...
...
Next Story

Singer Shaan: చేతికి రూపాయి వస్తుందంటే చాలు ఎలాంటి పనైనా చేయడానికి వెనకాడలేదు- స్టార్ సింగర్ షాన్ కన్నీటి గాథ- ఏమైందంటే?

Singer Shaan About Childhood Struggle Story: భారతీయ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్ షాన్ తన జీవితంలోని అత్యంత చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు. చేతికి రూపాయి వస్తుందంటే చాలు ఎలాంటి పనైనా చేయడానికి వెనుకాడని రోజులను గుర్తు చేసుకున్నారు షాన్.

Published on: Jun 14, 2026, 10:17:56 IST
Advertisement

Singer Shaan About Childhood Struggle Story: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి, తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంతగానో దగ్గరయ్యారు గాయకుడు షాన్. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వుతో కనిపించే ఈ స్టార్ సింగర్ వెనుక ఒక గుండెను పిండేసే పోరాటం ఉంది.

సింగర్ షాన్ కన్నీటి గాథ

చేతికి రూపాయి వస్తుందంటే చాలు ఎలాంటి పనైనా చేయడానికి వెనకాడలేదు- స్టార్ సింగర్ షాన్ కన్నీటి గాథ- ఏమైందంటే?
చేతికి రూపాయి వస్తుందంటే చాలు ఎలాంటి పనైనా చేయడానికి వెనకాడలేదు- స్టార్ సింగర్ షాన్ కన్నీటి గాథ- ఏమైందంటే?

'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' టాక్ షోలో తాజాగా పాల్గొన్న సింగర్ షాన్ చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం, పితృ వియోగం, ఆ తర్వాత సాగించిన సర్వైవల్ జర్నీ గురించి సంచలన విషయాలను పంచుకున్నారు.

చాలా మంది సెలబ్రిటీలు తాము పడిన కష్టాలను చెప్తూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. కానీ, షాన్ మాత్రం జీవితాన్ని ఒక సవాల్‌గా తీసుకుని ఎదిగారు. ఆనాటి జ్ఞాపకాలను ఆయన ఎంతో ధైర్యంగా పంచుకున్నారు.

నాన్న చనిపోయారు.. నేను కోలుకున్నాను

"నాకు 13 ఏళ్ల వయసున్నప్పుడు మా నాన్న కన్నుమూశారు. ఆ ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేను చాలా ఏడ్చాను. కానీ, నేను ఎప్పుడూ బాధలోనే మునిగిపోయే రకం కాదు. నిజం చెప్పాలంటే.. నాన్న గురువారం చనిపోతే, నేను శనివారం నాటికి గ్రౌండ్‌లోకి వెళ్లి బాస్కెట్‌బాల్ ఆడాను. శుక్రవారం రోజంతా నరకం చూశాను, విపరీతంగా ఏడ్చాను. కానీ, ఆ బాధ నుంచి నేను చాలా త్వరగానే కోలుకుని సాధారణ స్థితికి వచ్చాను" అని షాన్ వివరించారు.

తండ్రి చనిపోయి నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆయన గుర్తొస్తూనే ఉంటారని షాన్ ఎమోషనల్ అయ్యారు. "మా నాన్న చనిపోయి 40 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు నా వయసు, మా నాన్న చనిపోయే నాటి వయసు కంటే పదేళ్లు ఎక్కువ. నా వయసు పెరుగుతున్న కొద్దీ, నా జ్ఞాపకాలలో మా నాన్న వయసు మాత్రం అలాగే ఉండిపోతుంది. ఆయన నా మదిలో ఎప్పటికీ యువకుడే" అని సింగర్ షాన్ చెప్పుకొచ్చారు.

ఒంటరిగా పోరాడిన అమ్మ

2022లో కన్నుమూసిన తన తల్లి గురించి షాన్ చెప్తూ.. "నాన్న బతికున్నప్పుడు, ఆ తర్వాత కూడా మా అమ్మే ఇంటిని నడిపించింది. నా చెల్లెలు కూడా చాలా చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరింది. అమ్మ ఒక్కతే సంపాదించడం కరెక్ట్ కాదని మేమంతా కష్టపడ్డాం. మా అమ్మ ఎంతో ఆత్మగౌరవం, ధైర్యం ఉన్న మహిళ. మమ్మల్ని ఒంటరి చేతులతో పెంచి పెద్ద చేసింది" అని కొనియాడారు.

ట్యూషన్లు చెప్పాను.. కేబుల్ కనెక్షన్లు అమ్మాను!

కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడటం కోసం షాన్ చిన్న వయసులోనే చదువుకుంటూనే రకరకాల పనులు చేశారు. "నేను డబ్బుల కోసం రకరకాల చిన్న పనులు చేశాను. చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడిని. 1988-89 ఆ ప్రాంతంలో మన దేశంలో కేబుల్ టీవీ అప్పుడప్పుడే విస్తరిస్తోంది. ఆ సమయంలో నేను ఇంటింటికీ తిరిగి కేబుల్ టీవీ కనెక్షన్లు అమ్మి కమీషన్లు తీసుకునేవాడిని. దాంతో పాటు 'లుక్స్' అనే ఒక క్లోతింగ్ బొటిక్‌లో కూడా పనిచేశాను. చేతికి రూపాయి వస్తుందంటే చాలు ఎలాంటి పనైనా చేయడానికి వెనకాడలేదు" అని ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు.

సింగర్ అవుతానని అనుకోలేదు

చిన్నప్పుడు జింగిల్స్ (యాడ్స్) కోసం పాటలు పాడినప్పటికీ, సంగీతమే తన భవిష్యత్తు అవుతుందని షాన్ ఎప్పుడూ ఊహించలేదు. టీనేజ్‌లోకి వచ్చాక గొంతు మారడంతో (Voice Change) కొన్నాళ్లపాటు పాటలు పాడే అవకాశాలు తగ్గాయి.

ఆ తర్వాత మళ్లీ అవకాశాలు వచ్చినా.. దాన్ని ఒక పార్ట్-టైమ్ ఆదాయంలానే చూశారు తప్ప కెరీర్‌గా మలుచుకోవాలని అనుకోలేదు. బొటిక్‌లో పనిచేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ, కాలేజీకి వెళ్తూ వీలు చిక్కినప్పుడు మాత్రమే రికార్డింగ్‌లకు వెళ్లేవారు.

గొప్ప స్ఫూర్తి

కానీ, కాలక్రమేణా సింగర్ షాన్ ప్రతిభను ప్రపంచం గుర్తించింది. ఈరోజు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ అండ్ లవ్డ్ ప్లేబ్యాక్ సింగర్స్‌లో ఒకరిగా ఎదిగిన షాన్ ప్రయాణం.. నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe