బిగ్ బాస్ స్థానంలో స్టార్ మాలోకి కొత్తగా వస్తున్న సీరియల్ ఇదే.. గ్రాండ్ ఫినాలే మరుసటి రోజే ప్రారంభం
స్టార్ మా ఛానెల్లోకి బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ముగిసిన మరుసటి రోజు నుంచే అదే సమయానికి సరికొత్త సీరియల్ రానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ బుధవారం (డిసెంబర్ 17) వెల్లడించింది. ఆ సీరియల్ గురించి తెలుసుకుందాం.
స్టార్ మాలో 100 రోజులకుపైగా అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ముగింపుకు వచ్చేసింది. ఈ ఆదివారం (డిసెంబర్ 21) గ్రాండ్ ఫినాలేతో 107 రోజుల ఈ రియాల్టీ షో ముగియనుంది. దీంతో మరుసటి రోజు నుంచే అంటే డిసెంబర్ 22 నుంచి ఆ షో వచ్చే సమయానికే స్టార్ మా నువ్వు లేక నేను లేను అనే కొత్త సీరియల్ నుంచి టెలికాస్ట్ చేయనుంది.

నువ్వు లేక నేను లేను టెలికాస్ట్ టైమ్ ఇదే
బిగ్ బాస్ 9వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచీ వీక్ డేస్ లో రాత్రి 9.30 గంటలకు, వీకెండ్స్ లో 9 గంటలకు టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సమయాన్ని రాత్రి 10 గంటలకు మార్చారు. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేతో ఈ షో ముగిసిన తర్వాత సోమవారం (డిసెంబర్ 22) నుంచి ఈ సమయానికి నువ్వు లేక నేను లేను అనే సీరియల్ రానుంది.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 10 గంటలకు ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ విషయాన్ని స్టార్ మా బుధవారం (డిసెంబర్ 17) ఎక్స్ ద్వారా వెల్లడించింది. “రాధాకృష్ణుల ప్రయాణం మీ ముందుకు త్వరలో.. నువ్వు లేక నేను లేను డిసెంబర్ 22 నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు స్టార్ మాలో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
నువ్వు లేక నేను లేను సీరియల్ గురించి..
తెలుగులో సుమారు 23 ఏళ్ల కిందట వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమా టైటిల్ తో కొత్త సీరియల్ రానుంది. కొన్ని రోజుల కిందటే ఈ సీరియల్ గురించి ఆ ఛానెల్ అనౌన్స్ చేసింది.
స్టార్ మాలోకి రాబోతున్న ఈ కొత్త సీరియల్ కన్నడలో వచ్చిన నిన్నా జోతే నన్న కథే అనే సీరియల్ కు రీమేక్ కావడం విశేషం. ఇది ఓ యువ జంట చుట్టూ తిరిగే స్టోరీ. తనకు కాబోయే భార్యను కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇచ్చే అబ్బాయి.. ఆమెకు పెళ్లి పీటలపై షాకిస్తాడు. ఈ పెళ్లి కేవలం ఏడాది వరకే అని, అలా అని కాంట్రాక్టుపై సంతకం చేయాలని అంటాడు. ఆ మాట విని షాక్ తనే అమ్మాయి.. కష్టాల్లో ఉన్న తన తండ్రిని గుర్తు చేసుకుంటూ అతని కోసం ఏదైనా చేస్తాననుకొని సంతకం పెడుతుంది.
ఆ తర్వాత ఇద్దరి పెళ్లి జరుగుతుంది. వీళ్ల బంధం ఏడాదికే పరిమితమవుతుందా లేక జీవితాంతం కొనసాగుతుందా అనే ప్రశ్నతో సీరియల్ ప్రోమోను ముగించారు. ఈ సీరియల్లో నిషా పొద్దార్, నవీన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తమిళ నటుడు నవీన్ కు ఇదే తొలి తెలుగు సీరియల్. ఈ నువ్వు లేక నేను లేను సీరియల్ డిసెంబర్ 22 నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


