Singer Shaan: పెట్రోల్ బంక్ దగ్గర సింగర్ షాన్- ఒక్కసారిగా చుట్టుముట్టిన స్కూల్ విద్యార్థినులు-అసలు కారణం తెలిసి నవ్వులు!
Singer Shaan Recalls School Girls Incident: ప్రముఖ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ షాన్ తన కెరీర్‌లో ఎదురైన ఒక ఫన్నీ సంఘటనను పంచుకున్నారు. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న అతన్ని పాఠశాల విద్యార్థినులు ఒక్కసారిగా చుట్టుముట్టి వెళ్లిపోయారట. అందుకు గల అసలు కారణం తెలిసి నవ్వుకున్నానని సింగర్ షాన్ చెప్పుకొచ్చారు.
Singer Shaan Recalls School Girls Incident: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్లేబ్యాక్ సింగర్ షాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తన అద్భుతమైన గాత్రంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారాయన.

హీరోలకు ఉన్నంత క్రేజ్ సింగర్స్‌కు ఉండదు
హిందీతో పాటు తెలుగు, బెంగాలీ వంటి పలు ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి సంగీత ప్రియులను అలరించారు సింగర్ షాన్. సాధారణంగా వెండితెరపై కనిపించే హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సింగర్లకు కాస్త అరుదుగానే కనిపిస్తుంది.
ముంబై లాంటి నగరాల్లో సింగర్ సెలబ్రిటీలు తిరుగుతున్నా జనం పెద్దగా పట్టించుకోరు. అయితే తన జీవితంలో ఎదురైన ఒక విచిత్రమైన, సరదా సంఘటనను షాన్ ఇటీవల గుర్తుచేసుకున్నారు. ఒకసారి అభిమానులు తనను చుట్టుముట్టారని, కానీ వారు తన కోసం కాకుండా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అనుకుని వచ్చారని తెలిసి షాక్ అయ్యానని చెప్పారు.
హ్యూమన్స్ ఆఫ్ బాంబే టాక్ షోలో
'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' టాక్ షోలో పాల్గొన్న సింగర్ షాన్ తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. "నేను అప్పుడప్పుడే కొత్తగా మారుతి 800 కారు కొన్నాను. ఒకరోజు పెట్రోల్ పోయించడానికి బంక్ దగ్గర ఆగాను" అని సింగర్ షాన్ తెలిపారు.
"సాధారణంగా పెట్రోల్ పోసేటప్పుడు కారు దిగమంటారు కాబట్టి నేను బయట నిలబడ్డాను. సరిగ్గా అదే సమయానికి స్కూల్ పిల్లలతో ఉన్న ఒక బస్సు అక్కడికి వచ్చింది. అందులోని విద్యార్థినులంతా నన్ను చూడగానే బస్సు దిగి ఒక్కసారిగా నా చుట్టూ చేరి పెద్ద హడావుడి చేశారు. నాకేమీ అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికే వారంతా మళ్లీ బస్సు ఎక్కేసి వెళ్లిపోయారు" అని షాన్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
అసలు విషయం తెలిసి నవ్వులు
ఆ విద్యార్థినులు అంత వేగంగా చుట్టుముట్టి, అంత వేగంగా వెళ్లిపోడానికి గల కారణాన్ని వివరిస్తూ షాన్ నవ్వుకున్నారు. "వారంతా బస్సు ఎక్కి వెళ్తుండగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం విన్నాను. వాళ్లు నన్ను షారుఖ్ ఖాన్ అనుకుని పొరబడ్డారు. ఆ పిల్లలంతా ముంబై వెలుపల నుంచి రావడంతో షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ మారుతి 800 కారులో వచ్చి పెట్రోల్ బంకులో స్వయంగా నిలబడడనే కనీస విషయం వాళ్లకు తెలీదు" అని షాన్ చెప్పుకొచ్చారు.
"బస్సులో ఎవరో ఒకరు నన్ను చూసి తప్పుగా గుర్తుపట్టారు. దాంతో మిగిలిన వాళ్లంతా నిజమే అనుకుని వెనుక పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పొరపాటు గ్రహించి సైలెంట్‌గా వెళ్లిపోయారు. అంతవరకు నా క్రేజ్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆ ఆనందం కొద్దిసేపే ఉన్నా చాలా బాగా అనిపించింది" అని షాన్ వివరించారు.
షారుఖ్ ఖాన్ సినిమాలో షాన్ పాడిన సాంగ్స్
యాదృచ్ఛికంగా షాన్ తన కెరీర్‌లో షారుఖ్ ఖాన్ నటించిన ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు అద్భుతమైన పాటలు పాడారు. 'డాన్' సినిమాలోని టైటిల్ ట్రాక్ 'మై హూన్ డాన్', 'ఓం శాంతి ఓం' చిత్రంలోని 'దీవాంగి దీవాంగి', 'దాస్తాన్-ఎ-ఓం శాంతి ఓం', 'మొహబ్బతీన్' లోని 'ఆంఖేన్ ఖులీ', 'కల్ హో నా హో' లోని 'కుచ్ తో హువా... హై' వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్ షారుఖ్ కోసం షాన్ పాడినవే కావడం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


