టీమిండియా చెత్త బ్యాటింగ్.. 9 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్..అభిషేక్ ఫైటింగ్.. ఆస్ట్రేలియాతో సెకండ్ టీ20
బ్యాటింగ్ లో టీమిండియా అత్యంత దారుణ ప్రదర్శన చేసింది. 11 మంది బ్యాటింగ్ చేస్తే ఇందులో 9 మంది స్కోరు సింగిల్ డిజిట్ మాత్రమే. ఆస్ట్రేలియాతో రెండో టీ20లో అభిషేక్ పోరాటం పుణ్యమా అని టీమ్ స్కోరు 120 దాటింది.
ఆస్ట్రేలియాలో ఇండియా వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత టీ20 సిరీస్ కిక్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ టీ20 వర్షంతో రద్దయింది. ఇక మెల్ బోర్న్ లో ఇవాళ (అక్టోబర్ 31) జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటింగ్ మెరుపులు చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు తీవ్రమైన నిరాశ తప్పలేదు. సెకండ్ టీ20లో బ్యాటింగ్ లో ఇండియా కుప్పకూలింది. అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది.

పేస్ దెబ్బకు
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆసీస్ పేస్ దెబ్బకు ఇండియా బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. హేజిల్ వుడ్ 3, నేథన్ ఎలిస్ 2, జేవియర్ 2 వికెట్లతో టీమిండియాను దెబ్బ కొట్టారు.
శుభ్ మన్ గిల్ (5), శాంసన్ (2), సూర్యకుమార్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ (7), శివమ్ దూబె (4), కుల్ దీప్ యాదవ్ (0), వరుణ్ చక్రవర్తి (0 నాటౌట్), బుమ్రా (0).. ఇలా వీళ్లందరూ కనీసం 10 పరుగులూ చేయలేకపోయారు.
అభిషేక్ పోరాటం
ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిన మెల్ బోర్న్ లో ఇండియా 120కి పైగా స్కోరు చేసిందంటే అందుకు ప్రధాన కారణం అభిషేక్ శర్మ. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో ఎదురు దాడి కొనసాగించాడు అభిషేక్. అతను 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. టీమ్ మొత్తం కలిపి చేసిన స్కోరులో అభిషేక్ చేసిన రన్స్ 50 శాతం కంటే ఎక్కువ.
హర్షిత్ తో కలిసి
ఓ ఎండ్ లో అభిషేక్ నిలబడ్డా మరో వైపు టపటపా వికెట్లు పడ్డాయి. 49 పరుగులకే భారత్ సగం వికెట్లు కోల్పోయింది. ఇండియా స్కోరు 100 కూడా చేరుతుందా లేదా అనిపించింది. ఆ టైమ్ లో పేస్ బౌలర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్సర్) గొప్పగా పోరాడాడు. హర్షిత్ సపోర్ట్ తో అభిషేక్ తన స్టైల్లో షాట్లు ఆడాడు. టీమ్ స్కోరు 100 దాటిన తర్వాత హర్షిత్ ఔటయ్యాడు.
హర్షిత్ వికెట్ తర్వాత టీమిండియా మరోసారి కుప్పకూలింది. మళ్లీ టపటపా వికెట్లు పడ్డాయి. వరుస బంతుల్లో అభిషేక్, బుమ్రా ఔట్ కావడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


