స్టార్ మా మరో కొత్త సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈరోజు అంటే డిసెంబర్ 8 నుంచే ఈ సీరియల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలుగు టీవీ సీరియల్స్ లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న స్టార్ మా.. ఈ తాజా సీరియల్ తో మరింత దూకుడు పెంచనుంది. మరి ఆ సీరియల్, టెలికాస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
పొదరిల్లు సీరియల్ టెలికాస్ట్ టైమ్

స్టార్ మాలోకి సోమవారం (డిసెంబర్ 8) అడుగుపెట్టనున్న సీరియల్ పేరు పొదరిల్లు. ఈ కొత్త సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరడంతో దాని స్థానంలో స్టార్ మా ఈ కొత్త సీరియల్ ను టెలికాస్ట్ చేస్తోంది. కొన్నాళ్లుగా ఈ పొదరిల్లు సీరియల్ ప్రోమోలను రిలీజ్ చేస్తూ ప్రమోట్ చేస్తోంది.
గత వారం కూడా ఓ ప్రోమోను తీసుకొచ్చింది. ఎలాగైనా తనతోపాటు తన అన్న, తమ్ముళ్లకు పెళ్లిళ్లు చేయాలని కలలు కనే ఓ యువకుడు.. పెళ్లిపై ఎన్నో ఆశలతో ఉన్న ఓ అమ్మాయి అసలు ఆడదిక్కే లేని ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుందన్నదే ఈ సీరియల్ కథగా కనిపిస్తోంది.
“తను ఊహించుకున్న జీవితం ఒకటి.. కానీ పరిస్థితులు ఆమెను తీసుకెళ్లిన దారి మరోటి. ఇలాంటి పరిస్థితుల్లో మహాలక్ష్మి ఎలా ముందుకు వెళ్తుంది? తెలుసుకోవాలంటే తప్పక చూడండి” అనే క్యాప్షన్ తో స్టార్ మా ఈ సీరియల్ టెలికాస్ట్ తేదీని అనౌన్స్ చేసింది.
పొదరిల్లు.. వెరైటీగా ప్రమోషన్లు
స్టార్ మా ఈ కొత్త సీరియల్ పొదరిల్లు ప్రమోషన్లను వెరైటీగా చేసింది. ఇప్పటికే ఆ ఛానెల్లో వస్తున్న గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, నువ్వుంటే నా జతగా లాంటి సీరియల్స్ నటుల ద్వారా కూడా ఈ సీరియల్ ను ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది. “తను సవాలు చేసినట్టే, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటిని బృందావనంలా చక్రి మారుస్తాడా? తెలుసుకోవాలంటే వేచి ఉండండి” అనే క్యాప్షన్ తో ఆ ఛానెల్ మరో ట్వీట్ చేసింది.
{{/usCountry}}స్టార్ మా ఈ కొత్త సీరియల్ పొదరిల్లు ప్రమోషన్లను వెరైటీగా చేసింది. ఇప్పటికే ఆ ఛానెల్లో వస్తున్న గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, నువ్వుంటే నా జతగా లాంటి సీరియల్స్ నటుల ద్వారా కూడా ఈ సీరియల్ ను ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది. “తను సవాలు చేసినట్టే, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటిని బృందావనంలా చక్రి మారుస్తాడా? తెలుసుకోవాలంటే వేచి ఉండండి” అనే క్యాప్షన్ తో ఆ ఛానెల్ మరో ట్వీట్ చేసింది.
{{/usCountry}}జీవితంపై ఎంతో స్పష్టత ఉన్న మహాలక్ష్మి అనే అమ్మాయి.. దానికోసం తన ఇంటి నుంచి బయటకు వస్తుంది. అయితే అనుకోకుండా ఆమె చక్రి అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. బృందావనంలాంటి ఇంట్లోకి వెళ్తున్నానన్న ఆమె సంతోషం వెంటనే ఆవిరి అవుతుంది. ఆడదిక్కు లేక ఐదుగురు మగాళ్లు ఉన్న ఇంట్లోకి అడుగుపెట్టే ఆమె జీవితం ఏం కాబోతుందన్నది ఈ పొదరిల్లు సీరియల్లో చూడొచ్చు.