SS Rajamouli: ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'వారణాసి' (Varanasi) సినిమాపై రోజురోజుకూ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

తాజాగా మలయాళ వర్సటైల్ యాక్టర్-డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఆయనకు అదిరిపోయే బర్త్‌డే విషెస్ తెలిపారు.
కుంభ అంటూ బర్త్ డే విషెస్
ఈ సందర్భంగా ఆయనను సినిమాలో నటిస్తున్న విలన్ పాత్ర పేరు 'కుంభ' (Kumbha) అని సంబోధించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. “హ్యాపీ బర్త్‌డే పృథ్వీ. నీలోని కుంభను ఈరోజు నిద్రలేపాలని అనుకోవడం లేదు. ప్రపంచంపై తనదైన ముద్ర వేయడానికి కుంభ సిద్ధంగా ఉన్నాడు” అంటూ రాజమౌళి తనదైన స్టైల్లో విషెస్ చెప్పారు.
రామాయణ, మహాభారత కాలం నాటి పురాతన అవశేషాల కోసం సాగే ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీలో పృథ్వీరాజ్ రోల్ అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది.
కాలాన్ని జయించిన దుష్ట శక్తిగా 'కుంభ' పాత్ర
'వారణాసి' చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కాలాలను దాటుకుని బతికి ఉన్న ఒక భయంకరమైన దుష్ట శక్తిగా కనిపించనున్నారు. ప్రపంచం ఒక భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ విలన్ పాత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు పోషిస్తున్న 'రుద్ర' (Rudra) పాత్రను తన స్వార్థం కోసం ఎలా మోసం చేస్తుంది? రామాయణ, మహాభారత కాలం నాటి రహస్యాలను ఎలా బయటికి లాగుతుంది? అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో వీల్‌చైర్‌లో కూర్చున్న మ్యాడ్ సైంటిస్ట్ లుక్‌లో పృథ్వీరాజ్ కనిపించి అంచనాలను పెంచేశారు. గ్లోబల్ డామినేషనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సైకో విలన్ ప్లాన్లను హీరో రుద్ర ఎలా తిప్పికొడతాడనేది హై-వోల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంకా చోప్రా గ్రే షేడ్స్ ఉన్న 'మందాకిని' (Mandakini) పాత్రలో నటిస్తూ హీరోకు సాయం చేయనుంది.
అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి మేకింగ్
{{/usCountry}}ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో వీల్‌చైర్‌లో కూర్చున్న మ్యాడ్ సైంటిస్ట్ లుక్‌లో పృథ్వీరాజ్ కనిపించి అంచనాలను పెంచేశారు. గ్లోబల్ డామినేషనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సైకో విలన్ ప్లాన్లను హీరో రుద్ర ఎలా తిప్పికొడతాడనేది హై-వోల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంకా చోప్రా గ్రే షేడ్స్ ఉన్న 'మందాకిని' (Mandakini) పాత్రలో నటిస్తూ హీరోకు సాయం చేయనుంది.
అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి మేకింగ్
{{/usCountry}}'బాహుబలి', ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మరింత పెద్ద ప్లానింగ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమా కోసం ఒక సరికొత్త కల్పిత భాషను కూడా క్రియేట్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. జార్జియా అడవులు, కెన్యా వైల్డ్ లైన్స్ వంటి విభిన్న దేశాల్లో భారీ షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఆర్కిటిక్ ప్రాంతం వాతావరణాన్ని తలపించే విజువల్స్‌ను వేరే ప్రాంతంలో ఎంతో ప్రాక్టికల్‌గా రీక్రియేట్ చేసి ప్రశంసలు అందుకున్నారు.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్, వరల్డ్ క్లాస్ టెక్నికల్ వాల్యూస్‌తో రాబోతున్న ఈ సినిమా 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రామాయణంలోని 'కుంభకర్ణుడు' పాత్రకు ఈ 'కుంభ' పాత్రకు ఏదైనా లింక్ ఉందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రకరకాల థియరీలను డిస్కస్ చేస్తున్నారు. అవన్నీ వచ్చే ఏడాది తేలనున్నాయి. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా మూవీ రిలీజ్ కానుంది.