ఆమె ఓ మాటల ప్రవాహం. మైక్ అందుకుందంటే ఇక నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్లాల్సిందే. టీవీ షోలు అయినా, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయినా ఆమె ఉంటే సక్సెస్ కావాల్సిందే. ఆమెనే.. బుల్లితెర మహారాణిగా పేరు తెచ్చుకున్న సుమ కనకాల. ఈ టాప్ యాంకర్ బర్త్ డే ఈ రోజు. తన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాజీవ్ కనకాల పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.
రాజీవ్ పోస్టు

తెలుగులో టాప్ యాంకర్ ఎవరు? అంటే ఠక్కున వినిపించే సమాధానం సుమ కనకాల. అసలు ఆమెకే పోటీనే లేదని చెప్పొచ్చు. ఈ రోజు (మార్చి 22) సుమ బర్త్ డే. ఈ సందర్భంగా తన భార్యకు బర్త్ డే విషెస్ చెప్తూ రాజీవ్ కనకాల ఎక్స్ లో కొన్ని ఫొటోలు పంచుకున్నాడు.
130 ఏళ్లు
‘‘శుభజన్మదినం తుభ్యం
శుభజన్మదినం తుభ్యం
శుభజన్మదినే తవ హే
సకలం సఫలం భూయాత్
సకలం చ శుభం భూయాత్
నిండూ నూరేళ్లు… కాదు కాదు, ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నా. హ్యపీ బర్త్ డే సుమ కనకాల’’ అని రాజీవ్ తన భార్యకు శుభాకాంక్షలు తెలిపాడు.
సుమ ఏజ్
కొన్ని దశాబ్దాలుగా తన యాంకరింగ్ తో ఆడియన్స్ ను సుమ కనకాల ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఆమె ఏజ్ ఎంత అనేది ఎప్పుడూ ఓ డిస్కషన్ పాయింటే. ఇవాళ బర్త్ డే జరుపుకొంటున్న సుమ ఏజ్ 51. ఇది ఆమెకు 51వ పుట్టిన రోజు. కానీ సుమకు అంత ఏజ్ ఉందంటే ఎవరూ నమ్మరు. ఇప్పటికీ ఆమె సూపర్ యాక్టివ్ గా ఉంది.
సుమ నెట్ వర్త్
ఇక టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సుమ బాగానే సంపాదిస్తోంది. ఆమె నెట్ వర్త్ సుమారు రూ.100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. టీవీ షోల కోసం ఒక్కో ఎపిసోడ్ కు సుమ రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం.
{{/usCountry}}ఇక టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సుమ బాగానే సంపాదిస్తోంది. ఆమె నెట్ వర్త్ సుమారు రూ.100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. టీవీ షోల కోసం ఒక్కో ఎపిసోడ్ కు సుమ రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం.
{{/usCountry}}ఇక మూవీ ఈవెంట్ల విషయానికి వస్తే సుమకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ డిమాండ్ ను బట్టే సుమ ఒక్కో మూవీ ఈవెంట్ కు రూ.8 నుంచి రూ.10 లక్షల వరకూ తీసుకుంటుందని టాక్. ఇక వ్యాపార ప్రకటనలు, యూట్యూబ్ ఛానెల్ నుంచి కూడా సుమకు ఇన్ కమ్ వస్తుంది.
సినిమాల్లోనూ
అప్పట్లో వర్షం సినిమాలో ప్రభాస్ కు అక్కగా నటించిన సుమ ఆ తర్వాత చాలా కాలం పాటు బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. మళ్లీ 2022లో ‘జయమ్మ పంచాయతీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా ప్రియదర్శి హీరోగా నటించిన ‘ప్రేమంటే’ మూవీలో కానిస్టేబుల్ గా సుమ అలరించింది.