...
...
Next Story

Power Peta: రక్తంతో తడిసిన చెస్ బోర్డ్.. మధ్యలో ఎర్ర గులాబీ.. సందీప్ కిషన్ హీరోగా పవర్ పేట.. అదిరిపోయిన పోస్టర్

Power Peta: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కొత్త సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతున్నాడు. పవర్ పేట అనే పవర్ ఫుల్ టైటిల్ తో అతని సినిమా తెరకెక్కబోతుంది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ వైరల్ గా మారింది.

Published on: Apr 16, 2026, 13:43:45 IST
Advertisement

Power Peta: రక్తంతో తడిసిన చెస్ బోర్డు, పావులు.. మధ్యలో ఎర్ర గులాబీ.. ఇలా సందీప్ కిషన్ కొత్త సినిమా పోస్టర్ ను పవర్ ఫుల్ గా రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీకి ‘పవర్ పేట’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. సందీప్ కిషన్ సినిమాల్లోకి వచ్చి 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇవాళ ఈ టైటిల్ ను అనౌన్స్ చేశారు.

పవర్ పేట

సందీప్ కిషన్ కొత్త సినిమా పోస్టర్ (x/sundeepkishan)
సందీప్ కిషన్ కొత్త సినిమా పోస్టర్ (x/sundeepkishan)

సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘పవర్ పేట’. ఈ మూవీ టైటిల్ ను గురువారం (ఏప్రిల్ 16) అనౌన్స్ చేశారు.

‘‘16 ఏళ్ల సినిమా, మీ ప్రేమ, రక్తం, పట్టుదల. ప్రతి అడుగుకు, ప్రతి పాఠానికి, మీరు నాకిచ్చిన ప్రతి ప్రేమకు రుణపడి ఉన్నా. ఇది నా తర్వాతి ఛాప్టర్.. పవర్ పేట. ఇది ప్రేమ, గౌరవం, రాజకీయాలకు సంబంధించిన స్టోరీ. ఎప్పటిలాగే మీ ప్రేమ కావాలి’’ అని సందీప్ కిషన్ ఎక్స్ లో పోస్టు పెట్టాడు.

చివరకు సందీప్ తో

పవర్ పేట సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నట్లు టాక్. ఏలూరులో పవర్ పేట అనే ప్లేస్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో ఆ నేటివిటీని చూపించే అవకాశం ఉంది. ఈ మూవీ ప్రధానంగా ప్రేమ, గౌరవం, రాజకీయాల చుట్టూ తిరుగుతుందని సందీప్ కిషన్ తన పోస్టుతో క్లారిటీ ఇచ్చేశాడు.

16 ఏళ్లు

సందీప్ కిషన్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లు పూర్తయ్యాయి. దేవా కట్టా డైరెక్షన్ లో వచ్చిన ‘ప్రస్థానం’ మూవీతో సందీప్ జర్మీ మొదలైంది. ఆ మూవీ ఏప్రిల్ 16, 2010న రిలీజైంది. ఆ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన సందీప్ కిషన్.. ఆ తర్వాత హీరోగా మారాడు.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రారా కృష్ణయ్య’, ‘బీరువా’, ‘టైగర్’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’, ‘గల్లీ రౌడీ’, ‘రాయన్’ తదితర సినిమాలతో సందీప్ కిషన్ అలరించాడు. ప్రస్తుతం దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో ‘సిగ్మా’ అనే సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks