6,6,6,6,6,6,6,6,.. వరుసగా 8 సిక్సర్లు.. 11 బాల్స్ లోనే ఫిఫ్టీ.. రంజీ మ్యాచ్ లో వరల్డ్ రికార్డు

దేశవాళీ రంజీ మ్యాచ్ లో హిస్టరీ క్రియేట్ అయింది. ప్రపంచ రికార్డు నమోదైంది. వరుసగా 8 సిక్సర్లు కొట్టడంతో పాటు 11 బాల్స్ లోనే ఫిఫ్టీ చేసిన మేఘాలయ ఆటగాడు చరిత్ర తిరగరాశాడు.

Published on: Nov 09, 2025 7:41 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వరుసగా ఎనిమిది సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా మేఘాలయకు చెందిన ఆకాశ్ కుమార్ చౌదరి రికార్డు సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్ తో రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్ లో కేవలం 11 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

ఆకాశ్ కుమార్ (x/imArshit)
ఆకాశ్ కుమార్ (x/imArshit)

11 బంతుల్లో 50

ఆదివారం (నవంబర్ 9) అరుణాచల్ ప్రదేశ్ తో రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్ లో మేఘాలయ తరపున 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన 25 ఏళ్ల చౌదరి రెండో రోజు సికె పిథావాలా గ్రౌండ్ లో ఈ అద్భుత ఘనత సాధించాడు. అతను 14 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మేఘాలయ 6 వికెట్లకు 628 పరుగులతో తమ మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడానికి సహాయపడ్డాడు.

11 బంతుల్లో అర్ధశతకంతో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు ఆకాశ్ కుమార్. 2012లో ఎసెక్స్ తో జరిగిన మ్యాచ్ లో లీసెస్టర్ షైర్ కు చెందిన వేన్ వైట్ 12 బంతుల్లో నెలకొల్పిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ రికార్డును చౌదరి బద్దలు కొట్టాడు.

8 సిక్సర్లు

మేఘాలయ ఆరు వికెట్లకు 576 పరుగులతో ఉన్నప్పుడు ఆకాశ్ కుమార్ క్రీజులోకి వచ్చాడు. ఓ బంతిని డాట్ ఆడాడు. రెండు సింగిల్స్ తీశాడు. ఆ తర్వాత 126వ ఓవర్ వేసిన లిమర్ దాబి బౌలింగ్ లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి తర్వాత నిలిచాడు.

ఆ తర్వాత కూడా తన విధ్వంసాన్ని ఆకాశ్ కొనసాగించాడు. మోహిత్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. దీంతో అతను వరుసగా ఆడిన 8 బంతుల్లో 8 సిక్సర్లు కొట్టిన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ కు ముందు చౌదరి 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో కేవలం రెండు అర్ధ సెంచరీలతో సగటున 14.37 పరుగులు చేశాడు. 28 లిస్ట్-ఏ మ్యాచ్లు, 20 టీ20 మ్యాచ్లు ఆడాడు.

ఈ రికార్డులు

1968 లో నాటింగ్ హామ్ షైర్, గ్లామోర్గాన్ మధ్య జరిగిన కౌంటీ మ్యాచ్ లో మాల్కం నాష్ బౌలింగ్ లో సోబర్స్ ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు సాధించిన ఘనతను నమోదు చేశాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ 1984-85 మ్యాచ్ లో బరోడాతో బాంబే తరఫున ఆడుతున్నప్పుడు భారత మాజీ ఆల్ రౌండర్, మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తిలక్ రాజ్ బౌలింగ్ లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు.

News/News/6,6,6,6,6,6,6,6,.. వరుసగా 8 సిక్సర్లు.. 11 బాల్స్ లోనే ఫిఫ్టీ.. రంజీ మ్యాచ్ లో వరల్డ్ రికార్డు
News/News/6,6,6,6,6,6,6,6,.. వరుసగా 8 సిక్సర్లు.. 11 బాల్స్ లోనే ఫిఫ్టీ.. రంజీ మ్యాచ్ లో వరల్డ్ రికార్డు