Rajamouli: రామాయణం, మహాభారతం కథలకు సరైన న్యాయం జరగలేదు, మహేశ్ బాబు 100 శాతం నటిస్తాడనుకున్నా, కానీ: రాజమౌళి కామెంట్స్

Rajamouli On Ramayana Mahabharatham Mahesh Babu: భారతీయ చిత్రసీమ ఇప్పటివరకు రామాయణ, మహాభారత కావ్యాలకు పూర్తి న్యాయం చేయలేదని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అభిప్రాయపడ్డారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో శ్రీరాముడి ఘట్టం ఒక ప్రధాన ఆకర్షణగా ఉండనుందని వెల్లడించారు.

Published on: Nov 9, 2026, 06:09:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

SS Rajamouli On Ramayana Mahabharatham Mahesh Babu Acting: భారతీయ సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో భారీ సాహసానికి శ్రీకారం చుట్టారు. ‘ఆర్‌ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటిన ఆయన, ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

రామాయణం, మహాభారతం కథలకు సరైన న్యాయం జరగలేదు, మహేశ్ బాబు 100 శాతం నటిస్తాడనుకున్నా, కానీ: రాజమౌళి కామెంట్స్
రామాయణం, మహాభారతం కథలకు సరైన న్యాయం జరగలేదు, మహేశ్ బాబు 100 శాతం నటిస్తాడనుకున్నా, కానీ: రాజమౌళి కామెంట్స్

పెన్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులతో

వారణాసి సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇటీవల ఒక అంతర్జాతీయ పాడ్‌కాస్ట్‌తో పాటు అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడేటప్పుడు పంచుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి.

కావ్యాలకు పూర్తి న్యాయం జరగలేదు

భారతీయ చిత్రసీమ దశాబ్దాలుగా రామాయణ, మహాభారత కథల ఆధారంగా ఎన్నో సినిమాలు తీసినప్పటికీ, ఆ కావ్యాల స్థాయికి తగ్గట్టుగా వెండితెరపై ఆవిష్కరించడంలో సంపూర్ణ విజయం సాధించలేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు.

"చిన్నప్పటి నుంచి మన భాషతో పాటు ఇతర భారతీయ భాషల్లో వచ్చిన రామాయణ, మహాభారత చిత్రాలను చూశా. అందులో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. సంపూర్ణ తృప్తిని మాత్రం ఇవ్వలేకపోయాయి. అంతటి మహా కావ్యాల్లోని భవ్యతను, దృశ్య వైభవాన్ని ఇంకా ఎంతో అద్భుతంగా చూపించే అవకాశముంది. తెరపైకి రాని ఎన్నో కోణాలు ఆ కావ్యాల్లో దాగి ఉన్నాయి" అని రాజమౌళి అన్నారు.

సవాలుగా మారిన కలల ప్రాజెక్ట్

ఈ మహా కావ్యాలను వెండితెరపై ఆవిష్కరించడమే తనకు లభించిన అతిపెద్ద అవకాశంగా భావిస్తున్నట్లు రాజమౌళి చెప్పారు. కేవలం గ్రాండియర్, భారీ విజువల్స్ మాత్రమే కాకుండా పాత్రల మానసిక భావోద్వేగాలను లోతుగా చూపించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

గతంలో వచ్చిన సినిమాల్లో తనకు కలగని ఆ తృప్తిని.. ఇప్పుడు తాను తీసే చిత్రంలో ప్రేక్షకులకు అందించడమే అతిపెద్ద సవాలని రాజమౌళి పేర్కొన్నారు. ‘వారణాసి’ చిత్రం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ అని వ్యాఖ్యానించారు.

అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ‘వారణాసి’

‘వారణాసి’ కేవలం రామాయణం లేదా మహాభారతం కథ ఆధారంగా మాత్రమే రూపొందుతున్న చిత్రం కాదని రాజమౌళి వివరణ ఇచ్చారు. ఇదొక విజువల్ వండర్‌గా రాబోతున్న అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్. పౌరాణిక మూలాలను ఆధారం చేసుకుని అల్లిన కల్పిత కథ.

‘ఆర్‌ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి యోధుల జీవితాల ఆధారంగా కల్పిత కథను ఎలా సృష్టించారో, ఈ చిత్రంలోనూ పౌరాణిక అంశాల ప్రేరణతో ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. రామాయణ ఘట్టం ఈ సినిమాలో ఒక భాగం మాత్రమే. భారతీయ సంస్కృతిపై అవగాహన లేని అంతర్జాతీయ ప్రేక్షకులు సైతం కథలోని భావోద్వేగాలను సులభంగా అర్థం చేసుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

శ్రీరాముడిగా మహేశ్ బాబు 200% అద్భుత నటన

వారణాసి చిత్రంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేశ్ బాబు కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది.

వారణాసి సినిమాలోని అత్యంత కీలకమైన రామాయణ ఘట్టంలో మహేశ్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్ర గురించి రాజమౌళి మాట్లాడుతూ.. "మహేశ్ బాబు నుంచి 100 శాతం నటనను ఆశించా. కానీ, షూటింగ్ సమయంలో ఆయన ఏకంగా 200 శాతం అవుట్‌పుట్ ఇచ్చారు. శ్రీరాముడి పాత్రలో మహేశ్ నటన చూసి నేను ఆశ్చర్యపోయా" అని ప్రశంసల వర్షం కురిపించారు జక్కన్న.

60 రోజుల్లో రాముడి సీన్లు

ఈ ప్రత్యేకమైన రాముడి సీన్ల చిత్రీకరణ కోసం సుమారు 60 రోజుల సమయం కేటాయించారు. ఈ ఘట్టం ప్రేక్షకుల హృదయాలను తాకేలా రావాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు కష్టపడ్డామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ థియేటర్లలోకి రానుంది. రాజమౌళి మార్క్ విజన్, మహేశ్ బాబు నటన కలగలిసి రానున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా రూపురేఖలను మరోసారి మార్చనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More