తెలుగు టీవీ సీరియల్స్ 48వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. మళ్లీ టాప్ 3లోకి గుండె నిండా గుడి గంటలు.. అర్బన్‌లో నంబర్ 1
తెలుగు టీవీ సీరియల్స్ 48వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈవారం మరోసారి గుండె నిండా గుడి గంటలు సీరియల్ టాప్ 3లోకి తిరిగి రావడం విశేషం. మరి మొత్తంగా టాప్ 10లో ఉన్న సీరియల్స్ ఏవో చూడండి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గత కొన్ని రోజులుగా ఆసక్తికర మలుపులతో సాగుతూ ప్రేక్షకులకు అలరిస్తోంది. దీంతో ఈ సీరియల్ 48వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో మరోసారి టాప్ 3లోకి దూసుకొచ్చింది. ఇక టాప్ 10లో ఆరు స్టార్ మా సీరియల్స్ ఉండగా.. చివరి నాలుగు స్థానాల్లో జీ తెలుగు సీరియల్స్ కొనసాగుతున్నాయి.

టాప్ 2లో ఆ రెండు సీరియల్సే
తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి గురువారం (డిసెంబర్ 11) 48వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. వీటిలో మరోసారి కార్తీక దీపం 2 సీరియల్ ఎవరికీ అందనంత ఎత్తులో నంబర్ 1గా నిలిచింది. ఈవారం ఈ సీరియల్ కు 15.72 రేటింగ్ నమోదు కావడం విశేషం. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది. ఈవారం ఈ సీరియల్ కు 14.95 రేటింగ్ వచ్చింది.
అర్బన్‌లో నంబర్ 1 గుండె నిండా గుడి గంటలు
కొన్నాళ్లుగా ఆసక్తికర మలుపులతో అలరిస్తున్న గుండె నిండా గుడి గంటలు అర్బన్ మార్కెట్ లో నంబర్ 1గా నిలవడం విశేషం. అర్బన్ లో ఈ సీరియల్ కు 12.19 రేటింగ్ వచ్చింది. ఓవరాల్ గా అర్బన్, రూరల్ కలిపి 13.58 రేటింగ్ తో మూడో స్థానంలో నిలిచింది. ఇంటింటి రామాయణం నాలుగో స్థానానికి పడిపోయింది.
దీనికి ఈవారం 12.94 రేటింగ్ నమోదైంది. ఇక ఐదో స్థానంలో ఉన్న చిన్ని సీరియల్ కు 11.09 రేటింగ్ రాగా.. ఆరో స్థానంలో నిండు మనసులుకు 9.21 రేటింగ్ నమోదు కావడం విశేషం. మొత్తంగా టాప్ 6లో స్టార్ మా సీరియల్సే కొనసాగుతుండగా.. వాటి స్థానాలే కాస్త అటూఇటూగా మారుతున్నాయి.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. ఇవి టాప్ 10లో చివరి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ ఛానెల్లోని సీరియల్స్ మధ్య కూడా పోటీ తీవ్రంగా ఉంది. టాప్ 10లో చోటు కోసం రెండు, మూడు సీరియల్స్ పోటీ పడుతున్నాయి. తాజాగా 48వ వారం విషయానికి వస్తే.. మేఘసందేశం 8.47 రేటింగ్ తో ఏడో స్థానంలో ఉంది.
ఇక చామంతికి 8.44 రేటింగ్ రాగా.. అది 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈవారం జయం, లక్ష్మీనివాసం రెండూ టాప్ 10లోకి రాగా.. జగద్ధాత్రి వెళ్లిపోయింది. జయం సీరియల్ కు 7.98, లక్ష్మీనివాసానికి 7.91 రేటింగ్స్ వచ్చాయి. ఇవి వరుసగా 9, 10 స్థానాల్లో నిలిచాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


