స్టార్ మా సీరియల్స్ ను అభిమానించే ప్రేక్షకులకు ఆ ఛానెల్ ఓ పండగలాంటి న్యూస్ చెప్పింది. ఈ ఛానెల్లో మంచి ఆదరణ సంపాదిస్తున్న రెండు సీరియల్స్ గుండె నిండా గుడి గంటలు, పొదరిల్లు 30 నిమిషాలు కాకుండా 45 నిమిషాల పాటు టెలికాస్ట్ అవుతాయని చెప్పడం విశేషం. మరి ఆ మారిన టైమింగ్స్ ఏంటో చూడండి.
గుండె నిండా గుడి గంటలు ఇక 45 నిమిషాలు..

స్టార్ మా ఛానెల్ టాప్ 5 సీరియల్స్ లో ఒకటైన గుండె నిండా గుడి గంటలు ఇక నుంచి రోజూ 45 నిమిషాల పాటు రానుంది. సోమవారం అంటే ఫిబ్రవరి 16 నుంచి రోజుకు 30 నిమిషాలు కాకుండా 45 నిమిషాలు వస్తుందని ఆ సీరియల్ టీమ్ ద్వారానే స్టార్ మా వెల్లడించింది.
ఇందులో ప్రధాన పాత్రలైన మీనా, బాలుతోపాటు మనోజ్, రోహిణి, రవి, శృతి, సత్యం, ప్రభావతి ఈ విషయం చెప్పి డ్యాన్సులు వేయడం ఈ వీడియోలో చూడొచ్చు. “మన ఈవెనింగ్స్ ఇప్పుడు మరింత స్పెషల్.. ఈ సోమవారం నుంచి గుండె నిండా గుడి గంటలు 45 నిమిషాల మెగా ఎంటర్టైన్మెంట్ రైడ్” అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది. అంటే సోమవారం నుంచి రాత్రి 9 గంటల నుంచి 9.45 గంటల వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది.
గుండె నిండా గుడి గంటలు విశేషాలు
సత్యం, ప్రభావతి.. వాళ్లు ముగ్గురు కొడుకులు, కోడళ్లు, కూతురి చుట్టూ తిరిగే కథ ఇది. ఈ ఛానెల్లో దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 600కుపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇందులో బాలు పాత్రలో విష్ణుకాంత్, మీనా పాత్రలో అమూల్య గౌడ నటించారు. ఈ జంట నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఓ కుటుంబం కలిసే ఉండాలన్న సందేశంతో సాగిపోతున్న సీరియల్ ఇది.
పొదరిల్లు సీరియల్ కూడా..
ఇక స్టార్ మాలో ఈ మధ్యే అడుగుపెట్టిన మరో సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ కూడా సోమవారం నుంచే రోజుకు 45 నిమిషాల పాటు టెలికాస్ట్ అవుతుంది. అంటే రాత్రి 9.45 గంటల నుంచి 10.30 గంటలకు వరకు ఈ సీరియల్ వస్తుందని స్టార్ మా తెలిపింది.
{{/usCountry}}ఇక స్టార్ మాలో ఈ మధ్యే అడుగుపెట్టిన మరో సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ కూడా సోమవారం నుంచే రోజుకు 45 నిమిషాల పాటు టెలికాస్ట్ అవుతుంది. అంటే రాత్రి 9.45 గంటల నుంచి 10.30 గంటలకు వరకు ఈ సీరియల్ వస్తుందని స్టార్ మా తెలిపింది.
{{/usCountry}}“మనందరికీ సూపర్ ఎక్సైటింగ్ న్యూస్. పొదరిల్లును ఇప్పుడు 45 నిమిషాల ప్యూర్ ఎంటర్టైన్మెంట్ గా మార్చబోతున్నాం” అనే క్యాప్షన్ తో వీడియోను ట్వీట్ చేసింది. అసలు ఆడదిక్కు లేని ఓ కుటుంబంలోకి ఓ అమ్మాయి కోడలిగా అడుగుపెట్టి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నది అన్నదే ఈ పొదరిల్లు సీరియల్ కథ.
“ఎక్స్‌ట్రా టైమ్, ఎక్స్‌ట్రా సందడి, ఎక్స్‌ట్రా మజా.. 45 నిమిషాల ఎపిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో గుండె నిండా గుడి గంటలు, పొదరిల్లు.. మీ ముందుకు” అనే క్యాప్షన్ తో మరో ట్వీట్ కూడా చేసింది.