స్టార్ మాలోకి మరో కొత్త సీరియల్.. ఆ హిట్ మూవీ టైటిల్‌తోనే.. ఏడాది పెళ్లి కాంట్రాక్టు అంటూ.. టెలికాస్ట్ డేట్ ఇదే

స్టార్ మా మరో కొత్త సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ మధ్యే పొదరిల్లు అనే సీరియల్ రాగా.. ఇప్పుడు మరొకటి కూడా సిద్ధంగా ఉంది. వచ్చే వారం నుంచి ఈ సీరియల్ ప్రసారం కాబోతోంది. మరి దాని విశేషాలేంటో తెలుసుకోండి.

Published on: Dec 15, 2025, 21:29:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు సీరియల్స్ విషయంలో స్టార్ మా దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో కొన్నేళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఆ ఛానెల్.. తాజాగా సరికొత్త సీరియల్స్ ను తీసుకురావడంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఈ నెల మొదట్లో ఓ సీరియల్ కొత్తగా ప్రారంభం కాగా.. ఇప్పుడు మరొకటి వస్తోంది.

స్టార్ మాలోకి మరో కొత్త సీరియల్.. ఆ హిట్ మూవీ టైటిల్‌తోనే.. ఏడాది పెళ్లి కాంట్రాక్టు అంటూ.. టెలికాస్ట్ డేట్ ఇదే
స్టార్ మాలోకి మరో కొత్త సీరియల్.. ఆ హిట్ మూవీ టైటిల్‌తోనే.. ఏడాది పెళ్లి కాంట్రాక్టు అంటూ.. టెలికాస్ట్ డేట్ ఇదే

నువ్వు లేక నేను లేను సీరియల్

తెలుగులో సుమారు 23 ఏళ్ల కిందట వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమా గుర్తుందా? ఇప్పుడదే టైటిల్ తో ఈ కొత్త సీరియల్ రానుంది. దీనిని వచ్చే సోమవారం అంటే డిసెంబర్ 22 నుంచి టెలికాస్ట్ చేయనున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. “శుభారంభం.. రాధాకృష్ణుల ప్రేమ ప్రయాణం త్వరలోనే” అనే క్యాప్షన్ తో స్టార్ మా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. నిజానికి ఇంతకు ముందే వచ్చిన ప్రోమో కూడా సీరియల్ పై ఆసక్తి రేపుతోంది.

నువ్వు లేక నేను లేను సీరియల్ గురించి..

స్టార్ మాలోకి రాబోతున్న ఈ కొత్త సీరియల్ కన్నడలో వచ్చిన నిన్నా జోతే నన్న కథే అనే సీరియల్ కు రీమేక్ కావడం విశేషం. ఇది ఓ యువ జంట చుట్టూ తిరిగే స్టోరీ. తనకు కాబోయే భార్యను కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇచ్చే అబ్బాయి.. ఆమెకు పెళ్లి పీటలపై షాకిస్తాడు. ఈ పెళ్లి కేవలం ఏడాది వరకే అని, అలా అని కాంట్రాక్టుపై సంతకం చేయాలని అంటాడు. ఆ మాట విని షాక్ తనే అమ్మాయి.. కష్టాల్లో ఉన్న తన తండ్రిని గుర్తు చేసుకుంటూ అతని కోసం ఏదైనా చేస్తాననుకొని సంతకం పెడుతుంది.

ఆ తర్వాత ఇద్దరి పెళ్లి జరుగుతుంది. వీళ్ల బంధం ఏడాదికే పరిమితమవుతుందా లేక జీవితాంతం కొనసాగుతుందా అనే ప్రశ్నతో సీరియల్ ప్రోమోను ముగించారు. ఈ సీరియల్లో నిషా పొద్దార్, నవీన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తమిళ నటుడు నవీన్ కు ఇదే తొలి తెలుగు సీరియల్. ఈ నువ్వు లేక నేను లేను సీరియల్ డిసెంబర్ 22 నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది. సీరియల్ టెలికాస్ట్ టైమ్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More