OTT Blast: ఈ ఓటీటీలో దీపావళి బ్లాస్ట్.. ఒకే రోజు మూడు తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు.. థ్రిల్లర్, కామెడీ, ఎమోషనల్
OTT Blast: దీపావళి పండుగకు సన్ నెక్ట్స్ ఓటీటీ వరుస సినిమాలతో బ్లాస్ట్ చేసేసింది. ఒకే రోజు తెలుగు, తమిళ, మలయాళం భాషలకు చెందిన మూడు సినిమాలను తీసుకొచ్చింది. కామెడీ, థ్రిల్లర్, స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా జానర్ల సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో చూడండి.
OTT Blast: దీపావళి పండుగ వాతావరణంలో కుటుంబ సమేతంగా ఇంట్లోనే కూర్చుని సరికొత్త సినిమాలను చూడాలనుకునే ఓటీటీ ప్రేమికులకు సన్ నెక్ట్స్ (Sun NXT) తీపి కబురు అందించింది. 'దివాలీ బ్లాస్టు.. మూవీ ఫీస్టు' (Diwali Blast-u Movie Feast-u) పేరుతో సౌత్ ఇండస్ట్రీలోని మూడు విభిన్న భాషల నుంచి ఆకట్టుకునే చిత్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. యాక్షన్, థ్రిల్లర్, ఎమోషన్, కామెడీ అంశాలతో నిండిన ఈ మూడు సినిమాలు ఏంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1. బా బా బ్లాక్ షీప్ (Baa Baa Black Sheep - Telugu)
జోనర్: ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కామెడీ
ప్రత్యేకత: హాయిగా నవ్వుకునే ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్
స్టోరీ ఏంటంటే: తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం 'బా బా బ్లాక్ షీప్'. మహాత్మా గాంధీకి చెందిన ఓ అరుదైన గడియారం చుట్టూ తిరిగే కథ ఇది. ఇది అనుకోకుండా ఆరుగురి చేతుల్లోకి వెళ్తుంది. 24 గంటల వ్యవధిలో ఇది వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? ఆ తర్వాత ఏం జరిగిందన్నది అసలు కథ.
2. ఐసీయూ (ICU - Malayalam)
జోనర్: గ్రిప్పింగ్ సస్పెన్స్, మెడికల్ థ్రిల్లర్
ప్రత్యేకత: ఊపిరి బిగపట్టి చూసే థ్రిల్లర్
స్టోరీ ఏంటంటే?: మలయాళం చిత్రాలకు ఉండే ప్రత్యేకమైన కథనం, సహజత్వంతో కూడిన నటన 'ఐసీయూ' (ICU) చిత్రంలో కనిపిస్తుంది. ఒక ఆసుపత్రిలోని ఐసీయూ వార్డు నేపథ్యంలో జరిగే నాటకీయ పరిణామాలు, మనుషుల మానసిక సంఘర్షణలు, నరనరాల్లో ఉత్కంఠ రేకెత్తించే ట్విస్టులతో ఈ సినిమా సాగుతుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ వాచ్.
3. ది గ్రాండ్ మాస్టర్ (The Grand Master - Tamil)
జోనర్: స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా
ప్రత్యేకత: పిల్లలకు ఇన్‌స్పిరేషన్ కలిగించే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో సాగే ఎమోషన్
స్టోరీ ఏంటంటే?: తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన 'ది గ్రాండ్ మాస్టర్' చిత్రం ఇంటెన్స్ ఎమోషన్స్, మైండ్ గేమ్‌లతో కూడిన డ్రామాగా తెరకెక్కింది. చెస్ నేర్చుకోవాలని కలలు కనే ఓ పదేళ్ల కుర్రాడి చుట్టూ తిరిగే ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ పండుగకు ఏ సినిమా చూడాలి?
మీరు కనుక మీ కుటుంబంతో సరదాగా నవ్వుకోవాలనుకుంటే బా బా బ్లాక్ షీప్ సరిగ్గా సరిపోతుంది. సస్పెన్స్, ఎమోషన్ కోరుకునే వారికి ICU, సీరియస్ డ్రామాను ఆస్వాదించే వారికి ది గ్రాండ్ మాస్టర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
సన్‌నెక్ట్స్ ఓటీటీలో ఈ మూడు చిత్రాలు ప్రస్తుతం హెచ్‌డీ క్వాలిటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ పండుగ వీకెండ్‌లో ఈ సినిమాలను మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకుని చూడండి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


