రుచి చూపించింది. యువ బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిపోయింది.

Apr 14, 2026, 05:57:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SRH vs RR IPL 2026 Highlights: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం (ఏప్రిల్ 13) జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుతంగా ప్రదర్శన చూపింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్‌లో పరుగులు, సిక్సర్ల మోతతోపాటు బౌలింగ్‌లో వికెట్ల వరదను పారించింది.

రాజస్థాన్ రాయల్స్‌పై సన్ రైజర్స్ ఘన విజయం- పరుగుల మోత, వికెట్ల వరద- ఆర్ఆర్ తొలి ఓటమి- 4వ స్థానంలో ఎస్ఆర్‌హెచ్ (HT_PRINT)
రాజస్థాన్ రాయల్స్‌పై సన్ రైజర్స్ ఘన విజయం- పరుగుల మోత, వికెట్ల వరద- ఆర్ఆర్ తొలి ఓటమి- 4వ స్థానంలో ఎస్ఆర్‌హెచ్ (HT_PRINT)

తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్ఆర్

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అయితే, ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

ట్రావిస్ హెడ్ (18) నెమ్మదించినా, ఇషాన్ కిషన్ మాత్రం రాజస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడారు. కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. జట్టు భారీ స్కోరు సాధించడానికి పునాది వేశారు. మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ (40), చివర్లో నితీష్ కుమార్ రెడ్డి (28) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అరంగేట్రం బౌలర్ల సంచలనం: కుప్పకూలిన రాజస్థాన్

217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే ఊహించని దెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌తో ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని అరంగేట్రం పేసర్ ప్రఫుల్ హింజ్ తొలి బంతికే పెవిలియన్ పంపారు. పవర్‌ప్లే ముగిసేలోపే రాజస్థాన్ 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ మ్యాచ్‌లో డెబ్యూ చేసిన ఇద్దరు యువ బౌలర్లు ప్రఫుల్ హింజ్, షాకిబ్ హుస్సేన్ మంత్రముగ్ధమైన బౌలింగ్‌తో మాయ చేశారు. ప్రఫుల్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి రాజస్థాన్ వెన్నుముక విరిచారు. షాకిబ్ హుస్సేన్ సైతం 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ విజయాన్ని నల్లేరుపై నడకలా మార్చారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 8 వికెట్లు పంచుకోవడం గమనార్హం. 10 బాల్స్‌లోనే 3 వికెట్లు పడటంతో ఆర్ఆర్‌కు దారుణైన దెబ్బ తగిలింది.

పోరాడినా ఫలితం దక్కలేదు

రాజస్థాన్ బ్యాటర్లలో డొనోవన్ ఫెరీరా (69), రవీంద్ర జడేజా (45) కాసేపు ప్రతిఘటించారు. చివర్లో తుషార్ దేశ్‌పాండే మూడు సిక్సర్లతో అలరించినప్పటికీ, లక్ష్యం చాలా పెద్దది కావడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. 19 ఓవర్లలోనే రాజస్థాన్ 159 పరుగులకు ఆలౌట్ కావడంతో, సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్ హింజ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యారు.

పాయింట్ల పట్టికలో మార్పులు

ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచిన హైదరాబాద్, తన రన్ రేట్‌ను (+0.576) మెరుగుపరుచుకుంది. అటు రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసినప్పటికీ, 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గానే కొనసాగుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో విజేత ఎవరు?

ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తరపున అత్యధిక పరుగులు చేసింది ఎవరు?

కెప్టెన్ ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 91 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

3. హైదరాబాద్ బౌలర్లలో ఎవరు రాణించారు?

అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింజ్ మరియు షాకిబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లు తీసి రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు.

4. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో హైదరాబాద్ స్థానం ఎంత?

ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నాలుగో స్థానానికి చేరుకుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More