చిన్న సినిమాలను ప్రమోట్ చేయడంలో యంగ్ హీరో సందీప్ కిషన్ ఎప్పుడూ ముందే ఉంటాడు. తాజాగా పతంగ్ మూవీని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మూవీ లవర్స్ కు సందీప్ కిషన్ ఓ బంపరాఫర్ ఇచ్చాడు. పతంగ్ సినిమా 500 టికెట్లు ఫ్రీగా ఇవ్వడంతో పాటు తన వివాహ భోజనంబు రెస్టారెంట్లలో 20 శాతం డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు.
పతంగ్ సక్సెస్ మీట్

పతంగ్ మూవీ సక్సెస్ మీట్ లో సందీప్ కిషన్ కామెంట్లు వైరల్ గా మారాయి. ఇవాళ (డిసెంబర్ 27) పతంగ్ మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. దీనికి సందీప్ కిషన్ గెస్ట్ గా వచ్చాడు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కోసం నా సైడ్ నుంచి రేపు థియేటర్లో చూసేందుకు 500 టికెట్లు ఇస్తా. ఆదిత్య మేరుగు ట్విటర్ ఐడీ ఇస్తా. అతణ్ని సంప్రదించండి. ఇది కాకుండా మొన్న శంబాలకు కూడా చెప్పా. ఇప్పుడు కూడాపతంగ్ కు అదే చెప్తున్నా. ఈ సినిమా టికెట్ తీసుకుని వెళ్తే నా వివాహ భోజనంబు రెస్టారెంట్లలో 20 శాతం డిస్కౌంట్ ఇస్తా’’ అని తెలిపాడు.
టికెట్స్ కావాలంటే
పతంగ్ సినిమా డిసెంబర్ 25న రిలీజైంది. ఇది యూత్ ఫుల్ ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ సినిమాను ఆదివారం (డిసెంబర్ 28) చూడాలనుకుంటే, సందీప్ కిషన్ ఇచ్చే టికెట్లు పొందాలనుకుంటే ఇలా చేయండి. సందీప్ కిషన్ తన ట్విటర్ ఐడీలో పోస్టు కూడా పెట్టాడు. అతను చెప్పినట్లుగా ఆదిత్య మేరుగును కాంటాక్ట్ కావాలి.
అబ్బాయిలను ప్రేమించే అమ్మాయి
ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనగానే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించే అబ్బాయి సినిమాలే గుర్తుకొస్తాయి. కానీ పతంగ్ మూవీ మాత్రం ఇద్దరు అబ్బాయిలను ఒకేసారి ప్రేమించే అమ్మాయి కథ. ఈ సినిమాలో వంశీ పూజిత్, ప్రణవ్ కౌవిక్, ప్రీతి పగడాల, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీబీ చరణ్ తదితరులు నటించారు. దీనికి ప్రణీత్ పత్తిపాటి డైెరెక్టర్.
సందీప్ సినిమాలు
{{/usCountry}}ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనగానే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించే అబ్బాయి సినిమాలే గుర్తుకొస్తాయి. కానీ పతంగ్ మూవీ మాత్రం ఇద్దరు అబ్బాయిలను ఒకేసారి ప్రేమించే అమ్మాయి కథ. ఈ సినిమాలో వంశీ పూజిత్, ప్రణవ్ కౌవిక్, ప్రీతి పగడాల, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీబీ చరణ్ తదితరులు నటించారు. దీనికి ప్రణీత్ పత్తిపాటి డైెరెక్టర్.
సందీప్ సినిమాలు
{{/usCountry}}2025లో మజాకా అంటూ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు సందీప్ కిషన్. కానీ అది అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు సందీప్ తెలుగులో వైబ్, తమిళంలో సిగ్మా సినిమాలు చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ సినిమాలపైనా ఫోకస్ చేస్తున్నాడు సందీప్.