...
...
Next Story

Rajamouli AOT Review: ఆకాశంలో ఒక తార ఓ అద్భుతమైన విజయం.. ఈ టీమ్‌కు ఆ రెండూ ఉన్నాయి: దుల్కర్ మూవీకి రాజమౌళి రివ్యూ

Rajamouli AOT Review: 'ఆకాశంలో ఒక తార' సినిమాను చూసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియా వేదికగా చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. కలలు కనడం ఒక వరమైతే, వాటిని నిజం చేసుకోవడానికి దృఢ సంకల్పం అవసరమని, ఆకాశంలో ఒక తార బృందం ఆ రెండింటినీ సాధించి గొప్ప విజయాన్ని అందుకుందని రాజమౌళి కొనియాడారు.

Published on: Nov 20, 2026, 11:59:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Rajamouli AOT Review: టాలీవుడ్‌లో 'మహానటి', 'సీతారామం', 'లక్కీ భాస్కర్' చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన తాజా తెలుగు చిత్రం 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara). ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 20) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

Rajamouli AOT Review: ఆకాశంలో ఒక తార ఓ అద్భుతమైన విజయం.. ఈ టీమ్‌కు ఆ రెండూ ఉన్నాయి: దుల్కర్ మూవీకి రాజమౌళి రివ్యూ
Rajamouli AOT Review: ఆకాశంలో ఒక తార ఓ అద్భుతమైన విజయం.. ఈ టీమ్‌కు ఆ రెండూ ఉన్నాయి: దుల్కర్ మూవీకి రాజమౌళి రివ్యూ

ఇప్పటికే ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) రూపంలో అతిపెద్ద బూస్ట్ లభించింది. ఈ చిత్రాన్ని వీక్షించిన జక్కన్న, సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని ఆకాశానికెత్తారు.

"అదొక అద్భుత విజయం": రాజమౌళి పోస్ట్ వైరల్

సాధారణంగా ఒక సినిమా గురించి రాజమౌళి స్పందించారంటే ఆ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తిరుగుండదని సినీ వర్గాల్లో ఒక నమ్మకం ఉంది. 'ఆకాశంలో ఒక తార' చూసిన అనంతరం రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో హృదయాన్ని హత్తుకునే రివ్యూ ఇచ్చారు.

“కలలు కనడం అనేది ఒక గొప్ప వరం. కానీ ఆ కలలను నిజం చేసుకోవడానికి అపారమైన ధైర్యం, దృఢ సంకల్పం కావాలి. 'ఆకాశంలో ఒక తార' చిత్రబృందంలో ఆ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి” అని రాజమౌళి ప్రశంసించారు.

ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన విజయంగా (Triumph) అభివర్ణించిన జక్కన్న, సినిమాలోని నటీనటులందరూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని కొనియాడారు.

దర్శకుడు పవన్ సాధినేనికి జక్కన్న స్పెషల్ బూస్ట్

రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడి నుంచి ప్రశంసలు దక్కడం పవన్ సాధినేని కెరీర్‌కు, చిత్ర నిర్మాణ సంస్థలైన లైట్‌బాక్స్ మీడియా, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్‌కు పెద్ద ప్రోత్సాహంగా నిలిచింది.

ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ సినిమా కథ అద్భుతమని ప్రశంసించగా, ఇప్పుడు రాజమౌళి ట్వీట్ తోడవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. జక్కన్న ప్రశంసల జల్లుతో బాక్సాఫీస్ వద్ద 'ఆకాశంలో ఒక తార' వసూళ్ల వేగం మరింత పుంజుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఆకాశంలో ఒక తార స్టోరీ ఏంటంటే?

ఆకాశంలో ఒక తార మూవీ స్టోరీ విషయానికి వస్తే.. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పాలలంక అనే మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి కల్పన (సాత్విక వీరవల్లి). చిన్నతనం నుంచే ఆస్ట్రోనాట్ కావాలని, అంతరిక్షంలోకి అడుగుపెట్టాలని బలంగా కలలు కంటుంది.

అయితే ఆడపిల్లకు చదువు ఎందుకనే పాతకాలపు ఆలోచనలున్న తండ్రి శివయ్య (కోట జయరాం), పదో తరగతితోనే కల్పన చదువు ఆపేయిస్తాడు. డ్రైవర్ కావాలని కలలు కనే కృష్ణ (దుల్కర్ సల్మాన్) అనే మెకానిక్‌తో కల్పన పెళ్లి జరిపిస్తాడు. పెళ్లయిన తర్వాత భార్య ఆశయం గురించి తెలుసుకున్న కృష్ణ, ఆమె కలను తన జీవిత లక్ష్యంగా మార్చుకుంటాడు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతను ఎదుర్కొని హైదరాబాద్ నగరానికి మకాం మారుస్తాడు.

కల్పనకు ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు వచ్చేలా ప్రోత్సహించడంతో పాటు, ఆమె చదువు ఖర్చుల కోసం తాను గుజరాత్ వెళ్లి రాత్రింబవళ్లు కష్టపడతాడు కృష్ణ. అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో కల్పన చేసిన ఓ రాకెట్ ప్రయోగం విఫలమవుతుంది.

ఆ తర్వాత కల్పన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ప్రైవేట్ స్పేస్ సెంటర్ అధినేత రోహిణి (శ్రుతి హాసన్), గుజరాతీ యువతి బిజిలీ (రుహానీ శర్మ) ఈ ప్రయాణంలోకి ఎలా వచ్చారు? చివరకు కల్పన తన అంతరిక్ష కలను నిజం చేసుకుందా లేదా అన్నదే మిగతా కథ.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks