RR vs RCB : మొన్న బుమ్రా, నిన్న భువి- హేజిల్‌వుడ్! ఉతికారేస్తున్న వైభవ్.. గేల్ రికార్డ్ జస్ట్‌లో మిస్!
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో హేజిల్‌వుడ్, భువనేశ్వర్ వంటి దిగ్గజ బౌలర్లను చీల్చిచెండాడుతూ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డులు సృష్టించాడు.
RR vs RCB highlights : ఐపీఎల్ 2026లో ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక పేరు.. వైభవ్ సూర్యవంశీ! జట్టేదైనా, బౌలర్ ఎవరైనా.. భయం లేకుండా బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ 15ఏళ్ల యువ సంచలనం. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, ప్రపంచ స్థాయి బ్యాటర్లనే బెంబేలెత్తించే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌నే ఉతికేసిన సూర్యవంశీ.. తాజాగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ విభాగాన్ని చీల్చి చెండాడేశాడు! మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జాష్ హేజిల్‌వుడ్‌కి చుక్కలు చూపించాడు. ఈ యంగ్ గన్.. భువనేశ్వర్ కుమార్‌ని కూడా విడిచిపెట్టలేదు.

క్రిస్ గేల్ రికార్డుకు చేరువగా..
202 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ సునాయాశంగా విజయాన్ని అందుకుంది. దీనికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ బాదుడు! ఈ మ్యాచ్‌లో వైభవ్ ఆడిన తీరు చూస్తుంటే, ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ (30 బంతులు) రికార్డు ఈరోజే బద్దలవుతుందని అందరూ భావించారు. కేవలం 24 బంతుల్లోనే 78 పరుగులు చేసిన వైభవ్, ప్రతి బంతినీ బౌండరీ దాటించే పనిలో పడ్డాడు.
అయితే, 25వ బంతికి కృనాల్ పాండ్యా వేసిన బంతిని సరిగ్గా మిడిల్ చేయలేక లాంగ్ ఆన్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో గేల్ రికార్డు ప్రస్తుతానికి సురక్షితంగా మిగిలింది. అది ఏ క్షణంలోనైనా బ్రేక్ అవ్వొచ్చని వైభవ్ ఆటని చూస్తే తెలిసిపోతోంది.
హేజిల్‌వుడ్, భువీలపై దాడి..
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వైభవ్ తన ప్రతాపాన్ని చూపించాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఓవర్‌లో మొదటి నాలుగు బంతుల్లోనే 18 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు వరుస ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉన్నాయి. మరోవైపు స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ కూడా వైభవ్ ధాటికి తలవంచక తప్పలేదు. వరుసగా రెండు సిక్సర్లు బాదిన వైభవ్, కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్నాడు.
ఈ సీజన్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా అతను 15 బంతుల్లోనే యాభై పరుగుల మార్కును చేరడం విశేషం.
ఐపీఎల్‌లో భారతీయుల ఫాస్టెస్ట్ ఫిఫ్టీలు (బంతుల వారీగా)..
యశస్వి జైస్వాల్ (ఆర్ఆర్)- 13 కేకేఆర్, కోల్‌కతా, 2023
కేఎల్ రాహుల్ (పీబీకేఎస్)- 14 డీసీ, మొహాలీ, 2018
యూసుఫ్ పఠాన్ (కేకేఆర్)- 15 ఎస్ఆర్హెచ్, కోల్‌కతా, 2014
వైభవ్ సూర్యవంశీ (ఆర్ఆర్)- 15 సీఎస్కే, గువహటి, 2026
వైభవ్ సూర్యవంశీ (ఆర్ఆర్)- 15 ఆర్సీబీ, గువహటి, 2026
ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ- పటిదార్ పోరాటం వృథా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201/8 పరుగులు చేసింది. ఒకానొక దశలో 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆర్సీబీని కెప్టెన్ రజత్ పటిదార్ (63 పరుగులు, 40 బంతులు) ఆదుకున్నాడు. విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 32 పరుగులు చేసి మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. చివరలో ఇంపాక్ట్ సబ్ వెంకటేష్ అయ్యర్ 15 బంతుల్లో 29 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు.
అయితే, వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు ఈ స్కోరు ఏమాత్రం సరిపోలేదు. వైభవ్ వెనుదిరిగే సమయానికి రాజస్థాన్ 8.1 ఓవర్లలోనే 129/2 స్కోరుతో విజయం దిశగా దూసుకెళ్లింది.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎవరి పేరిట ఉంది?
క్రిస్ గేల్ (ఆర్సీబీ) 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ 24 బంతుల్లో 78 పరుగులు చేసి ఈ రికార్డుకు చేరువగా వచ్చాడు.
2. వైభవ్ సూర్యవంశీ వయస్సు ఎంత?
వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత వయస్సు 15 ఏళ్లు. ఇంత చిన్న వయస్సులోనే ఐపీఎల్‌లో స్టార్ బౌలర్లను ఎదుర్కొంటూ రికార్డులు సృష్టిస్తున్నాడు.
3. ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన భారతీయుడు ఎవరు?
యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఈ రికార్డును తన పేరిట ఉంచుకున్నాడు.
4. వైభవ్ సూర్యవంశీ ఏ జట్టు తరపున ఆడుతున్నాడు?
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


